HBD Anasuya: అనసూయ భరద్వాజ్ (Anasuya Bhardwaj).. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా నటించిన ‘నాగ’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. ఈ సినిమాలో ఒక కాలేజ్ సన్నివేశంలో కమెడియన్ సునీల్ (Sunil ) వెనుక ఒక చిన్న పాత్రలో కనిపించి ,అలా మెరిసి ఇలా వెళ్ళిపోయింది. చదువు పూర్తయ్యాక ఒక న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్ గా పనిచేసిన అనసూయ.. ఆ తర్వాత జబర్దస్త్ (Jabardast ) లోకి యాంకర్ గా అడుగుపెట్టింది. ఇక్కడ తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్న ఈమె.. కాలక్రమేనా ట్రెండ్ ను ఫాలో అవుతూ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే జబర్దస్త్ స్టేజ్ పై అందాలు వొలకబోస్తూ తన గ్లామర్ తో షో కి కొత్త కల తీసుకొచ్చిందని చెప్పవచ్చు.
సినిమా ఇండస్ట్రీలో భారీ గుర్తింపు..
ఒకవైపు జబర్దస్త్ లో యాంకర్ గా పనిచేస్తూనే.. మరొకవైపు వెండితెరపై అవకాశాలను ఒడిసి పట్టుకుంది. ఇక సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’సినిమాలో రంగమ్మత్తగా నటించి ఒక్కసారిగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు లభించాయి. ఇటీవల రజాకార్, పుష్ప, పుష్ప 2 చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. అత్యంత సుందరంగా సుందరంగా ఇంటిని నిర్మించి, గృహప్రవేశం కూడా పూర్తి చేశారు.అందుకు సంబంధించిన ఫోటోలను అనసూయ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇకపోతే నాగ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఈమె.. ఇప్పుడు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది .దీనికి తోడు ఈరోజు ఈమె పుట్టినరోజు కావడంతో ఈమె స్థిర, చరాస్తుల విలువ ఎంత ఉంటుందని నెటిజన్స్ ఆరాతీస్తున్నారు.
అనసూయ ఆస్తుల విలువ..
ప్రస్తుతం ఒక్కో షో కి రూ .2 నుండి రూ.4 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనసూయ జూబ్లీహిల్స్ లో రూ.8 కోట్ల విలువ చేసే ఇల్లు అప్పట్లోనే కొనుగోలు చేసినట్లు సమాచారం.. ఇక పలు యాడ్స్ , షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, సినిమాల ద్వారా ఏడాదికి రూ.3కోట్ల వరకు సంపాదిస్తోంది అనసూయ. ఇక యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు పలు షోలకు జడ్జిగా పనిచేస్తున్న ఈమె తన సంపాదనను తెలివిగా పలు కంపెనీలు, స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వాటి ద్వారా బాగానే ఆదాయం కూడబెట్టినట్టు సమాచారం. ఇక ఈమె ఇప్పటివరకు సుమారుగా రూ. 40 నుండీ రూ .60 కోట్లకు పైగా పోగు చేసినట్లు సమాచారం. రెండు లగ్జరీ కార్లు కూడా ఈమె సొంతం. అనసూయ సినిమాలలో కీలక పాత్రలు పోషించడమే కాదు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా అలరిస్తోంది. అంతేకాదు స్పెషల్ సాంగ్స్ లలో కూడా అలరిస్తోంది.ఈమె వైవాహిక జీవిత విషయానికి వస్తే.. ఉత్తరాదికి చెందిన సుశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక అమ్మాయి కోసం ఎదురుచూస్తున్నానని, తన భర్త సహకరించడం లేదని గతంలో అనసూయ చెప్పిన విషయం తెలిసిందే ఇంకా మొత్తానికైతే ఈరోజు ఈమె పుట్టినరోజు కావడంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ALSO READ:Samantha Love : డైరెక్టర్‌తో సమంత ఎఫైర్.. “వీరికి నా ఆశీర్వాదాలు”అంటూ భార్య పోస్ట్..!