BigTV English

Paradha Review: ‘పరదా’ రివ్యూ : గుడ్డినమ్మకం పనికిరా(లే)దు 

Paradha Review: ‘పరదా’ రివ్యూ : గుడ్డినమ్మకం పనికిరా(లే)దు 

Paradha Review : అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ పోషించిన ‘పరదా’ అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతూ మొత్తానికి ఆగస్టు 22న విడుదల కానుంది. రివ్యూలు చూశాకే మా సినిమాకి రండి అని టీం చెప్పడంతో ‘పరదా’ చర్చల్లో నిలిచింది. రివ్యూల కోసమే అన్నట్టు రిలీజ్ కి 2 రోజుల ముందు నుండి ప్రీమియర్స్ వేశారు. మరి సినిమా వారి నమ్మకానికి తగిన విధంగా ఉందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :


 

కథ : పడతి అనే ఒక గ్రామంలో ఒక వింత ఆచారం ఉంటుంది. అది ఆచారం అనకూడదు.. మూఢ నమ్మకం అనాలేమో. అక్కడి అమ్మాయిలు ఈడొచ్చినప్పటి నుండి ముఖాన్ని పరదాతో కప్పుకోవాలి. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు తప్ప.. బయటవాళ్ళు ఎవ్వరూ ఆ అమ్మాయి ముఖం చూడకూడదు. ఇక అమ్మాయిలు బయటకి వచ్చినప్పుడు పొరపాటున పరదా తీస్తే.. ‘ఆ టైంలో మగాళ్లు ఆమెను చూస్తే ఊరికి అరిష్టం.. ఆ ఊర్లో కడుపుతో ఉన్న ఆడవాళ్లు తమ బిడ్డల్ని కోల్పోతారు’ అనేది అక్కడి జనాల నమ్మకం. కాబట్టి ఆ పరదా తీసిన అమ్మాయిలను ఆత్మాహుతి చేసి చంపేస్తారు. దీనికి కూడా ఓ కథ ఉంటుంది. మరోపక్క సుబ్బలక్ష్మి(అనుపమ పరమేశ్వరన్) పరదాలు అమ్ముకునే కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె రాజేష్ (రాగ్ మయూర్) ని ప్రేమిస్తుంది. వీళ్ళు పెద్దల్ని ఒప్పించి పెళ్ళికి రెడీ అవుతారు. అయితే సుబ్బలక్ష్మి ఒక చోట ఉన్నప్పుడు గాలి ఎక్కువగా వేయడం వల్ల ఆమె పరదా ఎగిరిపోతుంది. వెంటనే అక్కడ ఎవ్వరూ లేరు కదా అని భావించి పరదా మళ్ళీ కప్పేసుకుంటుంది. తర్వాత పెళ్లి టైంలో ఆమె మొహం ఒక మ్యాగ్జైన్ లో పడుతుంది. దాన్ని రాజేష్ సోదరుడు తీసుకొచ్చి పెళ్లి ఆపేస్తాడు. తర్వాత సుబ్బలక్ష్మిని ఆ ఊరి జనాలు ఆత్మాహుతి చేయాలని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఏమైంది? సుబ్బలక్ష్మి ఆ గండం నుండి ఎలా తప్పించుకుంది. అసలు ఆమెను ఫోటో తీసిన వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.


విశ్లేషణ : థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడిని పావుగంటలో కథలోకి అంటే.. దర్శకుడు అనుకున్న ప్రపంచంలోకి తీసుకెళ్లాలి. ఇది చాలా మంది దర్శకులు చెప్పిన పాఠం. దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల కూడా ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నాడు అని చెప్పాలి. సినిమా మొదలైన పావు గంటలోనే.. తాను అనుకున్న ప్రపంచంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్తాడు. ఆ తర్వాత వచ్చే హీరోయిన్ లవ్ ట్రాక్, ఊరి జనాల స్వభావాలు తెలుపడం వంటివి కూడా బాగున్నాయి. సుబ్బలక్ష్మి పరదా ఎప్పుడైతే ఎగిరిపోయిందో ఆ సీన్ కి ప్రేక్షకుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో గెస్ చేసేస్తాడు. అయినా దర్శకుడు ప్రవీణ్ పెళ్లి సీన్ వరకు ఆసక్తిగా కథనాన్ని నడిపించాడు. ఆ తర్వాత వచ్చే ఆత్మాహుతి సీక్వెన్స్ కూడా అలరిస్తుంది. కానీ ఎప్పుడైతే ఊరి జనాలు హీరోయిన్ పాత్రపై సింపతీ చూపించి ఆమెకు ఇంకో అవకాశం ఇస్తారో.. అక్కడి నుండి కథ పట్టుతప్పింది. చెప్పాలంటే కథ అక్కడితో అయిపోయింది అనే చెప్పాలి. ఆ తర్వాత సంగీతని వేసుకుని అనుపమ ధర్మశాలకి వెళ్లడం అనే పాయింట్ తోనే సినిమా క్లైమాక్స్ వరకు సాగుతుంది. క్లైమాక్స్ కూడా ఆశించినట్టే ఉంటుంది. సో సినిమా ఫస్ట్ హాఫ్ లో 40 నిమిషాలకే అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అక్కడి నుండి దర్శకుడు ల్యాగ్ రాసుకున్నాడన్న మాట. మొన్నామధ్య వచ్చిన ‘కోర్ట్’ కథ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ కే చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది. కానీ సెకండాఫ్ లో దర్శకుడు కథనంపై దృష్టి పెట్టాడు. ప్రేక్షకులని థియేటర్లలో కూర్చోబెట్టగలిగాడు. ‘పరదా’ విషయానికి వస్తే సెకండాఫ్ ను దర్శకుడు గ్రిప్పింగ్ గా డిజైన్ చేసుకోలేకపోయాడు. ఇది ప్రతి సన్నివేశంలో తెలుస్తూనే ఉంటుంది. అయితే టెక్నికల్ గా మాత్రం ఇది చిన్న సినిమాలా అనిపించదు. మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ క్వాలిటీ గానే ఉన్నాయి. నిడివి కొంచెం ట్రిమ్ చేసుంటే బాగుండేది.

నటీనటుల విషయానికి వస్తే.. అనుపమకి చాలా రోజుల తర్వాత మంచి పాత్ర దొరికింది. సంగీతకి కూడా అంతే. అమిష్ట పాత్రకి మంచి బిల్డప్ ఇచ్చారు. ఆమె బాగా నటించింది కూడా. కానీ తర్వాత ఆమె పాత్రకి ఆరంభంలో ఇచ్చిన బిల్డప్ అంతా సైడ్ అయిపోతుంది. రాగ్ మయూర్ బాగా చేశాడు. హర్ష వర్ధన్ ట్రాక్ కొంచెం నవ్వించింది. మిగతా నటీనటులు ఓకే.

ప్లస్ పాయింట్స్ :

మొదటి 45 నిమిషాలు

సినిమాటోగ్రఫీ

టెక్నికల్ వాల్యూస్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్

సాగదీత

 

మొత్తంగా ‘పరదా’ ఇంట్రెస్టింగ్ స్టార్ట్ అయ్యింది. మంచి పాయింట్ తీసుకున్నారు. కానీ గ్రిప్పింగ్ నెరేషన్ లేకపోవడం వల్ల.. ప్రేక్షకుల పై భారం పెట్టినట్టు అయ్యింది. చివర్లో ఇచ్చే మెసేజ్ కూడా ప్రేక్షకులు పట్టించుకోలేనంతగా సాగదీసి వదిలాడు దర్శకుడు.

 

రేటింగ్ : 2.25/5

Related News

Tehran Movie Review : ‘టెహ్రాన్’ మూవీ రివ్యూ… యాక్షన్‌‌తో దుమ్మురేపే గ్లోబల్ స్పై థ్రిల్లర్

Coolie Movie Review : కూలీ మూవీ రివ్యూ… లోకి ‘లో’ మార్క్

WAR 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ.. జస్ట్ వార్ – నో రోర్

Coolie Twitter Review : కూలీ సినిమా ట్విట్టర్ రివ్యూ

War 2Twitter Review : ‘వార్ 2 ‘ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..!

Big Stories

×