BigTV English

ICC World Cup 2023 : ఇంగ్లండ్ కథ కంచికే.. ఆస్ట్రేలియాతో పోరాడినా దక్కని ఫలితం!

ICC World Cup 2023 : ఇంగ్లండ్ కథ కంచికే.. ఆస్ట్రేలియాతో పోరాడినా దక్కని ఫలితం!

ICC World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ పోరాడి ఓడింది. వరుసగా ఏడు ఓటములతో అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతేకాదు…48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో పాయింట్ల టేబుల్ లో అడుగుకి వెళ్లి అత్యంత చెత్త రికార్డ్ మోసుకెళుతోంది. ఇదే పోరాట పటిమ మొదటి మ్యాచ్ నుంచి చేసి ఉంటే కొంచెం గౌరవప్రదంగానైనా ఉండేదనే కామెంట్లు నెట్టింట వినిపించాయి.


టాస్ గెలిచి మొదట ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఇంగ్లండ్ ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా బ్యాటింగ్ తడబడుతూ సాగింది. వరల్డ్ కప్ లో తగ్గేదేలేదంటూ సవాల్ చేస్తున్న డేవిడ్ వార్నర్ (15) ఈసారి బాగా తగ్గాడు. మరో ఓపెనర్ ట్రేవిస్ హెడ్ (11) పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా ఓపెనర్లు ఇద్దరూ 5.4 ఓవర్లలో 38 పరుగులకే వెనుతిరిగారు. మార్ష్, మాక్స్‌వెల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది.

ఫస్ట్ డౌన్ వచ్చిన స్టీవ్ స్మిత్ (44), లబుషేన్ (71) కాసేపు జట్టుని ఆదుకున్నారు. కానీ స్మిత్ తర్వాత ఒకొక్క వికెట్ పడుతూ వచ్చింది. జోష్ ఇంగ్లిస్ (3) అయిపోయాడు. తర్వాత నిలకడగా ఆడుతున్న లబుషేన్ అయిపోయాడు. ఆ సమయంలో కెమరాన్ గ్రీన్ (47) ఒక ఎండ్ లో నిలబడ్డాడు. అతను అవుట్ అయ్యే సమయానికి 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 223 పరుగులు చేసింది. చివర్లో ఆడమ్ జంపా (29) కొన్ని మెరుపులు మెరిపించడంతో 49.3 ఓవర్లకి 286 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది.


ఇంగ్లండ్ బౌలింగ్ లో క్రిస్ వోక్స్ 4. మార్క్ వుడ్ 2, ఆదిల్ రషీద్ 2, డేవిడ్ విల్లీ, లివింగ్ స్టోన్ ఒకొక్క వికెట్ తీసుకున్నారు.

ఛేజింగ్ దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్ మొదటి బాల్ కి బెయిర్ స్టో అవుట్ అయి షాక్ ఇచ్చాడు. ఇంగ్లండ్ పతనం మొదలైందని అంతా అనుకున్నారు. అన్నట్టుగానే ఫస్ట్ డౌన్ వచ్చిన జో రూట్ (13) వెంటనే వెనుతిరిగాడు. 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ గిలగిల్లాడుతోంది. 100 పరుగులైనా చేస్తుందా? లేదా? అనే సందేహాలు వచ్చాయి.

ఈ సమయంలో డేవిడ్ మలన్ (50) ఆదుకున్నాడు. అతనికి బెన్ స్టోక్స్ (64) సహాయపడ్డాడు. ఇద్దరూ గాడిన పెట్టడానికి ప్రయత్నించారు. అంతా బాగుందనుకునే సమయంలో మలన్ అవుట్ అయిపోయాడు. అప్పుడు జోస్ బట్లర్ వచ్చి 1 పరుగు తీసి తను అయిపోయాడు. 25 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 106 పరుగులతో ఇంగ్లండ్ కష్టాల కడలిలో ఈదుతూ కనిపించింది.

తర్వాత మొయిన్ ఆలీ (42), క్రిస్ వోక్స్ (32), ఆదిల్ రషీద్ (20), డేవిడ్ విల్లీ (15) బౌలర్లందరూ తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ 253 పరుగుల దగ్గర ఆగిపోయింది. 33 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించి సెమీస్ వైపు దూసుకెళ్లింది.

ఆసిస్ బౌలింగ్ లో ఆడమ్ జంపా 3, మిచెల్ స్టార్క్, జోష్ హజిల్ వుడ్, పాట్ కమిన్స్ ముగ్గురూ రెండేసి వికెట్లు తీసుకున్నారు. మార్కస్ స్టోయినిస్ ఒక వికెట్ తీసుకున్నాడు.

 ఆస్ట్రేలియా తర్వాత రెండు మ్యాచ్ లు ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ పై ఆడనుంది. అందువల్ల సెమీస్ చేరడం పెద్ద కష్టంకాదు. కానీ నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి. అదే ఇప్పుడు రసవత్తరంగా మారింది.

Related News

5 Balls Won Match: 5 బంతుల్లో ముగిసిన మ్యాచ్…7 గురు డకౌట్… 23 పరుగులకే ఆలౌట్

Mohamed Siraj : సేమ్ టు సేమ్ డిట్టు దించేశారు… మహమ్మద్ సిరాజ్ కూడా కుళ్ళుకోవాల్సిందే

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Big Stories

×