BigTV English

Mumbai Auto Driver: నో ఎంబీఏ.. ఆటోడ్రైవర్ ఆదాయం ఏడాదికి అర కోటిపైనే

Mumbai Auto Driver: నో ఎంబీఏ.. ఆటోడ్రైవర్ ఆదాయం ఏడాదికి అర కోటిపైనే

Mumbai Auto Driver: డబ్బు సంపాదించాలంటే అనేక మార్గాలు ఉంటాయి. ఆలోచనను పెట్టుబడిగా మార్చుకున్నాడు. సక్సెస్ అయ్యాడు పైన కనిపిస్తున్న ఆటోడ్రైవర్. నెలకు అతగాడి ఆదాయం అక్షరాలా 5 లక్షల నుంచి 8 లక్షల మధ్య ఉంటుంది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నరా? అక్కడికే వచ్చేద్దాం.


మారుతున్న రోజులకు అనుగుణంగా వెళ్లకుంటే ఉద్యోగాలు దొరకవని భావిస్తుంటారు నేటి యువత. బాగా చదువు చదివితే మంచి కంపెనీలో ఉద్యోగం. జీతం బాగా వస్తుందని భావిస్తుందని ఆలోచిస్తుంటారు. పైన కనిపిస్తున్న ఆటోడ్రైవర్‌కు అవేవీ తెలీవు. కేవలం ఆటో నడపడం మాత్రమే తెలుసు. అలాగని ఎంబీఏ లేదు. స్టార్టప్ కంపెనీ ఓనర్ అంతకంటే కాదు.

కేవలం పరిస్థితి అర్థం చేసుకుని ఆలోచనకు పదునుపెట్టాడు. రోజుకు 20 వేలుపైనే అతడి ఆదాయం. ఒక్కోసారి ఆ ఆదాయం అమాంతంగా పెరవచ్చు కూడా. రోజు వీసా ఇంటర్వ్యూలకు వచ్చే యువతకు పరిష్కరించే సలహా ఇస్తుంటాడు. అదే ఆ ఆటోడ్రైవర్ పని.


ముంబై సిటీ గురించి చెప్పనక్కర్లేదు. వేర్వేరు పనుల కోసం రోజూ సిటీకి లక్షల్లో ప్రజలు వస్తుంటారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లేవారు అమెరికా కాన్సులేట్ చుట్టూ వీసాల కోసం తిరుగుతారు. కనిపిస్తున్న ఆటో డ్రైవర్ యూఎస్ కాన్సులేట్ బయట బ్యాగ్ సేవలు అందిస్తాడు. అదే అతడి పని.

ALSO READ: అంతా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ బాధ్యత, తొక్కిసలాటపై సీఎం స్పందన

కాన్సులేట్‌లో వీసాల ఇంటర్వ్యూలకు హాజరయ్యే సందర్శకుల బ్యాగులను లోపలికి అనుమతించరు. అక్కడ లాకర్లు ఉండవు. బ్యాగులు తెచ్చుకున్నవారు పడిన ఇబ్బందులు తన కళ్లతో పరిశీలించాడు. ఆటో నడిపే బదులు వీసాల కోసం వచ్చేవారి బ్యాగులను తన ఆటోలో ఉంచుకుంటే బెటరని ఆలోచించాడు. పని అయిన తర్వాత వారిని నుంచి కొంత డబ్బులు తీసుకుంటే బెటరని భావించాడు.

ఒక్కో బ్యాగ్‌కు వెయ్యి రూపాయల చొప్పున తీసుకుంటాడు. రోజుకు 20 నుంచి 30 బ్యాగులు ఆయన వద్దకు వస్తుంటాయి. ఆటో డ్రైవర్ రోజువారీ సంపాదన 20 నుంచి 30 వేలు సంపాదిస్తున్నట్లు తెలిసింది. నెలకు చూసుకుంటే 5 నుండి 8 లక్షలు పైమాటే. ఏడాది ఆదాయం చూస్తే అర కోటిపైనే. ఆటో నడపకుండానే అతగాడు సంపాదన.

ఆటోలో ఎక్కువ బ్యాగులు పట్టవు. అలాంటప్పుడు సమీపంలో స్థానిక పోలీసులతో భాగస్వామ్యం కుదుర్చుకుని, అక్కడున్న కొంత స్థలాన్ని తీసుకుని అందులో బ్యాగులు ఉంచుతాడు. వీసాల ఇంటర్వ్యూల కోసం వచ్చినవారి బ్యాగులన్నీ అక్కడే ఉంటాయి. పై విషయాలను లెన్స్‌కార్ట్‌ వ్యవస్థాపకుడు రాహుల్ రూపానీ బయటపెట్టారు.

వీసా కోసం వెళ్లినప్పుడు ఆయనకు అలాంటి పరిస్థితి ఎదురైందని లింక్డ్‌ఇన్‌లో రాసుకొచ్చారు రాహుల్ రూపానీ. ‘‘సర్.. మీ బ్యాగ్ నాకు ఇవ్వండి.. నేను దానిని సురక్షితంగా ఉంచుతాను, నా రోజువారీ రేటు రూ. 1,000’’ అని ఆటోడ్రైవర్ చెబుతాడని వివరించారు. ఆటోడ్రైవర్ తనకు తెలీకుండానే అద్భుతమైన వ్యాపారాన్ని నిర్మించాడని రాసుకొచ్చారు. సాంకేతికత లేకుండానే నమ్మకాన్ని పెంచుకోవడం, వచ్చినవారి నుంచి ప్రీమియం వసూలు చేయడం డ్రైవర్ సామర్థ్యాన్ని మెచ్చుకున్నారు .

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×