Modi Next Step: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ రాజీనామా చేయడం అంత ఈజీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నీట్ పేపర్ లీకేజీ విషయంలో ధర్మేంద్ర రాజీనామా కోరుతూ కాక్రోచ్ పార్టీ, జెన్‌జీ మూకుమ్మడిగా జంతర్‌మంతర్ వేదికగా చేసిన పోరాటానికి మోడీ తలొగ్గాల్సి వచ్చింది. యువత నిరసనలపై పోలీసుల చర్యతో మరింత బద్నామైంది కేంద్రం. అందుకే వీటిన్నింటికీ తక్షణ పరిష్కారంగా ధర్మేంద్రను రాజీనామా చేయించడమేనని వెనక్కి తగ్గారు మోడీ. దీన్ని పరాజయం అనుకోలేదు. నష్ట నివారణగా చూశారు మోడీ. కానీ ఇప్పటి పరిస్థితి దీనికి పూర్తి భిన్నం.
మోడీ తీసుకునే నెక్ట్స్ స్టెప్ ఏంటీ?
SIRతో.. ఓ మరకైతే పడింది కేంద్ర సర్కార్‌పై. అది మామూలు ఆరోపణ కాదు. ఈ విషయంలో మోడీ తీసుకునే నెక్ట్స్ స్టెప్ ఏంటీ? అనే అంశం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇప్పటి దాకా కాంగ్రెస్ దీనిపై పోరాటాలు చేస్తోంది. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ కూడా ఎంటరైంది. జంతర్‌మంతర్ 2.0గా ఈ పోరాటానికి నామకరణం కూడా చేసుకున్నాయి కాక్రోచులు. జ్ఞానేశ్ రాజీనామా చేయకపోతే.. ఈ నెల 10న జంతర్ మంతర్ చేరుకుంటామని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాక్రోచ్ పార్టీ కన్వీనర్ అభిజిత్ దీప్కే ప్రకటించారు. ముంబయి శివాజీ పార్క్ వద్దకు పోలీసులు ఎన్ని నిర్బంధాలు విధించిన యువత చొచ్చుకొచ్చారు. ఇప్పుడు జంతర్ మంతర్ వద్దా అదే పరిస్తితి ఉంటుందని కేంద్రానికి తెలుసు. అందుకే జెన్‌జీని ఆయన లైట్‌గా తీసుకోవడం లేదు. మరి, మోడీ సర్కార్.. ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది ? ఈ ఇష్యూను ఎదుర్కొనే వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: హైదరాబాద్ OYO రూమ్‌లలో వరుస హత్యలు.. 10 రోజుల్లో ముగ్గురు అమ్మాయిల బలి.. అసలు ఏం జరుగుతోంది?