BigTV English

అమెజాన్‌లో అందుబాటులో ఉన్న NCERT పుస్తకాలు.. ధర తక్కువనా.. ఎక్కువనా..?

అమెజాన్‌లో అందుబాటులో ఉన్న NCERT పుస్తకాలు.. ధర తక్కువనా.. ఎక్కువనా..?

NCERT Books now available on Amazon Online Shopping: ఎన్సీఆర్టీ( నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) బుక్స్ ఇప్పుడు ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ ఆన్ లైన్ రిటైల్ సంస్థ అమెజాన్ లో వీటిని విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్సీఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ తాజాగా ప్రకటించారు. ఈ బుక్స్ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కొంత ఆందోళనగా ఉన్నారని, ఈ నేపథ్యంలోనే తాము వీటిని ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. అవి కూడా ఎమ్మార్పీ రేట్లకే విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రముఖ సంస్థ అమెజాన్ తో ఒప్పందం కూడా కుదిరినట్లు ఆయన వివరించారు.


Also Read: ఈసీ వెబ్ సైట్ లో ఫలితాల జాప్యం.. ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్.. గెలుపుపై పార్టీల భిన్న వాదన

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్సీఆర్టీ ప్రతి సంవత్సరం 5 కోట్ల బుక్కులను ముద్రిస్తున్నదని చెప్పారు. ఈ సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రతి ఏటా 15 కోట్ల బుక్స్ ను ముద్రించనున్నట్లు ఆయన వివరించారు.


ఎన్సీఆర్టీ తాజా నిర్ణయంతో అన్ని క్లాసులకు సంబంధించిన బుక్స్ ఇక నుంచి అమెజాన్ పోర్టల్ లో అందుబాటులో ఉండనున్నాయి. స్కూల్స్, సంబంధిత సంస్థలకు కూడా బల్క్ గా అందించేందుకు సదరు ఆన్ లైన్స్ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.

Also Read: ముంబై మొదటి భూగర్భ మెట్రో లైన్ 3ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఛార్జీల వివరాలు ఇవే

ఇదిలా ఉంటే… మార్కెట్లో ఇతర పాఠ్యపుస్తకాల కంటే ఎన్సీఆర్టీ పుస్తకాలకు చాలా డిమాండ్ ఉంటుంది. వీటిని విద్యార్థులే కాదు.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు కూడా ఎన్సీఆర్టీ పుస్తకాలను కొనుక్కుని చదువుతుంటారు. ఈ పుస్తకాలలో చాలా ప్రత్యేకమైన సబ్జెక్టు, కావాల్సిన మేర అందుబాటులో ఉంటుంది. ప్రతి అంశంపైన ఈ పుస్తకాలల చక్కగా వివరిస్తారు. యూపీఎస్సీకి ప్రిపరయ్యేవాళ్లు అయితే మాత్రం వీటిని లేకుండా తమ ప్రిపరేషన్ నే ఉండదంటే అర్థం చేసుకోండి.. అవి ఎంత ఇంపార్టెన్సో అనేది.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×