BigTV English

Terrorist Attack: ఉగ్రదాడిపై కేంద్రం సీరియస్.. దర్యాప్తు NIAకు అప్పగింత ..

Terrorist Attack: ఉగ్రదాడిపై కేంద్రం సీరియస్..   దర్యాప్తు NIAకు అప్పగింత ..

Terrorist Attack(National News Updates): జమ్మూకశ్మీర్ లోని పూంజ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిపై భారత్ ప్రభుత్వం యాక్షన్ మొదలుపెట్టింది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను NIAకు అప్పగించింది. నేడు ఘటనా స్థలిని NIA అధికారులు పరిశీలించనున్నారు. మరోవైపు దాడి తమ పనేనని జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ ప్రకటించుకుంది.


గురవారంలో జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ల దాడిలో ఐదుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని రాజౌరిలోని సైనిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ జవాన్లు రాష్ట్రీయ రైఫిల్స్‌ దళానికి చెందినవారు. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు వీరిని మోహరించామని సైన్యం తెలిపింది.

సైనికులు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్కు భింబర్‌ గలీ నుంచి సాంగియోట్‌కు వెళ్తుండగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు దాడి జరిగింది. తొలుత పిడుగుపాటు వల్ల ట్రక్కులో మంటలు చెలరేగాయి అనే అనుమానాలు వచ్చాయి. కానీ ఉగ్రవాదుల దాడేనని దర్యాప్తులో తేలింది. ఘటన వివరాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సైన్యాధిపతి మనోజ్‌ పాండే వివరించారు. భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితులను ఉగ్రవాదులు అవకాశం తీసుకుని దాడికి పాల్పడ్డారని సైనికాధికారులు భావిస్తున్నారు.


Related News

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Ladakh: లడఖ్ నిరసనల వెనుక కుట్ర దాగి ఉందన్న లెఫ్టినెంట్ గవర్నర్

Big Stories

×