BigTV English

TVK Vijay: సింగిల్ సింహం.. విజయ్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారా?

TVK Vijay: సింగిల్ సింహం.. విజయ్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారా?

తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ఎప్పుడూ పోరు జరిగేది. కరుణానిధి తర్వాత డీఎంకే స్టాలిన్ నాయకత్వంలో బలపడినా, అన్నాడీఎంకే మాత్రం జయలలిత మరణం తర్వాత దిక్కులేని నావలా మారింది. దీంతో పొలిటికల్ గ్యాప్ ని తమకు అనుకూలంగా మార్చుకోడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా అదనుకోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి టైమ్ లో కొత్తగా పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగుతున్న తమిళ స్టార్ హీరో విజయ్ నిర్ణయం ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగా ఎన్నికల పొత్తుల విషయంలో విజయ్ కుండబద్దలు కొట్టారు. సింగిల్ గా బరిలో దిగుతానన్నారు.


రెండో భారీ సభ..

తన భావజాల శత్రువు బీజేపీ అని, రాజకీయ విరోధి డీఎంకే అని తేల్చి చెప్పారు తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీ అధినేత విజయ్. 2024 ఫిబ్రవరిలో టీవీకేను స్థాపించిన ఆయన తాజాగా ఓ భారీ బహిరంగ సభ నిర్వహించారు. గతేడాది విల్లుపురం జిల్లాలోని విక్రవందిలో తొలి సభ నిర్వహించగా, ఇప్పుడు మదురైలో రెండో సభ నిర్వహించారు. తాను మదురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు విజయ్. తొలి ఎన్నికల్లో విజయ్ పార్టీ సక్సెస్ అవుతుందా, కనీసం విజయ్ అయినా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా అనేది ఆసక్తికరంగా మారింది.


పొత్తు లేకుండా ఎలా..?

2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే బలంగానే కనపడుతున్నా.. బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు అక్కడ ప్రధానంగా మారే అవకాశం ఉంది. అన్నాడీఎంకే నాయకత్వ గొడవలతో సతమతం అవుతోంది. ఇలాంటి టైమ్ లో TVK పార్టీతో సత్తా చూపాలనుకుంటున్నారు విజయ్. అయితే డీఎంకే వ్యతిరేకులతో కలసి ఆయన ఎన్నికల బరిలో దిగితే బాగుంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికలు పేలికలు అయితే విజయ్ కి ఒరిగేదేమీ లేదంటున్నారు. కానీ విజయ్ మాత్రం ఆ ప్లాన్ వర్కవుట్ కాదనుకుంటున్నారు. తన సొంత బలం ఏంటో తేల్చుకోడానికే ఆయన సిద్ధమయ్యారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో TVK సొంతంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు విజయ్.

సినిమా డైలాగులేనా..?
కులం కాదు, మతం కాదు, తమిళుడికే తన తొలి ప్రాధాన్యం అన్నారు విజయ్. మనుగడ కోసమే ఇతర పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. ఆరెస్సెస్‌ ముందు మనం ఎందుకు తలవంచాలని ప్రశ్నిస్తున్న విజయ్, అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం లేదన్నారు. కచ్చతీవులకు శ్రీలంక నుంచి స్వేచ్ఛ కల్పిస్తామని, దాన్ని తమిళ జాలర్లకు అప్పగిస్తామన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఢిల్లీలో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నాడని విమర్శించారు. కెప్టెన్ విజయ్ కాంత్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు విజయ్. అయితే విజయ్ కాంత్ కూడా సింగిల్ గా పోటీ చేసి విఫలమయ్యారు, తర్వాత అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న తర్వాతే ఆయన డీఎండీకే పార్టీకి బలం పెరిగింది. మరి ఈ విషయాన్ని విజయ్ ఎందుకు గుర్తించలేదో తెలియాల్సి ఉంది.

Related News

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

PM Removal Bill: బాబు-నితీష్‌ కట్టడికి ఆ బిల్లు.. కాంగ్రెస్ ఆరోపణలు, ఇరకాటంలో బీజేపీ

Online Games Bill: ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు లోక్‌ సభ ఆమోదం.. అలా చేస్తే కోటి రూపాయల జరిమానా

Mumbai floods: ముంబై అల్లకల్లోలం.. మునిగిన అండర్ గ్రౌండ్ మెట్రో..!

Delhi News: ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి, పోలీసుల అదుపులో నిందితుడు, ఏం జరిగింది?

Big Stories

×