E-Paper
Advertisement

లోకో పైలట్ విధుల్లోకి కొత్త పెళ్లి కూతురు.. కేబిన్‌లో పనులపై వీడియో వైరల్

లోకో పైలట్ విధుల్లోకి కొత్త పెళ్లి కూతురు.. కేబిన్‌లో పనులపై వీడియో వైరల్
Advertisement

Woman Loco Pilot: కొత్తగా పెళ్లయిన మహిళలు సంప్రదాయ పద్దతుల్లో కనిపిస్తారు. వివాహం చేసుకున్న ఓ మహిళ లోకో పైలట్.. సంప్రదాయ దుస్తులతో డ్యూటీకి హాజరైంది. తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది. అయితే ఆమె డ్రెస్ కోడ్‌, భద్రతానిబంధనలపై చర్చ మొదలైంది.

లోకో పైలట్ విధుల్లోకి కొత్త పెళ్లి కూతురు

మహిళ జీవితంలో పెళ్లి కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఆమె తన ఆశయాలను వాయిదా వేసుకోవాలని కాదు. సాంప్రదాయ దుస్తులు, చీర, ఎర్ర గాజులు, సిందూరం ధరించి విధులకు హాజరైన కొత్తగా పెళ్లైన మహిళా లోకో పైలట్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

Advertisement

ఫెమినిజం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ క్లిప్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ మహిళ సాంప్రదాయ పెళ్లి కూతురి దుస్తులు ధరించి లోకోమోటివ్ క్యాబిన్‌లో తన పని చేస్తూ కనిపించింది. ఆమె తన సంప్రదాయాలను వృత్తి జీవితంలోకి తీసుకొస్తున్న తీరు చాలామంది ప్రశంసిస్తున్నారు.

సాంప్రదాయ దుస్తులతో విధులకు హాజరు

చాలామంది నూతన వధూవరులు వివాహం తర్వాత సాధారణంగా బంధువులను కలవడం, కుటుంబ సమావేశాలకు హాజరవడం, కొత్త దినచర్యకు అలవాటు పడటం వంటి పనులతో గడుపుతారు. పైన కనిపిస్తున్న మహిళ అందుకు పూర్తిగా భిన్నం. పెళ్లైన భారతీయ మహిళ తన సంప్రదాయాలతో విధులకు హాజరుకావడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Advertisement

ALSO READ: డాక్టర్ భార్యకు భరణం ఎందుకు? విడాకుల కేసులో మండిపడిన హైకోర్టు

చాలామంది నెటిజన్లు సానుకూలంగా స్పందించినప్పటికీ.. రైల్వే సిబ్బంది డ్రెస్ కోడ్, భధ్రతా నిబంధనలపై చర్చ మొదలైంది. రైలు ఇంజిన్‌లో పని చేసేటప్పుడు ధరించిన దుస్తులు భద్రతా పరంగా ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో మహిళ ఎవరు? ఎక్కడ అనే పూర్తి వివరాలు అధికారికంగా తెలియరాలేదు.

వివిధ వృత్తులలో ఉన్న మహిళలు తమ సంస్కృతి, కెరీర్‌ను ఎలా సమన్వయం చేసుకుంటున్నారనే విస్తృత చర్చకు నాంది పలికిందని చెప్పవచ్చు.

 

?utm_source=ig_embed&ig_rid=AnX4w452vdfd3cbv3by0fE2

 

Related News

డాక్టర్ భార్యకు భరణం ఎందుకు? విడాకుల కేసులో మండిపడిన హైకోర్టు

హోటల్‌లో కాల్పులు ఐదుగురు మృతి, ఆ వివాదమే కారణమా? అస్సాంలో ఘటన

సిబ్బందిపై దాడి.. తమిళనాడులో జైలు నుంచి తప్పించుకున్న 17 మంది ఖైదీలు, షాకైన అధికారులు

“శరణమా? మరణమా?.. ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక!

మహారాష్ట్ర ఓటర్ల జాబితా వివాదం.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం!

తమిళనాడులో సంచలనం.. అవినీతి కేసులో మాజీ మంత్రి అన్బిల్ మహేష్ అరెస్టు

భారత్‌లో మారిన బంగారం దిగుమతుల మ్యాప్.. జోరందుకున్న దుబాయ్ రూట్!

Big Stories

Advertisement
×