Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ లో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆయన ఆస్వాదస్తూ కాసేపు సేద తీరారు. సముద్రం ఒడ్డున కొంతసేపు కూర్చుని సేద తీరారు . మోదీ సముద్రంలో స్నార్కెలింగ్ ( స్విమ్మింగ్) కూడా చేశారు. కాసేపు సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించారు.
Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ లో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆయన ఆస్వాదిస్తూ కాసేపు సేద తీరారు. సముద్రం ఒడ్డున కొంతసేపు కూర్చుని ఆనందంగా గడిపారు . మోదీ సముద్రంలో స్నార్కెలింగ్ ( స్విమ్మింగ్) కూడా చేశారు. కాసేపు సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలను నరేంద్ర మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లక్షదీవుల ప్రకృతి సౌందర్యం.. అక్కడ ప్రజలు మాట్లాడిన విధానం ఎంతో నచ్చిందని తెలిపారు.
లక్ష ద్వీప్ ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం మనల్ని ఎంతోగానో ఆకర్షిస్తాయి. ఈ పర్యటన 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం నేను మరింత కష్టపడి ఎలా పనిచేయాలో ఈ వాతావరణం నాకు నేర్పిందని పేర్కొన్నారు.
ప్రకృతి ఒడిలో సేద తీరాలంటే లక్షద్వీప్‌లు ఉత్తమమైన ప్రదేశం అని తెలిపారు. సాహసాలు చేయాలనుకునేవారు లక్షద్వీప్‌ను తమ పర్యటన లిస్ట్‌లో రాసి పెట్టుకోవాలన్నారు.
పగడపు దీపులు, వివిధ రకాల ఆకృతిలో ఉన్న చేపల ఫొటోలను షేర్ చేశారు. తాను లక్షద్వీప్‌లో సాహసవంతమైన స్నార్కెలింగ్ కూడా ప్రయత్నించినట్లు మోదీ తెలిపారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. లక్షద్వీప్ పర్యటన ఎంతో అద్భుతమైన అనుభవం తనకు ఇచ్చిందన్నారు.
స్నార్కెల్ అనే ట్యూబ్, ముఖానికి డైవింగ్ మాస్క్‌ను ధరించి సముద్రం లోపల భాగంలో ఈత కొడుతారు. ఈ స్నార్కెలింగ్‌తో సముద్రంలో ఉన్న పర్యావరణాన్ని, వివిధ జీవరాశులను చూడవచ్చు. స్నార్కెలింగ్ అనేది సముద్రం లోపల చేసే ఒక విధమైన డైవింగ్.