E-Paper
Advertisement

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ జాబ్స్.. కనీసం జీతం రూ.1 లక్ష

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ జాబ్స్.. కనీసం జీతం రూ.1 లక్ష
Advertisement

UPSC Jobs| యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 80 అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 11, 2026 వరకు కొనసాగుతుంది. ఈ జాబ్ పోస్టింగ్.. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని “ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)”లో జరుగుతుంది.

UPSC నియామకంలో 80 పోస్టులు

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 80 APFC పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 29 పోస్టులు అన్‌రిజర్వ్డ్ అభ్యర్థులకు కేటాయించారు. EWS కేటగిరీకి 8 పోస్టులు, OBC అభ్యర్థులకు 18 పోస్టులు ఉన్నాయి. అలాగే SC కేటగిరీకి 15, ST కేటగిరీకి 10 పోస్టులు కేటాయించారు. మొత్తం పోస్టుల్లో 3 పోస్టులు PwBD అభ్యర్థులకు రిజర్వ్ చేశారు.

సెప్టెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

Advertisement

అర్హత ఉన్న అభ్యర్థులు.. యుపిఎస్‌సి ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ (UPSC Online Recruitment Application) పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 22, 2026న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 11, 2026లోపు తమ దరఖాస్తులను పూర్తి చేయాలి. దరఖాస్తులో యాక్టివ్ ఈమెయిల్ చిరునామాను తప్పనిసరిగా అందించాలి. యుపిఎస్‌సి (UPSC) నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఈ -మెయిల్ ద్వారా అందే అవకాశం ఉంది. అందుకే దరఖాస్తు చేసిన తర్వాత అభ్యర్థులు తమ ఈమెయిల్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలి.

యూనివర్సిటీ డిగ్రీ తప్పనిసరి

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. కంపెనీ లా, లేబర్ లా, లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు.

వయోపరిమితి

Advertisement

UR, EWS అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 35 సంవత్సరాలు. OBC అభ్యర్థులకు ఇది 38 సంవత్సరాలు. SC, ST అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 40 సంవత్సరాలు. PwBD అభ్యర్థులకు నిబంధనల ప్రకారం అదనపు వయో సడలింపు లభిస్తుంది. అయితే గరిష్ఠ వయస్సు 56 సంవత్సరాలకు మించకూడదు.

Also Read: ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు కట్ చేస్తే ఈ రోజు కోటీశ్వరుడు.. రోజుకు రూ.6.3 లక్షల ఆదాయం

ఎంపికైన వారికి లెవల్-10 జీతం (అంచనా)

ఎంపికైన అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్లకు 7వ కేంద్ర వేతన సంఘం ప్రకారం లెవెల్ 10 పే మ్యాట్రిక్స్‌లో జీతం లభిస్తుంది. అంటే ప్రారంభ బేసిక్ వేతనం రూ.56,100 (అంచనా). పే స్కేల్ రూ.56,100 – రూ.1,77,500. నెలకు సుమారు రూ.1.08 నుంచి 1.15 లక్షల గ్రాస్ సాలరీ, కటింగ్స్ అన్నీ పోను నెలకు ఇన్‌హ్యాండ్ రూ.1 నుంచి 1.07 లక్షల వరకు జీతం లభించవచ్చు. DA, HRA, TA అలవెన్సులు, NPS, ఆదాయపు పన్ను వంటి మినహాయింపులు వర్తిస్తాయి.
ఈ జాబ్.. శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంగా ఉంటుంది. ఈ పోస్టు సెంట్రల్ బోర్డ్ గ్రూప్ A, నాన్ మినిస్టీరియల్ కేటగిరీకి చెందుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.

ఏపిఎఫ్‌సీ అంటే ఏం చేయాలి?

APFCలు ఎన్‌ఫోర్స్‌మెంట్, రికవరీ, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, క్యాష్, లీగల్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. పెన్షన్, కంప్యూటర్ సంబంధిత పనులతో పాటు వివిధ విచారణలు, క్లెయిమ్‌ల పరిష్కారాన్ని కూడా నిర్వహిస్తారు. అలాగే క్యాష్ బుక్స్ నిర్వహించడం, బ్యాంక్ స్టేట్‌మెంట్లను రీకన్‌సైల్ చేయడం, MIS రిటర్న్స్ సిద్ధం చేయడం వంటి బాధ్యతలు ఉంటాయి.

Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తొలిసారి తీసుకుంటున్నారా? ముందు ఈ 4 విషయాలు తప్పక చెక్ చేయండి

షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల డాక్యుమెంట్స్ వెరిఫికేషన్

షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల విద్యార్హతలు, ఇతర క్లెయిమ్స్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ UPSC పరిశీలిస్తుంది. అన్ని అర్హతలను పూర్తి చేసిన అభ్యర్థులను తదుపరి ఇంటర్వ్యూకు పిలుస్తారు. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని అన్ని రూల్స్ చెక్ చేయడం మంచిది.

Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు

Related News

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు-పిల్లలతో సహా 14 మంది మృతి, బీహార్‌లో ఘటన

ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఊహించని షాక్.. ఇంటికి భారీగా క్యాష్ ఆన్ డెలివరీలు.. దెబ్బకు ఊరు వదిలి జంప్!

‘లద్దాఖ్ మాది.. మీ వాదన చెల్లదు’.. చైనా అభ్యంతరాలను తిప్పికొట్టిన కేంద్రం!

Big Stories

Advertisement
×