Mumbai High Alert: ఉగ్రవాద బెదిరింపుతో ముంబై నగర వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. చతుర్దశి సందర్భంగా, ముంబై ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఒక వాట్సాప్ సందేశం ఉలిక్కిపడేలా చేసింది. 34 వాహనాల్లో హ్యూమన్ బాంబులు అమర్చినట్లు, 400 కిలోల ఆర్‌డీఎక్స్ పేలుడు పదార్థాలతో భారీ పేలుడు జరుపుతామని మెసేజ్ వచ్చింది. ఈ పేలుడుతో నగరం అంతా అల్లకల్లోలంగా మారుతుందని, లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటూ సందేశంలో హెచ్చరించారు.
ఈ సందేశంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ బెదిరింపు లష్కర్-ఎ-జిహాది అనే సంస్థ నుండి వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో 14 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించినట్లు కూడా వెల్లడించారని పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా లక్షలాది మంది భక్తులు రోడ్లపైకి వచ్చే సమయం కావడంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. క్రైమ్ బ్రాంచ్, యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) సహా ఇతర ఏజెన్సీలు ఈ బెదిరింపు వెనుక ఉన్న నిజాలను ఆరా తీస్తున్నాయి. నగరంలోని రద్దీ ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, మసీదు, ఆలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
Also Read: Mustard infusion: ఆవాల కషాయం అంత మంచిదా? దీని తయారీ చాలా సింపుల్!
గతంలోనూ నకిలీ బెదిరింపులు
ఇటీవలి కాలంలో ముంబైలో ఇలాంటి బాంబు బెదిరింపులు సర్వ సాధారణంగా మారాయి. వీటిలో చాలా వరకు నకిలీవని తేల్చారు పోలీసులు. ఈ వారం ప్రారంభంలో థానే జిల్లాలోని కల్వా రైల్వే స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు 43 ఏళ్ల వ్యక్తి, రూపేష్ మధుకర్ రన్‌పిసే, హెచ్చరిక ఇచ్చాడు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో పోలీస్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసిన అతను, మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి అదుపులో తీసుకున్నారు. రైల్వే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ పరిశీలించగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.
మరొసారి జూలై 25న చత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 2 వద్ద బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ బెదిరింపు కూడా నకిలీదని తేలింది. ఆగస్టు 22న గిర్గాం ఇస్కాన్ ఆలయానికి ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది, కానీ సోదాల్లో ఏమీ దొరకలేదు దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసుల హెచ్చరిక, భద్రతా చర్యలు
గణేష్ నిమజ్జనం సందర్భంగా 21,000 మందికి పైగా పోలీసు మోహరించారు. పుకార్లను నమ్మవద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా కనపడితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ బెదిరింపు నకిలీదైనా, నిజమైనదైనా, ప్రజల భద్రతకు ఎటువంటి హాని కలగదని అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. గణే చతుర్థి ఆనందంగా జరుపుకుంటున్న సమయంలో ఇలాంటి బెదిరింపులు ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి.