E-Paper
Advertisement

Kochi Helicopter Crash :  నేవీ కేంద్రంలో ప్రమాదం.. నావికుడు మృతి..

Kochi Helicopter Crash :  నేవీ  కేంద్రంలో ప్రమాదం.. నావికుడు మృతి..
Advertisement

Kochi Helicopter Crash : కొచ్చి నావికా కేంద్రంలో శనివారం చేతక్ హెలికాప్టర్ కుప్పకూలడంతో నౌకాదళ అధికారి ఒకరు మృతి చెందారు. చాపర్ రోటర్ బ్లేడ్లు తగలడంతో రన్‌వేపై ఉన్న నౌకాదళ అధికారి మృతి చెందినట్లు నేవీ అధికారులు తెలిపారు. సౌత్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్‌లోని ఐఎన్‌ఎస్ గరుడ రన్‌వేపై శనివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

మృతుడు మధ్యప్రదేశ్‌కు చెందిన గ్రౌండ్‌ స్టాఫ్‌ యోగేంద్ర సింగ్‌గా గుర్తించారు. ప్రమాదంపై దక్షిణ నావికాదళం విచారణకు ఆదేశించింది. నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ యోగేంద్ర సింగ్‌ మృతికి సంతాపం ప్రకటించారు.

Advertisement

ఐఎన్‌ఎస్ గరుడ.. ఐఎన్‌ఎస్ వెందురుతి, సదరన్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయం పక్కనే ఉంది. ఐఎన్‌ఎస్ గరుడ ఒక ప్రధాన నౌకాదళ వైమానిక శిక్షణా కేంద్రం, కార్యాచరణ స్థావరం. ఐఎన్‌ఎస్ గరుడలో రెండు ఇంటర్సెక్టింగ్ రన్‌వేలు ఉన్నాయి. దాదాపు అన్ని ఆపరేషనల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ల్యాండ్ చేయడానికి, టేకాఫ్ చేయడానికి అనుమతిస్తుంది. ఐఎన్‌ఎస్ గరుడ భారత నౌకాదళానికి వ్యూహాత్మక ఆపరేటింగ్ స్టేషన్‌.

Tags

Related News

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

Big Stories

Advertisement
×