BigTV English

Heat Waves: వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో వడగాల్పులు.. ఈ జిల్లాలకు IMD హెచ్చరిక!

Heat Waves: వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో వడగాల్పులు.. ఈ జిల్లాలకు IMD హెచ్చరిక!

Heat Waves in telanganaHeat Waves in telangana(TS news updates): గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయటకు రావడానికే భయపడుతున్నారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చిరికలు జారీ చేసింది.


రాబోయే రెండు మూడు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణం కన్నా ముడూ నుంచి నాలుగు డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వెల్లడించింది. సోమవారం, మంగళవారం రెండు రోజుల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీలకు చేరి.. వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.


Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అమెరికా నుంచి వస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ..!

సోమవారం నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మంగళవారం నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాలకు వడగాల్పులు వీచే అవకాశం ఉందని IMD తెలిపింది. ఏప్రిల్ 3వ తేదీన నారాయణ పేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Related News

Weather News: రాష్ట్రానికి బిగ్ రెయిన్ అలర్ట్.. నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతవాసులు జాగ్రత్త..!

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికలు.. తుది ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల

Nalgonda News: ఖరీదైన కార్లలో మేకలు, గొర్రెల దొంగతనం.. 16 మంది అరెస్ట్

Mehdipatnam accident: మెహదీపట్నం బస్టాప్‌లో RTC బస్సుకు మంటలు.. క్షణాల్లో బూడిద!

Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్

Mancherial Teacher: వెరైటీగా క్లాస్ కు వచ్చిన టీచర్.. విద్యార్థులు షాక్.. ఎక్కడంటే?

Big Stories

×