BigTV English

Modi on Pawan Kalyan: పవనంటే ఒక తుపాన్.. జనసేనానిపై మోదీ ప్రశంసలు వెల్లువ!

Modi on Pawan Kalyan: పవనంటే ఒక తుపాన్.. జనసేనానిపై మోదీ ప్రశంసలు వెల్లువ!

Pawan Kalyan is a Toofan Said By Modi:ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ ఎన్నికయ్యారు. బీజేపీ మిత్రపక్షాల నేతలంతా.. మోదీని ఎన్డీఏ పక్ష నేతగా బలపరిచారు. రాజ్ నాథ్ సింగ్ మోదీ పేరును ప్రతిపాదించగా.. అమిత్ షా, గడ్కరీ, కుమారస్వామి, చంద్రబాబు, నితీష్ కుమార్ ఏక్ నాథ్ షిండ్, అజిత్ పవార్, చిరాగ్ పాశ్వాన్, జతిన్ రామ్ మాంఝీ, పవన్ కల్యాణ్ మోదీని బలపరిచారు. ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన మోదీ.. ఈనెల 9న మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. బీజేపీ గెలుపుకు కారణం కార్యకర్తలేనని, వారు రేయింబవళ్లు కష్టపడినదానికి ఫలితం దక్కిందని పేర్కొన్నారు. అలాగే ఎన్డీఏ పక్షాల కార్యకర్తలు కూడా తీవ్రంగా శ్రమించారన్నారు. మూడోసారి తనకు దేశప్రజలకు మరింత సేవ చేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందే ఏర్పడిన ఏ కూటమి ఎన్డీఏ లాగా విజయంవంతం కాలేదన్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ అవసరమైతే.. ప్రభుత్వాన్ని నడిపించడానికి అందరి సహకారం అవసరమన్నారు. క్రైస్తవులు ఎక్కువగా ఉన్న.. గోవా, ఈశాన్య రాష్ట్రాల్లోనూ సేవ చేసే అవకాశం దక్కిందన్నారు. తనపై నమ్మకం ఉంచి ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకున్నవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు మోదీ. పేదల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమన్న మోదీ.. ఈ ఐదేళ్లలోనే కాకుండా.. వచ్చే పదేళ్లలో క్వాలిటీ ఆఫ్ లైఫ్, గుడ్ గవర్నెన్స్ ను అందిస్తామని మోదీ తెలిపారు.


Also Read: చంద్రబాబు స్పీచ్.. ఎన్డీయే మెజార్టీ అద్భుతం, కాకపోతే..

ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్రమోదీ. ఆయన్ని తుపానుగా వర్ణించారు. ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందన్నారు. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయం సాధించామన్నారు. వేదికపై ఉన్న పవన్‌ను అభినంధించారు.

Tags

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×