Big Stories

Morbi Bridge మోర్బీ బ్రిడ్జ్ కేసులో.. ఉన్నతాధికారి సస్పెండ్..

- Advertisement -

Morbi Bridge Updates : మోర్బీ బ్రిడ్జ్ దుర్ఘటన కేసులో ఓ ప్రభుత్వ ఉన్నతాధికారిపై వేటు పడింది. మోర్బీ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్‌సిన్హ్ జాలాను గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మోర్బీ బ్రిడ్జ్ (Morbi Bridge) పునర్ని ర్మాణ కాంట్రాక్టు అప్పగింత తదితర అంశాల్లో జాలా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సుమారు 15ఏళ్ల పాటు మోర్బీ బ్రిడ్జ్ పునర్నిర్మాణ మరియు నిర్వహణ కాంట్రుక్టును ఒరెవా సంస్థకు అప్పగించారు. అయితే బ్రిటీష్ కాలం నాటి ఈ కేబుల్ బ్రిడ్జ్ పునర్నిర్మాణ పనితీరును మోర్బీ మున్సిపాలిటీ సరిగ్గా పరిశీలించలేదు.

- Advertisement -

మోర్బీ బ్రిడ్జ్ పున:ప్రారంభించే ముందు మోర్బీ మున్సిపాలిటీ సేఫ్టీ సర్టిఫికేట్ జారీ చేయాల్సి ఉంది. మోర్బీ మున్సిపాలిటీకి ఎలాంటి సమాచారం అందించకుండా ఒరెవా సంస్థ కేబుల్ బ్రిడ్జ్‌ను ప్రజలు వెళ్లడానికి ఓపెన్ చేసింది.

మోర్బీ బ్రిడ్జ్ దుర్ఘటనలో ఇప్పటివరకు సుమారు 135 మందికి పైగా మృతి చెందారు. ఈ కేసులో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఉన్నతాధికారి సస్పెండ్ అయ్యారు. మృతి చెందిన వారిలో చిన్నపిల్లలు, మహిళలే అధికంగా ఉండటం హృదయవిదారకరం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News