BigTV English

Mumbai Ferry Accident: ముంబై ఫెర్రీ బోటులో నేవీ అధికారులదే నిర్లక్ష్యం.. నోటీసులు జారీ చేసిన పోలీసులు

Mumbai Ferry Accident: ముంబై ఫెర్రీ బోటులో నేవీ అధికారులదే నిర్లక్ష్యం.. నోటీసులు జారీ చేసిన పోలీసులు

Mumbai Ferry Accident| ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఫెర్రీ బోటు మునక ప్రమాదంలో కొలాబా పోలీసులు విచారణ చేపట్టారు. ఫెర్రీ బోట్లు, పౌరుల ప్రేవట్ బోట్లు తిరిగే ప్రదేశంలో ఇండియన్ నేవి ట్రయల్స్ చేయడానికి అనుమతి లేదని.. అలాంటిది నేవీ అధికారులు ఎవరి అనుమతితో అక్కడ ట్రయల్స్ చేశారని? పోలీసులు నేవి అధికారులను ప్రశ్నించారు. బుధవారం డిసెంబర్ 18, 2024న సాయంత్రం గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి బయలుదేరిన ఫెర్రీ బోటుని ఒక నేవీ స్పీడు బోటు వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది మరణించారు.


ఈ ఘటనపై పోలీసులు ఇండియన్ నేవీ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఫెర్రీ బోట్లు తిరిగే ప్రదేశంలో నిర్లక్ష్యంగా స్పీడు నడిపినందుకు భారతీయ న్యాయ సంహిత చట్టాల ప్రకారం.. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎందుకు నేవీ ట్రయల్స్ చేశారో సమాధానం చెప్పాలని నోటీసుల ద్వారా ప్రశ్నించారు. అయితే స్పీడ్ బోటు ఇంజిన్ ఫెయిల్ కావడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని నేవీ ఇప్పటికి సమాధానం చెప్పింది.

బుధవారం సాయంత్రం నీల్ కమల్ ఫెర్రీ బోటులో దాదాపు 113 మంది పర్యటకులు గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి సమీపంలోని ఎలిఫెంటా ఐల్యాండ్ పర్యటించడానికి బయలుదేరారు. అయితే అదే సమయంలో అయిదు మంది ఉన్న నేవీ స్పీడు బోటు ఆ ప్రాంతంలో ట్రయల్స్ నిర్వహిస్తూ ఉంది. ఈ సంఘటన గురించి ఫెర్రీ బోటు ప్రమాదంలో సజీవంగా బయటపడిన ఒక ప్రయాణికుడు గౌతమ్ గుప్తా వివరించారు. నేవీ స్పీడ్ బోటు ఇంజిన్ ఫెయిల్ అయిందని నేవీ అధికారులు చెప్పేదంతా అబద్ధమని గుప్తా అన్నారు. తాను ప్రత్యక్షంగా అక్కడే ఉండి మొత్తం చూశానని మీడియాకు తెలిపారు.


Also Read: జైపూర్ లో భారీ పేలుడు.. 40 వాహనాలు దగ్ధం.. 5 మృతి, 37 తీవ్రగాయాలు..

కొన్ని రోజుల క్రితం తన వివాహం జరిగిందని.. తన పెళ్లికి రాలేకపోయిన తన పిన్ని ఆరోజు తన ఇంటికి వచ్చిందని.. ఆమెతోపాటు తాను ఎలిఫెంటా ఐలాండ్ పర్యటించడానికి వెళ్లానని తెలిపారు. ఫెర్రీ బోటులో ఎవరికీ భద్రత కోసం లైఫ్ జాకెట్ ఇవ్వలేదని అన్నారు. తాను ముందు కూడా ఎలిఫెంటా ఐలాండ్ వెళ్లడంతో తాను కూడా లైఫ్ జాకెల్ అవసరం లేనట్లు భావించానని చెప్పారు. “సాయంత్రం 4 గంటల సమయంలో నీల్ కమల్ ఫెర్రీ బోటులో అందరూ బయలుదేరాక.. అందరూ సంతోషగా ఉన్నారు. చాలా మంది వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇంతలో ఒక నేవీ స్పీడ్ బోటుని దూరం నుంచి వేగంగా వస్తున్నట్లు చూశాను. ఆ స్పీడు బోటు నడిపే వ్యక్తి చాలా నిర్లక్ష్యంగా సముద్రంలో పడవని జిగ్ జాగ్ చేస్తూ ఆటలాడుతూ కనిపించాడు. చూస్తూ ఉండగానే.. ఆ స్పీడ్ బోటు వేగంగా వచ్చి మేము ప్రయాణిస్తున్న ఫెర్రీ బోటుని ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ముందుగా స్పీడ్ బోటులో నుంచి ఎగిరి ఒక వ్యక్తి మా ఫెర్రీ బోటుపై పడ్డాడు. అయినా ఫెర్రీ బోటుకి ఏమీ కాలేదని అందరూ భావించారు. ఇంతలో ఫెర్రీ బోటు ఒకవైపు నుంచి మునిగిపోతూ వచ్చింది. క్రమంగా సముద్రంలో ప్రయాణిలుందరూ పడిపోయారు. ఈ ఘటనలో మా పిన్ని కూడా మునిగిపోయింది. ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని ఊహించలేదు. దీనికంతా ఆ స్పీడ్ బోటుని నిర్లక్ష్యంగా నడిపిన వ్యక్తి తప్పిదమే. ప్రయాణికులు కెమెరాల్లో అతను రాష్ స్పీడ్ బోటుని ర్యాష్ గా డ్రైవ్ చేసినట్లు రికార్డ్ అయి ఉంది. అంది అందరూ చూడాలి.” అని గుప్తా ఆవేదనతో అన్నారు.

ఫెర్రీ బోటు మునిగిన సమాచారం అందకున్న అధికారుులు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, ముంబై పోలీసులు, కేంద్ర సహాయక బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ఈ పడవ మునక ప్రమాదంలో ఫెర్రీ బోటులోని 11 మంది మరణించగా.. నేవీ స్పీడ్ బోటులో ఉన్న ముగ్గురు చనిపోయారు.

ఈ ఘటన గురించి పోలీసుల విచారణలో ఫెర్రీ బోటు యజమాన్యం తప్పిదం కూడా ఉందని తేల్చారు. ఆ ఫెర్రీ బోటులో మొత్తం 90 మందికి మాత్రమే అనుమతి ఉండగా.. అందులో 113 మంది ఉన్నారు. దీంతో పోలీసులు ప్రస్తుతానికి ఫెర్రీ బోటు లైసెన్స్ ని సస్పెండ్ చేశామని తెలిపారు. ప్రమాదానికి ప్రధాన కారణమైన నేవీ స్పీడ్ బోటు డ్రైవర్ పై కూడా కేసు నమోదు చేశామని వెల్లడించారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×