E-Paper
Advertisement

అగ్నిపరీక్ష జడ్జెస్ ను ఏకిపారేసిన గీతూ రాయల్.. రూల్స్ తెలుసా?

అగ్నిపరీక్ష జడ్జెస్ ను ఏకిపారేసిన గీతూ రాయల్.. రూల్స్ తెలుసా?
Advertisement

Geetu Royal: గీతూ రాయల్.. లేడీ ఫైర్ బ్రాండ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా , యూట్యూబర్ గా, రియాలిటీ టీవీ పర్సనాలిటీ గా తనకంటూ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని, ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. అద్భుతమైన వాక్చాతుర్యంతో.. వ్యూహాత్మక ఆటతో అభిమానులను, విమర్శకులను సైతం ఆకర్షించింది. అలాంటి ఈమె బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా కూడా వ్యవహరించి మాజీ కంటెస్టెంట్స్ ను తనదైన మాట తీరుతో ప్రశ్నలతో ఇరుకున పెట్టేసి షో టి ఆర్ పి రేటింగ్ పెంచడంలో తన వంతు ప్రయత్నం చేసింది.

అగ్నిపరీక్ష జడ్జెస్ ను ఏకిపారేసిన గీతూ రాయల్..

అలాంటి ఈమె అప్పుడప్పుడు వివాదాల్లో కూడా చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈసారి మాత్రం ఏకంగా అగ్ని పరీక్ష జడ్జెస్ ను ఏకిపారేస్తూ తనదైన స్టైల్ లో విరుచుకుపడింది . అసలు రూల్స్ తెలుసా? తెలియవా? అంటూ తనదైన శైలిలో మండిపడింది. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన వీడియోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది గీతూ రాయల్. మరి గీతూ రాయల్ అగ్నిపరీక్ష జడ్జెస్ పై ఆగ్రహం వ్యక్తం చేయడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆర్మ్ రెస్టింగ్ గేమ్ లో మోసం జరిగిందా?

Advertisement

బిగ్ బాస్ సీజన్ 10 సెప్టెంబర్ 6వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే సామాన్యులను ఆరుగురిని హౌస్ లోకి పంపించడానికి అగ్ని పరీక్ష పేరిట సామాన్యులకు పెద్ద ఎత్తున టాస్కులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే లేటెస్ట్ ఎపిసోడ్ లో నిర్వహించిన టాస్క్ లో జరిగిన ఒక తప్పిదాన్ని ఆమె ప్రస్తావించారు. విషయంలోకి వెళ్తే.. లేటెస్ట్ అగ్నిపరీక్ష ఎపిసోడ్ ప్రోమో చూడగానే.. అక్కడ నిర్వహించిన ఆర్మ్ రెస్టింగ్ (Arm wresting) టాస్క్ లో రోహిత్ గెలవడంతో.. అబ్బబ్బా మితిలేష్ కండలు చూడు.. ఆ బాడీ , ఆ స్ట్రెంత్.. యాడో ఉంటాడు అనుకున్నాను..కానీ రోహిత్ ఏ బాడీ లేకపోయినా ఇంత స్ట్రెంత్ ఉపయోగించి సూపర్ గా గెలిచాడు అని.. అసలు ప్రోమో చూడగానే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి.

also read:బేబీ నక్షత్ర జీవితంలో ఇంత విషాదమా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్!

గీతూ రాయల్ ఏమన్నారంటే ?

Advertisement

అయితే తర్వాత నేను ఆ ప్రోమో ని డీప్ గా అబ్జర్వ్ చేస్తే.. ఏమనిపించింది అంటే.. రోహిత్ తన చేయి సపోర్టు మాత్రమే కాకుండా.. స్టాండ్ మీద కాలు పెట్టి.. అంటే అక్కడ ఆట కోసం ఉపయోగించిన స్టాండ్ కింద లెగ్ రెస్ట్ పైన కాలు పెట్టి తన మొత్తం బాడీ స్ట్రెంత్ ఉపయోగించి ఆర్మ్ రెస్టింగ్ లో గెలిచారు అని నేను క్లియర్ గా అబ్జర్వ్ చేశాను. అయితే ఇది తొండా లేదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఆర్మ్ రెస్టింగ్ రూల్స్ నాకు తెలియదు. కాళ్లు దూరంగా పెట్టి చేయి మాత్రం ఉపయోగించి ఆడాలా లేక కాలు సపోర్టు , ఫుల్ బాడీ సపోర్ట్ తీసుకుని కూడా ఈ ఆట ఆడొచ్చా అనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే ఎవరికైనా ఆర్మ్ రెస్టింగ్ లో రూల్స్ తెలిసుంటే కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అలా కాలు సపోర్టు తీసుకొని రోహిత్ గెలవడం కరెక్టా లేక అలా కూడా ఆడొచ్చా.. ఒకవేళ మితిలేష్ కూడా అలా కాలు సపోర్ట్ తీసుకుని గెలిచి ఉండొచ్చు కదా.. అది రోహిత్ స్ట్రాటజీ అంటారా ..అది మీ ఇష్టం . కామెంట్ బాక్స్ లో అసలు విషయం నాకు చెప్పండి అంటూ తెలిపింది . మొత్తానికైతే ఈ విషయాన్ని ఆమె హైలెట్ చేస్తూ అటు జడ్జెస్ గా ఉన్న నవదీప్(Navdeep ), బిందు మాధవి(Bindhu madhavi), అభిజిత్ (Abhijeeth) లను ఇండైరెక్టుగా ఏకీపారేస్తోంది అంటూ కామెంట్ బాక్స్ లో నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు .ఏది ఏమైనా గీతూ రాయల్ లేవనెత్తిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

Related News

రామ్ ప్రసాద్ బిహేవియర్ మార్చుకో.. అపూర్వ గుట్టు బయటపెట్టిన శాలిని!

అర్ధరాత్రిళ్లు ఏంటా పనులు.. శాలిని, రోహిత్‌లకు షాకిచ్చిన నాగ్, ఝాన్సీ కన్నీళ్లు!

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్..!

Intinti Ramayanam Kamal : అయ్యో.. కమల్ అవుట్.. ఇదేం ట్విస్ట్ మామా..

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Big Stories

Advertisement
×