E-Paper
Advertisement

సీజేపీ సంచలన ప్రకటన.. మళ్లీ ఢిల్లీలో నిరసనలు.. కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్!

సీజేపీ సంచలన ప్రకటన.. మళ్లీ ఢిల్లీలో నిరసనలు.. కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్!
Advertisement

CJP Protest: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తూ.. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరోమారు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 5న దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సెప్టెంబర్ 5న ఢిల్లీలోని చారిత్రాత్మక ఇండియా గేట్ వద్ద ప్రారంభమయ్యే ఈ శాంతియుత ర్యాలీ.. అక్కడి నుంచి న్యూఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు కొనసాగుతుందని తెలిపింది. దేశంలోని యువత, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొంది.

Advertisement

ఈ సందర్భంగా కేంద్రంపై సీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘ఒక తరం నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, వారిని ఇళ్లకు పంపించేసి, ఆ తర్వాత ఇచ్చిన మాట నుంచి ప్రభుత్వం సైలెంట్‌గా వెనక్కి తగ్గడం ఎంతమాత్రం సరికాదు. ఇచ్చిన మాటను దాటవేసే ఈ నమ్మకద్రోహాన్ని మేము ఏమాత్రం సహించబోము’ అని పార్టీ స్పష్టం చేసింది.

Advertisement

Also Read: బిచ్చమెత్తే వృద్ధురాలి మృతి.. ఇంట్లో చూడగా అందరూ షాక్.. 30 మూటల్లో డబ్బే డబ్బు!

ఈసారి చేపట్టబోయే నిరసనలను బాధితులే ముందుండి నడిపిస్తారని సీజేపీ వెల్లడించింది. నీట్ పేపర్ లీకేజీ కారణంగా తమ పిల్లలను, వారి భవిష్యత్తును కోల్పోయిన కుటుంబాలు, అలాగే పోలీసుల దౌర్జన్యాలకు గురైన బాధితులు స్వయంగా ఈ మార్చ్‌కు నాయకత్వం వహిస్తారని పార్టీ తెలిపింది. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేసింది.

Also Read: గుజరాత్‌కు ఓ న్యాయం.. తెలంగాణకు మరో న్యాయమా? ప్రధానిపై సీఎం రేవంత్ ఫైర్!

Tags

Related News

కాళ్లను గొలుసులతో కట్టేసి.. నదిలో నవ దంపతుల మృతదేహాలు!

‘మొత్తం నగరాన్ని బంద్ చేయడం ఏంటి’? ఢిల్లీ లాక్‌డౌన్‌పై సుప్రీంకోర్టు సీరియస్

అష్టదిగ్బంధనంలో రాజధాని ఢిల్లీ.. 26 వేల మంది బలగాల మోహరింపు, లిక్కర్ షాపులు క్లోజ్

భర్తపై భార్య కాళికారూపం.. గొంతుపై కాలు పెట్టి పిల్లలతో కలిసి, ఒడిషాలో షాకింగ్ ఘటన

మెట్రో పనుల సమీపంలో కుంగిన రోడ్డు.. గుంతలో పడి బోల్తా కొట్టిన కారు

అమెజాన్ ఆఫీసు బయట పేలుడు.. పలువురికి గాయాలు, బెంగుళూరులో ఘటన

మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు

సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!

Big Stories

Advertisement
×