E-Paper
Advertisement

Fire Accident Delhi Metro: ఢిల్లీ మెట్రో రైలులో మంటలు.. వీడియో ఇదిగో!

Fire Accident Delhi Metro: ఢిల్లీ మెట్రో రైలులో మంటలు.. వీడియో ఇదిగో!
Advertisement

Fire Breaks out in Delhi Metro: రోజు రద్దీగా ఉండే ఢిల్లీ మెట్రో రైలులో మంటలు రావడం కలకలం రేపింది. సోమవారం సాయంత్రం వైశాలి ప్రాంతానికి వెళ్లే మెట్రో రైలు రాజీవ్ చౌక్ స్టేషన్‌లో ఆగినప్పుడు రైలు కోచ్ రూఫ్‌పై మంటలు వచ్చాయి. అయితే దీనిని గమనించిన ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి.

అయితే ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ స్పందించింది. వైశాలి రూట్‌లో వెళుతున్న మెట్రో రైలుపై భాగంలో మంటలు వచ్చాయని తెలిపారు. ఈ ఘటన రాజీవ్ చౌక్ స్టేషన్ వద్ద సాయంత్రం 6.21 గంటలకు జరిగిందని పేర్కొన్నారు. అయితే ఈ ఘటన అంత ప్రమాదకరమైనదేమీ కాదని తెలిపారు.

Advertisement

రైలు రూఫ్‌పై వేలాడే విద్యుత్ తీగలు, వాటి నుంచి విద్యుత్ ప్రవాహాన్ని గ్రహించేందుకు ఉండే ఫాంటో గ్రాఫ్‌ల మధ్య ఏదైనా చిక్కుకుంటే స్వల్ప స్థాయిలో మంటలు వస్తాయని అన్నారు. దీని వల్ల ఎటువంటి భద్రత ముప్పు కానీ .. ప్రయాణికులు ప్రాణాపాయం కానీ ఉండదని తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఖచ్చితమైన కారణాలపై దర్యప్తు చేపడతామని ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్
వెల్లడించారు.

Also Read: Shibu Soren: ఓ వైపు పార్టీ.. మరోవైపు కోడలు.. మధ్యలో నలిగిపోతున్న మామ

Advertisement

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×