E-Paper
Advertisement

బిచ్చమెత్తే వృద్ధురాలి మృతి.. ఇంట్లో చూడగా అందరూ షాక్.. 30 మూటల్లో డబ్బే డబ్బు!

బిచ్చమెత్తే వృద్ధురాలి మృతి.. ఇంట్లో చూడగా అందరూ షాక్.. 30 మూటల్లో డబ్బే డబ్బు!
Advertisement

Beggar Savings: సాధారణంగా బిచ్చగాళ్లను చూస్తే ప్రతీ ఒక్కరి హృదయం చలించిపోతుంది. ఎండ, వాన, చలి అన్న తేడా లేకుండా వారు పొట్టకూటి కోసం నిత్యం రోడ్లపై భిక్షాటన చేస్తుంటారు. దాతలు ఇచ్చే డబ్బుతో జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ వృద్ధురాలు.. గత 50 ఏళ్లుగా బిక్షాటన చేస్తూ అనారోగ్యం కారణంగా ప్రాణాలు విడిచింది. ఈ క్రమంలో ఆమె ఇంటిని స్థానికులు పరిశీలించగా.. అక్కడ కనిపించింది చూసి ఒక్కసారిగా వారంతా షాకయ్యారు. ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలను చూసి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అసలేం జరిగిందంటే?

కర్ణాటకలోని మండియా జిల్లాకు చెందిన 68 ఏళ్ల నూర్ అనే వృద్ధురాలు.. ఆదివారం (ఆగస్టు 23) వయోభారంతో కన్నుమూసింది. సొంత ఊరిలో అడుక్కుంటూ జీవనం సాగిస్తున్న ఆమె ఇంటిని స్థానికులు వెళ్లి పరిశీలించారు. ఈ క్రమంలో ఇంట్లోని గదిలో ఏకంగా 30కి పైగా గోనె సంచులు కనిపించాయి. వాటిని విప్పి చూడగా రూ.10, రూ.20, రూ.50 నోట్లు, నాణెంల రూపంలో కొండలా పేరుకుపోయిన నగదు బయటపడింది.

Advertisement

ఒంటరి జీవితం.. పైసా పైసా పొదుపు

నూర్ తన సోదరితో కలసి ఆ అద్దె ఇంట్లో నివస్తోంది. అయితే వారిద్దరికి వివాహం కాలేదు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ఆమె సోదరి చనిపోవడంతో హూర్ అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటోంది. రోజువారీగా భిక్షాటన ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని ఆమె ఎంతో భద్రంగా దాచుకుంటూ వచ్చింది. మరణాంతరం ఆ డబ్బు బయటపడటంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Advertisement

Also Read: తిరుపతిలో కలకలం.. హోంమంత్రి అనితపై పడ్డ డ్రోన్.. చేతికి గాయం!

ఒక్క రూపాయి అనుభవించకుండానే..

దాదాపు 30 సంచుల్లో డబ్బు బయటపడటంతో.. స్థానికులు దానిని లెక్కించడం ప్రారంభించారు. గంటల తరబడి లెక్కించగా ఆ సంచుల్లో మొత్తం రూ.8,40,000 నగదు ఉన్నట్లు తేలింది. జీవితమంతా కష్టపడి కూడబెట్టిన ఆ సొమ్మును చివరికి ఆమె సోదరులకు అప్పగించారు. అందులో ఒక సోదరుడు రూ.6 లక్షలు తీసుకోగా.. మరొక సోదరుడు తనకిచ్చిన రూ. 2.40 లక్షలను స్థానిక మసీదుకు విరాళంగా అందజేశారు. జీవితం మెుత్తం భిక్షాటన చేస్తూ రూపాయి రూపాయి దాచుకున్నా హూర్.. చివరికి దాన్ని అనుభవించకుండానే కన్నుమూయడం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.

Also Read: ఫార్చ్యూనర్ కారులో వచ్చి.. రోడ్లు ఊడుస్తున్న పారిశుధ్య కార్మికుడు.. అస్సలు తగ్గేదేలే!

Tags

Related News

అష్టదిగ్బంధనంలో రాజధాని ఢిల్లీ.. 26 వేల మంది బలగాల మోహరింపు, లిక్కర్ షాపులు క్లోజ్

భర్తపై భార్య కాళికారూపం.. గొంతుపై కాలు పెట్టి పిల్లలతో కలిసి, ఒడిషాలో షాకింగ్ ఘటన

మెట్రో పనుల సమీపంలో కుంగిన రోడ్డు.. గుంతలో పడి బోల్తా కొట్టిన కారు

అమెజాన్ ఆఫీసు బయట పేలుడు.. పలువురికి గాయాలు, బెంగుళూరులో ఘటన

మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు

సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!

పెట్రోల్ బంక్ సీజ్ వివాదం.. ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!

నడిరోడ్డుపై పడుకుని ప్రియాంక నిరసన.. రాహుల్‌ను ఎత్తుకెళ్లిన పోలీసులు, ఢిల్లీలో హైటెన్షన్!

Big Stories

Advertisement
×