E-Paper
Advertisement

పీపీపీ పేరుతో రాష్ట్రం అమ్మకానికి? చంద్రబాబు, లోకేష్‌లపై పేర్ని నాని సంచలన ఆరోపణలు

పీపీపీ పేరుతో రాష్ట్రం అమ్మకానికి? చంద్రబాబు, లోకేష్‌లపై పేర్ని నాని సంచలన ఆరోపణలు
Advertisement

Perni Nani: ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం ప్రజా భాగస్వామ్య విధానం (PPP) చుట్టూ తీవ్రంగా వేడెక్కింది. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటేసి గెలిపించిన ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

ప్రజా ఆస్తుల ప్రైవేటీకరణపై తీవ్ర ధ్వజం

Advertisement

ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. మెడికల్ కాలేజీలు, రాజధాని విద్యుత్ సరఫరా, చివరికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సేవలను కూడా PPP పరిధిలోకి తెస్తూ జీవో 74 జారీ చేశారని విమర్శించారు. జగన్ హయాంలో ప్రభుత్వంలో విలీనం చేసి కాపాడిన ఆర్టీసీని, ఇప్పుడు ఉచిత బస్సు పథకం పేరుతో మళ్లీ అప్పుల ఊబిలోకి నెట్టి 12 డిపోలను ప్రైవేటీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలనపై విమర్శలు.. బీపీసీఎల్ డిమాండ్

Advertisement

ప్రస్తుత ప్రభుత్వం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతో ప్రజల పన్నుల సొమ్మును దోచిపెడుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రతి పనికీ డబ్బులు చెల్లించాల్సిందేనని, ఇప్పుడు జరుగుతుంది బాబు పాలన కాదని.. లోకేష్, ఆయన అనుచరుల కనుసన్నల్లోనే పాలన సాగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భయాందోళనల మధ్య ప్రజలు బతికే పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పేర్ని నాని డిమాండ్

ఇదే సమయంలో, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన బిపిసిఎల్ (BPCL) ఆయిల్ రిఫైనరీ కంపెనీని మచిలీపట్నంలోనే ఏర్పాటు చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఇది స్థానిక యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని స్పష్టం చేశారు.

Also Read: SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Tags

Related News

కాకినాడ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. చాట్‌జీపీటీ సాయంతో ప్లాన్.. అసలు సూత్రధారి అతడే!

ప్రియురాలి పీక కోసి.. బిల్డింగ్‌పై నుంచి దూకేసిన ప్రియుడు

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం.. మంత్రి నారాయణ కీలక ప్రకటన

శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. పరిశ్రమ బాయిల‌ర్‌లో భారీ పేలుడు.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి!

విశాఖ బీచ్‌లో విషాదం.. ముగ్గురు విద్యార్థులు గల్లంతు, నైట్ విజన్ కెమెరాలతో గాలింపు..

ఏపీలో సంచలనం.. తిరుపతి బీజేపీ నేత హత్యకు భార్య కుట్ర.. బయటపడ్డ షాకింగ్ నిజాలు!

ఆంధ్రా బిడ్డగా నన్ను భావించండి.. ఏం చెయ్యాలో చెప్పండి, తెలుగులో మాట్లాడిన అనంత్ అంబానీ

Big Stories

Advertisement
×