BigTV English

Narendra Modi: మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరెవరు వస్తున్నారో తెలుసా..?

Narendra Modi: మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరెవరు వస్తున్నారో తెలుసా..?

Narendra Modi’s Swearing in: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమణస్వీకారోత్సవం జూన్ 9న అనగా రేపు రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్ లో జరగనున్నది. ప్రధానితోపాటు కొత్త మంత్రివర్గంలోని మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విదేశీ అతిథులు కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పలు దేశాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం పంపింది. ఆహ్వానాలను అందుకున్న వీదేశీ ప్రముఖులు తాము హాజరవుతున్నట్లు ధృవీకరించారు. వచ్చే అతిథుల కోసం లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, ఒబెరాయ్, క్లారిడ్జ్ వంటి ప్రధాన హోటళ్లను సిద్ధం చేసి, వాటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


సీషెల్స్ అధ్యక్షుడు, బంగ్లాదేశ్ ప్రధాని ఈరోజు న్యూఢిల్లీకి చేరుకునే అవకాశముంది. మిగతా అతిథులంతా కూడా ఆదివారం రానున్నారు. ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి నాలుగు గంటల ముందుగా వారు ఇండియాకు చేరుకోనున్నారు. అతిథులు, వేడుకకు నేరుగా హాజరయ్యే మార్గాలను కూడా ఇప్పటికే నిర్దేశించారు. వీరంతా కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసే విందులో సైతం పాల్గొననున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం తరువాత సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో విందు కార్యక్రమం ఉండనున్నది.

Also Read: జమ్ముకశ్మీర్ లో కాల్పులు.. ఒకరు మృతి, సరిహద్దులకు బలగాలు


ఈ వేడుకకు హాజరుకాబోతున్న అతిథులు వీళ్లే..

సీషెల్స్ అధ్యక్షుడు – అహ్మద్ అఫీస్
బంగ్లాదేశ్ ప్రధాని – షేక్ హసీనా
మారిషస్ ప్రధాని – ప్రవింద్ కుమార్ జుగ్నాథ్
శ్రీలంక అధ్యక్షుడు – రణిల్ విక్రమసింఘే
మాల్దీవుల అధ్యక్షుడు – మహమ్మద్ ముయిజ్జూ
నేపాల్ ప్రధాని – పుష్ప కమల్ దహాల్ ప్రచండ
భూటాన్ ప్రధాని – షెరింగ్ టోబ్గేతోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

Tags

Related News

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Big Stories

×