BigTV English

Modi : పట్టాలపైకి మరో 5 వందే భారత్ రైళ్లు.. భోపాల్ నుంచి ప్రారంభించిన మోదీ..

Modi : పట్టాలపైకి మరో 5 వందే భారత్ రైళ్లు.. భోపాల్ నుంచి ప్రారంభించిన మోదీ..

Modi : వందే భారత్‌ రైళ్ల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకే రోజు 5 కొత్త వందే భారత్‌ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టాయి. ప్రధాని మోదీ ఈ రైళ్లను భోపాల్ నుంచి ప్రారంభించారు.


మంగళవారం ఉదయం భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ కు ప్రధాని మోదీ చేరుకున్నారు. భోపాల్‌-జబల్‌పుర్‌, ఖజురహో-భోపాల్‌-ఇండోర్, హతియా-పాట్నా, ధార్వాడ్‌-బెంగళూరు, గోవా-ముంబై వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు జెండా ఊపారు. రెండు రైళ్లకు డైరెక్ట్ గా జెండా ఊపారు. మిగతా 3 రైళ్లను వర్చువల్‌ విధానంలో మోదీ ప్రారంభించారు. ఈ సమయంలో వందే భారత్‌ రైల్లో చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్‌ మంగుభాయ్‌ పటేల్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభించడం విశేషం.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×