E-Paper
Advertisement

హైదరాబాద్ OYO రూమ్‌లలో వరుస హత్యలు.. 10 రోజుల్లో ముగ్గురు అమ్మాయిల బలి.. అసలు ఏం జరుగుతోంది?

హైదరాబాద్ OYO రూమ్‌లలో వరుస హత్యలు.. 10 రోజుల్లో ముగ్గురు అమ్మాయిల బలి.. అసలు ఏం జరుగుతోంది?
Advertisement

Hyderabad OYO Murders: లవ్‌బర్డ్స్ ఒకప్పుడు పార్కుల్లో వాలేవి.. ఇప్పుడు కాలం మారిపోయింది బ్రదర్‌.. నేరుగా ఓయో రూమ్‌ల్లో వాలిపోతున్నాయి. ఈకాలం ప్రేమికులు గులాబీలు ఇచ్చినంతా ఈజీగా గుండెల్లో కత్తులు దింపుతున్నారు. హైదరాబాద్‌ ఓయో, హోటల్స్ లో అమ్మాయిల వరుస మర్డర్స్ కలకలం సృష్టిస్తున్నాయి.

ఒక్కసారి ఈ డేట్‌లు చూడండి..

Advertisement

ఒక్కసారి ఈ డేట్‌లు చూడండి.. సెప్టెంబర్ 21 మాదాపూర్ సిద్ధిఖీ నగర్ OYO రూమ్ నంబర్- 303లో నిఖిత, సెప్టెంబర్ 29 ఎస్ఆర్ నగర్ గోకుల్ ప్రైడ్ ఓయో రూమ్ నెంబర్- 103లో శిరీష, అక్టోబర్ 2 మియాపూర్ హోటల్ గ్రాండ్ బ్రోచిల్ రూమ్‌ నెంబర్ 502లో సృజన. ఈ మూడు హోటల్స్‌లో ముగ్గురు అమ్మాయిలు బలి.. అసలు ఆ నాలుగు గోడల మధ్య ఏం జరుగుతుంది?

మొదటి కేసు..

Advertisement

మొదటి కేసులో నిందితుడిని పట్టుకొని జైలుకు పంపించారు పోలీసులు. విశాఖకు చెందిన నిఖిత, శ్రీనివాస రవితేజ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఇద్దరు మాదాపూర్‌లోని రూమ్‌కి వెళ్లారు. తెల్లాసరేసరికి నిఖిత ముఖంపై గాయాలు. తలపై వాపులు. రూమ్ గోడలు, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు. ఆమెతో వచ్చిన రవితేజ మాత్రం జంప్. వాడు డైరెక్ట్‌గా సొంతూరుకి వెళ్లి లైజాల్ తాగేశాడు. పోలీసులు ట్రీట్‌మెంట్ ఇప్పించి మరి రిమాండ్‌కు పంపించారు.

రెండో కేసు..

ఇది ఒక్క నిఖితతోనే ఆగిపోలేదు భయ్యా. కరెక్ట్ గా పది రోజులు తిరిగేసరికి ఎస్ఆర్ నగర్ ఓయోలో శిరీష అనే మరో అమ్మాయి హత్యకు గురైంది. ఈ కేసులో ఇద్దరు లవర్స్ తప్పుడు సమాచారం ఇచ్చి రూమ్‌ బుక్ చేసుకున్నారు. ఈ రెండు ఓయ్ రూముల్లో ఖాళీ అయిన ఫుల్‌ బాటిల్స్ కనిపించాయి. అంటే తప్పతాగి మద్యం మత్తులో చంపేశారా.. లేదంటే కావాలనే పక్కా ప్లాన్‌తో చంపేశారా అన్నది పోలీసులు తేల్చాలి.

మియాపూర్ కేసు..

ఇది జరిగి నాలుగు రోజులు గడవక ముందే, అక్టోబర్ 2న మియాపూర్‌లో కోమటి సృజన మిస్టరీ డెత్ సంచలనంగా మారింది. వరంగల్‌లో మెడిసిన్ చేస్తున్న సృజన హైదరాబాద్‌కు వచ్చి మియాపూర్‌ హోటల్‌లో శవంగా మారింది.

కీలక ప్రశ్నలు..

ఓయో రూమ్స్ అడ్డాలుగా చేసుకొని అమ్మాయిలను పొట్టనబెట్టుకుంటున్నారు ఈ లఫూట్ లవర్‌గాళ్లు.. మూడు ఘటనలు.. వేర్వేరు ప్రాంతాలు.. వేర్వేరు తేదీలు.. కానీ ఒక కామన్ పాయింట్ మాత్రం కనిపిస్తోంది హోటల్ రూమ్. ఇక్కడే అసలు సస్పెన్స్ ఉంది. ఒక హోటల్‌కి ఎవరొచ్చారు? ఓయో హోటల్స్‌లోకి వచ్చేవాళ్ల ఐడీ ప్రూఫ్స్ సరిగ్గా వెరిఫై చేస్తున్నారా? లేక పైసల కోసం మేనేజ్‌మెంట్లు గుడ్డిగా రూమ్స్ ఇచ్చి తప్పుకుంటున్నాయా? ఎవరితో చెక్ ఇన్ చేశారు? ఎంతసేపు ఉన్నారు? ఇవన్నీ హోటల్ రికార్డుల్లో ఉండాలి. CCTVలో ప్రతి కదలిక కనిపించాలి. మరి.. రూమ్‌లో ఏదైనా అనుమానాస్పదంగా జరిగితే.. హోటల్ సిబ్బందికి ముందే ఎందుకు తెలియదు? అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇచ్చారా? CCTV ఫుటేజ్ ఎంతవరకు భద్రంగా ఉంది? గెస్ట్ వెరిఫికేషన్‌ సరిగ్గా జరుగుతోందా? లేదా? ఇవన్నీ ఇప్పుడు కీలక ప్రశ్నలుగా మరాయి. మరి వాటికి హోటల్ నిర్వాహకులే సమాధానం చెప్పాలి.

Also Read: భూపాలపల్లి ఆస్పత్రిలో తప్పిన పెను ప్రమాదం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర ఆగ్రహం

Tags

Related News

భూపాలపల్లి ఆస్పత్రిలో తప్పిన పెను ప్రమాదం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర ఆగ్రహం

ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు.. ఈసారి ప్రత్యేకం ఏంటో తెలుసా?

పిచ్చోడికి గుడులు కూల్చడమే తెలుసా? రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్!

సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ మాస్టర్ స్ట్రోక్.. ఆ పద్మశాలి నేత ఎవరు? కాంగ్రెస్‌లో హీటెక్కిన రేస్!

బార్‌లో వార్.. రోడ్డుపై రివేంజ్! ఈసీఐఎల్ కారు యాక్సిడెంట్ వెనుక దాగిన కోణం ఇదే!

7 ఏళ్ల ఇన్‌స్టా పరిచయం.. పక్కా స్కెచ్‌తో హత్య.. డాక్టర్ సృజన కేసులో షాకింగ్ వివరాలు

విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే!

Big Stories

Advertisement
×