Zebronics 90W Speaker Review: ఫ్రెండ్స్‌తో కలిసి.. బర్త్‌డే పార్టీ.. చేసుకున్నా లేదా ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ ప్లాన్ చేసినా అదిరిపోయే సౌండ్ ఇచ్చే పవర్ ఫుల్ పార్టీ స్పీకర్ ఉండాల్సిందే. సరిగ్గా ఇలాంటి మ్యూజిక్ లవర్స్ కోసమే ప్రముఖ ఆడియో బ్రాండ్ జెబ్రోనిక్స్ ఒక పవర్‌ఫుల్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఏకంగా 90W సౌండ్ అవుట్‌పుట్, కరోకే సపోర్ట్, టీడబ్ల్యూఎస్, డ్యూయల్ డ్రైవర్ల ఫీచర్లతో వచ్చిన ఈ లేటెస్ట్ స్పీకర్ విశేషాలు, ఫీచర్లు, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జెబ్రోనిక్స్ ఈ స్పీకర్‌ను చాలా ట్రెండీ అండ్ రగ్గడ్ డిజైన్‌తో రూపొందించింది. చూడటానికి చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. దీనిలో 90W భారీ అవుట్‌పుట్ ఉన్నప్పటికీ, ఒక చోటు నుంచి ఇంకో చోటికి చాలా ఈజీగా పట్టుకెళ్లేలా పటిష్టమైన హ్యాండిల్ ఇచ్చారు. అవుట్‌డోర్ ట్రిప్స్ లేదా గార్డెన్ పార్టీలకు దీన్ని హ్యాపీగా తీసుకెళ్లవచ్చు.
ఆర్జిబి లైటింగ్: పార్టీ వైబ్స్ పెంచడానికి ఇందులో అట్రాక్టివ్ RGB ఎల్ఈడీ లైట్స్ అమర్చారు. ఆడియో బీట్స్‌కు తగ్గట్టు ఈ లైట్లు మారడం వల్ల నైట్ పార్టీలలో డిస్కో ఫీల్ లభిస్తుంది.
ఈ స్పీకర్‌లో మెయిర్ హైలైట్ దీని 90W పవర్‌ఫుల్ సౌండ్ ఆడియో అవుట్‌పుట్.
డ్యూయల్ ఫుల్-రేంజ్ డ్రైవర్లు: ఇందులో అమర్చిన.. రెండు ఫుల్-రేంజ్ డ్రైవర్ల వల్ల బేస్ చాలా డీప్‌గా వస్తుంది. వోకల్స్ చాలా క్లియర్‌గా వినిపిస్తాయి.
ఇండోర్ & అవుట్‌డోర్ పర్ఫార్మెన్స్: మీరు గదిలో.. పెట్టి విన్నా లేదా బయట ఓపెన్ ప్లేస్‌లో పెట్టినా సౌండ్ క్వాలిటీ అస్సలు తగ్గదు. వాల్యూమ్ ఫుల్ పెంచినా కూడా ఆడియో డిస్టార్షన్ లేకుండా స్పష్టంగా ఉంటుంది.
కరోకే ఫీచర్: పాటలు వినడమే కాదు.. మీకూ మైక్ పట్టుకుని పాటలు పాడాలని ఉందా? అయితే.. ఈ స్పీకర్‌లో మైక్ కనెక్ట్ చేసుకుని కరోకే పాడే అవకాశం ఉంది. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో సరదాగా సింగింగ్ కాంపిటీషన్స్ పెట్టుకోవడానికి ఇది పర్ఫెక్ట్!
TWS మోడ్ : మీకు ఇంకా ఎక్కువ సౌండ్ కావాలనుకుంటే.. ‘టిడబ్ల్యూఎస్’ ఫీచర్ ద్వారా ఇలాంటి మరొక జెబ్రోనిక్స్ స్పీకర్‌ను వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసి థియేటర్ లెవెల్ డబుల్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు.
ఈ పోర్టబుల్ స్పీకర్‌లో ఒకసారి పూర్తి .. ఛార్జ్ చేస్తే గరిష్టంగా 6 గంటల వరకు ప్లేబ్యాక్ లభిస్తుంది. 90W హెవీ సౌండ్ ఇచ్చే స్పీకర్‌కి ఈ స్థాయి బ్యాటరీ బ్యాకప్ ఉండటం మంచి విషయమే. ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ ద్వారా దీన్ని ఈజీ ఛార్జ్ చేసుకోవచ్చు.
స్మార్ట్‌ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లను వేగంగా కనెక్ట్ చేయడానికి లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చారు. ఇది కాకుండా..
యుఎస్‌బి డ్రైవ్ సపోర్ట్
ఏయూఎక్స్ కేబుల్ సపోర్ట్
మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ ఆప్షన్లు ఉంటాయి.
Also Read: జేబులో పట్టేంత కాంపాక్ట్ డిజైన్! ఫీచర్లు చూస్తే ఫిదా
జెబ్రోనిక్స్ 90W స్పీకర్ ధర ఎంత?
అఫిషియల్ ధర: ఇండియన్ మార్కెట్లో ఈ జెబ్రోనిక్స్ 90W పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ ఆన్‌లైన్ ధర రూ.7,999.
ఈ పార్టీ స్పీకర్ ప్రముఖ ఇ-కామర్స్ సైట్లయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జెబ్రోనిక్స్ అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటుంది.
రూ. 8,000 లోపు బడ్జెట్‌లో అదిరిపోయే 90W డిస్కో సౌండ్, కరోకే సింగింగ్ ఫీచర్, 6 గంటల ప్లేబ్యాక్, టీడబ్ల్యూఎస్ సపోర్ట్ , ఆర్జిబి లైటింగ్ కోరుకునే వారికి ఈ మోడల్ ఒక వర్త్ అండ్ క్రేజీ పార్టీ పార్ట్‌నర్!