Big Stories

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి లేదు: మమతా బెనర్జీ

Mamata Banerjee
Mamata Banerjee

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి భాగస్వామ్మ పక్షాలు సీపీఐ(ఎం), కాంగ్రెస్ పార్టీలు బీజేపీతో చేతులు కలిపాయని, రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి అస్తిత్వం కోల్పోయిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు.

- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్-కాంగ్రెస్-ఐఎస్‌ఎఫ్ కూటమికి అనుకూలంగా ఓట్లు వేయవద్దని తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధిష్టానం ప్రజలను కోరింది. ఎందుకంటే వారికి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లు అవుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

“పశ్చిమ బెంగాల్‌లో INDIA కూటమి లేదు. ప్రతిపక్ష కూటమి ఏర్పాటులో నేనే కీలక పాత్ర పోషించాను. దాని పేరు కూడా నేనే పెట్టాను. కానీ, సీపీఎం, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో బీజేపీ కోసం పనిచేస్తున్నాయి.” అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

మీరు బీజేపీని ఓడించాలనుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ(ఎం), వారి మిత్రపక్షమైన మైనారిటీ పార్టీ (ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్)కు అనుకూలంగా ఓట్లు వేయవద్దు’’ అని దీదీ అన్నారు.

టీఎంసీ నాయకులను సీబీఐ, ఈడీ వేటాడుతున్నప్పటికీ, పశ్చిమ బెంగాల్‌లో ఏ ఒక్క సీపీఎం లేదా కాంగ్రెస్ నాయకుడిని ఈ ఏజెన్సీలు అరెస్టు చేయలేదని దీదీ పేర్కొన్నారు.

జనవరిలో, దీదీ తమ పార్టీ పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు, సీట్ల భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ నాయకత్వం చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టారు.

Also Read: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్.. ధనిక మిత్రులతో కలిసి మోదీ నిర్ణయం: రాహుల్ గాంధీ

అయితే TMC, ప్రతిపక్ష I.N.D.I.A. జాతీయ స్థాయిలో కూటమి. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఒంటరిగా బరిలోకి దిగాలని తీసుకున్న నిర్ణయం త్రిముఖ ఎన్నికల పోరుకు రంగం సిద్ధం చేసింది.

దీదీ వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రతిస్పందించిన సీపీఐ(ఎం) నేత సుజన్ చక్రవర్తి, కాషాయ శిబిరంతో టీఎంసీకి రహస్య అవగాహన ఉందని ఆరోపించారు.

“హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్ వంటి అనేక మంది అగ్ర ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేశారు. అయితే అనేక అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ TMC అగ్ర నాయకత్వాన్ని ఎవరూ ముట్టుకోలేదు. రెండవది, I.N.D.I.A. కూటమి TMC వ్యక్తిగత ఆస్తి కాదు. పొత్తు ఉందో లేదో TMC చెప్పే అధికారం లేదని సుజన్ చక్రవర్తి పేర్కొన్నారు.

కాగా రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో టీఎంసీ పోటీ చేస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News