E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీకి మైండ్ బ్లాక్.. గోపికకు నిజం చెప్పిన మహా.. కత్తి పట్టిన నారాయణ.

Podarillu Today Episode : చక్రీకి మైండ్ బ్లాక్.. గోపికకు నిజం చెప్పిన మహా.. కత్తి పట్టిన నారాయణ.
Advertisement

Podarillu Today Episode October 2nd: గోపిక తలుపులు తీయకుండా అలానే బాధ పడిపోతూ ఉంది కదా.. నేను వెళ్లి తనతో నిజం చెప్తాను అని మహాలక్ష్మి అనగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. వెళ్లి చక్రిని తీసుకురారా ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడడానికి నేను ఏమైనా చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది.. మీరు అంత పెద్ద సాహసం చేయకండి నేనే చూసుకుంటాను అని చక్రి ఎంత చెప్తున్నా సరే మహా మాత్రం అసలు వినకుండా.. కన్నా మనిద్దరం వెళ్లి ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడదాం దగ్గరుండి నేను చక్రికి గోపికకి పెళ్లి చేస్తాను. అని చాలా కోపంగా మహాలక్ష్మి వెళ్లడంతో.. చక్రి అన్నయ్య నువ్వైనా చెప్పు అన్నయ్య మహాలక్ష్మి వెళ్లి అక్కడ ఏదో ఒకటి చేసేలా కనిపిస్తుంది. వెళ్ళనివ్వరా నువ్వు ఇన్ని రోజులు గోపిక గోపిక అని తన వెనకాల తిరిగావు కదా ఇప్పుడు మహాలక్ష్మి వెళ్లి మాట్లాడుతుంది కదా నువ్వెందుకు భయపడిపోతున్నావు అని మాధవ్ అంటాడు. చక్రి మాత్రం టెన్షన్ పడిపోతూనే ఉంటాడు.

కన్నా ఫుల్ హ్యాపీ..

మహాలక్ష్మి అలాగే కన్నా ఇద్దరు కూడా.. స్కూటీ తీసుకుని బయటికి వెళ్ళగానే ఇప్పుడు ఎందుకు వదిన చక్రి అన్నయ్య నేను ఏదో ఆట పట్టిద్దామని చేశాడు అంతేకానీ ఇలా అవుతుందని అసలు అనుకోలేదు కదా నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అని అడుగుతాడు. కానీ మహాలక్ష్మి అర్థం . మాకు పెళ్లయిందన్న విషయం తెలుసు. అయితే మరొక అమ్మాయిని తన జీవితంలోకి రానివ్వాలి అని అనుకున్నాడు అది తప్పు కదా.. మరి ఏం చేయమంటావు. మీ అన్నయ్యకి బుద్ధి వచ్చేలా చేయాలి అని మహా అనగానే కన్నయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు..

గోపిక మనసు మార్చిన మహా.. 

Advertisement

గోపిక సూసైడ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయితే ఇదంతా చేసిన చక్రి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చక్రీని వదిలిపెట్టను గోపికకు ఏమైనా అయితే అని అంటారు. చక్రి ఏరోజైనా గోపికను ప్రేమిస్తున్నానని చెప్పాడా లేదుగా గోపికనే తన మీద ఆశలు పెంచుకుంది. చక్రి నీ ఒక్క మాట అన్నా కూడా అసలు ఊరుకోను అని మహాలక్ష్మి అందరితో వార్నింగ్ ఇస్తుంది. ఇక గోపిక నేను చక్రి భార్యను వచ్చాను అనే చెప్పగానే తలుపుతీస్తుంది. తను ఒక చీటర్ అలాంటి వ్యక్తిని నేను నమ్మి మోసపోయాను. ఇప్పుడు మీరు తనది ఏమీ తప్పులేదు. నాదే తప్పు అని చెప్పడానికి వచ్చారా అని గోపిక అంటుంది. అయితే మహాలక్ష్మి తనది తప్పు కాదు నీది తప్పు కాదు నీ వయసుది తప్పు అంటూ తనకి నిజాలు చెప్పడంతో గోపిక సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన ను వదిలేస్తుంది. మొత్తానికి మహాలక్ష్మి అనుకున్న ప్లాన్ ప్రకారం గోపిక మనసుని మార్చేస్తుంది.

చక్రిని ఆడుకున్న కేశవ.. 

పెళ్లి వాళ్ళు వస్తున్నారు కదా చక్రికి రెండో పెళ్లి అంటే ఇంటిని మొత్తం శుభ్రం చేయాలి అని అటు మాధవ్, కేశవ ఇద్దరూ కూడా పనులు చేస్తున్నట్టు నటిస్తారు కానీ చక్రి ఎందుకురా నన్ను ఇలా ఆడుకుంటున్నారు అంటే నువ్వు ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నప్పుడు లేదా.. మీ ఆవిడ వెళ్ళింది కదా సంబంధం కుదుర్చుకొని గోపికను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని.. మహాలక్ష్మి ఎలాగైనా సరే గోపికని వాళ్ళ పేరెంట్స్ ని తీసుకుని వస్తుంది. కాబట్టి మీరు బాధపడాల్సిన పనిలేదు. ఈ ఇంటికి మళ్ళీ రెండు కోడలు రాబోతుంది అంటూ ఆ ఇద్దరు ఆడుకోవడంతో చక్రి ఎందుకురా నన్ను ఇలా చంపుతున్నారు. నేను ఏ రోజు అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు కదా. మహాలక్ష్మి నీ పెళ్లి చేసుకున్నాను తనకి ఇష్టం లేకపోయినా తనే నా భార్య అని చక్రి అనుకుంటాడు. నీ కేశవ మాత్రం తను నిన్ను ఎప్పుడు భర్త ఊహించుకోలేదు కదా అని ఆడుకుంటాడు.

మహా ప్లాన్ సక్సెస్..

Advertisement

మహాలక్ష్మి చక్రిని ఆడుకుంటూనే గోపికని కన్విన్స్ చేస్తుంది. కేశవ కన్నా కి ఫోన్ చేసి ఎంతమంది వస్తున్నారు రా? స్వీట్ చేయమంటావా హార్ట్ చేయమంటావా అంటూ చక్రిని ఇంకాస్త భయపెట్టేలా అడుగుతాడు. మొత్తం నలుగురు వస్తున్నారా?.. అయితే పకోడి చేద్దాం నేను వెళ్లి స్వీట్లు తీసుకుని వస్తాను అంటూ అంత హడావిడి చేస్తూ ఉంటారు. కానీ నారాయణ మాత్రం ఏ చొక్క వేసుకోమంటావ్ ఏ పంచ్ కట్టుకోమంటావ్ అని మధ్యలో చక్రీని గెలుకుతూ ఉంటాడు.. నారాయణ మాటలకి చెక్కి చాలా ఆవేశంగా ఉంటాడు కానీ మహాలక్ష్మి నిజంగానే కోరికను తెచ్చి తనకి పెళ్లి చేస్తున్నా అంటూ భయపడిపోతూ ఉంటాడు. చక్రి భయపడి పోవడం చూసి మాధవ్ అలాగే కేశవ వీడికి తగిన శాస్త్రి జరిగింది మహాలక్ష్మి ఉడికించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అని మాధవ్ అంటాడు.

కత్తిపట్టిన నారాయణ.. 

నారాయణ పెళ్లి కొడుకు తండ్రి లాగా పట్టు పంచ చొక్కాలో బ్రహ్మాండంగా రెడీ అయి కూర్చుంటాడు. అయితే మన ఇంటికి రెండు కోడలు వస్తుంది కదా అని చాలా సంతోషంగా ఉంటాడు నారాయణ. నారాయణ మాటలు విని చక్రి భయపడిపోతూ ఉంటాడు. అయితే వీళ్ళు నాకు నిజంగానే పెళ్లి చేసుకున్నారు నాకు మహాలక్ష్మి అంటే చాలా ఇష్టం కదా ఎందుకు మీరు అర్థం చేసుకోవడం లేదు నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు అంటూ చక్రి తెగ కంగారు పడిపోతూ ఉంటాడు. నారాయణ చక్రి బాత్ రూమ్ కి వెళ్ళాలని ఎంత చెప్పినా సరే బాత్రూం ఇంట్లోనే ఉంది కదా బయటికి ఎందుకు అని అడుగుతాడు.. నేను బయటికి వెళ్ళాలి అని అనగానే కత్తి పట్టుకుని కూర్చుంటాడు. అయితే నేను దొడ్డి గుమ్మం నుంచి వెళ్ళిపోతాను అని చక్రి అంటాడు. అక్కడ తాళం వేసి ఇటు వచ్చి ఇక్కడ కూర్చున్నాను అని నారాయణ చక్రిని ఒక ఆట ఆడుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి డెడ్ లైన్.. నర్మద నిజం బయపెట్టేస్తుందా..? మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో రికార్డ్.. మీనాకు రింగ్ గిఫ్ట్.. రోహిణికి షాక్…

Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కరిగిపోయిన మీనాక్షి.. పార్వతికి నిజం చెప్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి డెడ్ లైన్.. నర్మద నిజం బయపెట్టేస్తుందా..? మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Karthika Deepam 2 Serial Today Episode October 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిక షాక్ ఇచ్చిన జ్యోత్స్న – సూరజ్ పీఏగా జ్యోత్స్న            

Saturday Tv Movies :శనివారం టీవీ సినిమాలు..ఏ ఒక్కటి మిస్ చెయ్యొద్దు..

Ninnu kori Serial Today Episode October 3rd ‘నిన్ను కోరి’ సీరియల్‌: నీలగిరి నిజ స్వరూపం చంద్ర పసిగడుతుందా..?  

తిరిగితే తప్పేంటీ…తల్లితో విదేశీ పర్యటనలపై సుప్రత ఫైర్!

Big Stories

Advertisement
×