Fast Sleep Techniques| చాలా మందికి రాత్రి వేళ త్వరగా నిద్ర త్వరగా పట్టదు. బెడ్ రూంలోకి వెళ్లాక గంటల తరబడి ఆలోచిస్తూ ఉంటారు. ఫోన్ లో ఏదైనా వీడియోలు లేదా సెర్చింగ్ చేస్తూ చదువుతూ ఉంటారు. అర్ధరాత్రి దాటినా ఇదే పరిస్థితి. ఫలితంగా ఉదయం త్వరగా నిద్రలేవడానికి సమస్యగా ఉంటుంది. దీనికి కారణం మానసిక ఒత్తిడి, అలసట, లేదా పని గురించి ఆలోచనలు.
నిద్ర సరిగా లేకపోవడంతో మరుసటి రోజు చిరాకుగా ఉంటుంది. సరిగా పనిచేయలేకపోతారు. నిద్ర వస్తూ ఉంటుంది. దీంతో ఆఫీసులో రోజంతా సమస్యలే. ఇదేకాకుండా తగిన నిద్రలేక త్వరగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తద్వారా రక్తపోటు, డయాబెటీస్ లాంటి వ్యాధుల బారిన పడతారు. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారా? అయితే నిద్రలేమి లేదా త్వరగా నిద్ర పట్టడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే పరిష్కారం లభిస్తుంది. ఈ టిప్స్ తో కొన్ని నిమిషాల్లోనే మీకు కమ్మని నిద్ర పట్టేస్తుది.
అనెస్థీషియాలజిస్ట్, ఇంటర్‌వెన్షల్ పెయిన్ మెడిసిన్ స్పెషలిస్ట్ అయితన డాక్టర్ కునాల్ సూద్.. త్వరగా నిద్రపట్టడానికి ప్రజలకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని టిప్స్ షేర్ చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. కేవలం శరీరం అలసిపోయినంత మాత్రాన నిద్ర త్వరగా రాదు. దీనికి మీ శరారానికి మెదడు నుంచి స్లీప్ సిగ్నల్ రావాలి. అందుకే ఈ సిగ్నల్ రానప్పుడు బెడ్ రూంలో గంటల తరబడి ఉన్నా నిద్రపట్టదు.
త్వరగా నిద్ర పట్టడానికి మూడు చిట్కాలు:
1. బ్రీతింగ్ టెక్నిక్: రాత్రి త్వరగా నిద్రపట్టనప్పుడు. బెడ్ పై పడుకొని నాలుగు సెకన్ల పాటు ఊపిరి పీల్చుకోండి. ఆ తరువాత 7 సెకన్ల పాటు దాన్ని పట్టి ఉంచండి. చివరగా 8 సెకన్ల పాటు ఊపిరి వదిలేయండి. ఇలా రెండు నుంచి మూడు సార్లు చేయండి. ఆలోపే మీకు నిద్ర పట్టేస్తుంది.
2.సాక్స్ ధరించడం: అవును బెడ్ పై పడుకునే సమయంలో పాదాలకు సాక్స్ ధరించి పడుకోండి. సాధ్ ధరించిన తరువాత పాదాలకు వెచ్చదనం కలుగుతుంది. ఇలా చేస్తే మన మెదడుకు సిగ్నల్స్ వెళతాయి. ఆ తరువాత శరీరం చల్లబడి మంచి నిద్ర వస్తుంది. అంతేకాదు ఒక సాక్స్ ధరించి నిద్రపోయే వారిపై అధ్యయనం చేయగా.. అలాంటి వారు 32 నిమిషాల పాటు ఎక్కువసేపు నిద్రపోతారు, పైగా రాత్రి వేళ నిద్ర మధ్యలో నుంచి మేల్కొనే అవకాశం చాలా తక్కువ.
Also Read: జిమ్ వెళ్లడానికి టైమ్ లేదా? ఇంట్లోనే బరువు తగ్గడానికి ఈజీగా ఇలా చేయండి
3.లావెండర్ ఆయిల్: అవును లావెండర్ ఆయిల్ సువాసనతో నిద్ర పట్టేస్తుంది. లావెండర్ ఆయిల్ లోని కొన్ని కాంపౌండ్స్ కు బ్రెయిన్ తో ఎమోషనల్ గా కనెక్షన్ ఏర్పడుతుంది. మానసిక వైద్య చికిత్స లో ఇది నిర్ధరణ అయింది. అందుకే మానసిక ఒత్తిడి ఉన్నవారిపై లావెండర్ ఆయిల్ తో పరిశోధన చేయగా వారిలో ఒత్తిడి తగ్గినట్లు తేలింది. అంతేకాదు బిపి, హార్ట్ బీట్, కొలెస్ట్రాల్ లాంటివి కూడా క్రమంగా తగ్గాయి. లావెండర్ ఆయిల్ సువాసన శరీరానికి రిలాక్స్ చేసి నిద్ర త్వరగా వచ్చేట్లు చేస్తుంది.