Big Stories

Moonlighting : పేద పిల్లల చదువుకోసం కూలీగా మారిన ఉపాధ్యాయుడు..

Moonlighting : పిల్లలు కోసం ఉచితంగా చదువుచెప్పే ఉపాధ్యాయులు చాలా మందే ఉంటారు. కానీ పిల్లల చదువుకోసం, వారి టీచర్ల వేతనం కోసం కూలీగా పనిచేసే ఉపాధ్యాయుడు బహుశా నగేషు పాత్రో లాగా చాలా అరుదుగా ఉంటారు. ఒడిశా గంజాం జిల్లాకు చెంది సీహెచ్ నగేశు పాత్రో పేద విద్యార్ధుల కోసం ఉచితంగా కోచింగ్ సెంటర్‌ను నడిపిస్తున్నారు. అందులో నలుగురు టీచర్చ వేతనం 10 వేల నుంచి 12వేల వరకు ఉంటుంది.

- Advertisement -

నేగేశ్ పాత్రో కూడా గెస్ట్ లెక్చరర్‌గా వేరే స్కూళ్లో పనిచేసున్నారు. ఆయన వేతనం రూ.8వేలు. స్కూళ్లో పనిచేసే ఉపాధ్యాయులకు అయ్యే ఖర్చును తీర్చడానికి రాత్రి వేళల్లో బరంపూర్ రైల్వే స్టేషన్‌లో కూలీగా పనిచేస్తున్నారు.

- Advertisement -

నగేశు పాత్రో కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా పదవ తరగతి పరీక్షకు హాజరుకాలేక పోయారు. దూర విద్యా ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. బరంపూరం యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పుచ్చుకున్నారు. తనలా ఏ పేద విద్యార్ధి చదువు కోసం కష్టపడవద్దనే ఉద్దేశ్యంతో పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నట్లు చెప్పారు.

కోవిడ్ సమయంలో లాక్‌డౌన్‌లో ఈ ఉచిత విద్యా కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. మొదట 8 తరగతి విద్యార్ధులకు మాత్రమే చెప్పే పాత్రో ఇప్పుడు విస్తరించి 12 తరగతి విద్యార్ధుల వరకు బోధిస్తున్నారు. నగేశు పాత్రో ఉచిత కోచింగ్ సెంటర్లో పేద విద్యార్ధులు హిందీ, ఒడియాతో పాటు ఇతర సబ్జెక్టులను నేర్చుకుంటున్నారు.

రైల్వే స్టేషన్లో కూలీలు ఎదుర్కొనే కష్టాలపైన కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలకు బదులుగా అనేక మంది ఎస్కలేటర్లు, ట్రాలీలు వాడుతున్నారని.. వీటి వల్ల కూలీలకు తీవ్ర నష్టం కలుగుతోందంటున్నారు పాత్రో. రైల్వే శాఖ మంత్రి కూలీల సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నగేశ్ పాత్రో.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News