BigTV English

Jr.NTR: ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్.. ఏకంగా అన్ని లక్షలా?

Jr.NTR: ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్.. ఏకంగా అన్ని లక్షలా?

Jr.NTR: ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr.NTR) తన అద్భుతమైన నటనతో విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరియర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత ‘నిన్ను చూడాలని’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై.. ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు గ్లోబల్ స్టార్ గా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయనకు మేల్ అభిమానులే కాదు ఫిమేల్ అభిమానులు కూడా భారీగా పెరిగిపోయారు. యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టే ఎన్టీఆర్.. తన స్టైలిష్ డాన్స్ మూమెంట్స్ తో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు.


ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ ను అందంగా తీర్చిదిద్దిన రూబా..

అలా ఎన్టీఆర్ ను కలవడానికి జపాన్ నుంచి హైదరాబాద్ కి వస్తున్న అభిమానులు కూడా లేకపోలేదు. మరికొంతమంది ఎన్టీఆర్ తో మాట్లాడాలని తెలుగు నేర్చుకొని మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇప్పుడు ఒక అభిమాని ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ కోసం ఏకంగా లక్షలు ఖర్చుపెట్టి ఆ ఆర్ట్ సొంతం చేసుకోవడం చూస్తుంటే.. ఆయనకు ఎన్టీఆర్ పై ఎంత అభిమానం ఉందో అర్థమవుతుంది.. అసలు విషయంలోకి వెళ్తే తెలుగు అమ్మాయి బ్యులా రూబీ (Beulah Ruby)పెన్సిల్ ఆర్ట్ లతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు అందుకుంది. సినిమా సెలబ్రిటీలు, స్టార్ హీరోల చిత్రాలను ఈమె స్కెచ్ రూపంలో తీర్చిదిద్ది.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అమ్మకానికి కూడా ఉంచుతుంది.

ALSO READ:Film industry: దారుణం.. వ్యభిచార దందా నడుపుతూ హీరోయిన్ అరెస్ట్!


భారీ ధరకు అమ్ముడుపోయిన స్కెచ్..

ఈ క్రమంలోనే తాజాగా ఈమె గీసిన ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఈ స్కెచ్ ని చూసిన ఒక ఎన్టీఆర్ అభిమాని అమెరికా నుంచి ఈమెకు మెసేజ్ చేసి ఆ ఆర్ట్ ను కొనాలనుకున్నట్లు తెలిపాడట. ఇక ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా కూడా పంచుకుంది. బ్యులా రూబీ సోషల్ మీడియా ద్వారా తెలిపిన వివరాల మేరకు..” ఇది నేను గీసిన తెలుగు హీరోల పెన్సిల్ స్కెచ్ లలో అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ ఇంస్టాగ్రామ్ లో నన్ను సంపాదించి.. దీనిని 1650 డాలర్లకు కొనుగోలు చేశారు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.1.45 లక్షలకు సమానం. ఇది నేను ఊహించలేదు. ముఖ్యంగా నా ఆర్ట్ ఇంత విలువ పొందుతుందని ఎప్పుడూ నాకు తెలియలేదు . ఈ స్కెచ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయన సంప్రదించి కొనుగోలు చేశారు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది ఇక ప్రస్తుతం ఈ స్కెచ్ పై నెటిజన్స్ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికైతే ఎన్టీఆర్ స్కెచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఆ అమ్మాయికి కూడా మంచి గుర్తింపు తో పాటు ఆదాయం కూడా లభించింది.

?utm_source=ig_web_copy_link

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×