BigTV English

Pooja Hegde: నాతో మీకేంటి ప్రాబ్లమ్.. మీడియాపై పూజా హెగ్డే ఫైర్..

Pooja Hegde: నాతో మీకేంటి ప్రాబ్లమ్.. మీడియాపై పూజా హెగ్డే ఫైర్..

Pooja Hegde: పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్ దక్కించుకోవడం అంత ఈజీ కాదు. అలాంటిది పూజా హెగ్డే దాదాపుగా ఆ ట్యాగ్‌కు చాలా చేరువలో వచ్చింది. సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోయింది. కానీ ఒకానొక సందర్భంలో నార్త్ కోసం సౌత్‌ను పక్కన పెట్టేసింది. అదే సమయంలో తను హిందీలో నటించిన సినిమాలు ఏవీ హిట్ కాలేదు. అలా పూజా హెగ్డేకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం పూజాకు తమిళ, హిందీ భాషల్లో ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా తను హీరోయిన్‌గా నటించిన ‘దేవ’ అనే హిందీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ ప్రమోషన్స్ సమయంలో మీడియాపై ఫైర్ అయ్యింది పూజా హెగ్డే.


ఇబ్బందికర ప్రశ్నలు

షాహిద్ కపూర్ (Shahid Kapoor) హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన చిత్రమే ‘దేవ’ (Deva). ఈ సినిమా పలుమార్లు వాయిదా పడిన తర్వాత తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తోంది. విడులదయిన తర్వాత కూడా మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను ఆపలేదు. తాజాగా మేకర్స్ అంతా కలిసి ఒక స్పెషల్ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. అందులో పూజాకు ఇబ్బందికర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇప్పటికీ తను బాలీవుడ్‌లో డెబ్యూ చేసి చాలాకాలమే అయ్యింది. డెబ్యూ నుండి ఇప్పటివరకు అందరు స్టార్ హీరోలతోనే జోడీకట్టింది. కానీ అందులో ఒక్క మూవీ కూడా హిట్ కాలేదు. అలా తనకే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ ఎలా వస్తుంది అంటూ పూజా హెగ్డేకు ప్రశ్న ఎదురయ్యింది.


లక్ కాదు

‘‘నేను దానికి అర్హురాలినే. వాళ్ల సినిమాల్లో క్యాస్ట్ చేసుకుంటున్నారంటే నాలో ఏదో ఉందనే కదా.. లక్ అనేది కష్టపడితేనే వస్తుంది అంటుంటారు. నా విషయంలో అదే జరిగిందని అనుకుంటాను. అవకాశం వచ్చినప్పుడు నేను అది చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు దానిని లక్ అనే అనాలనుకుంటే పర్వాలేదు అలాగే అనుకోవచ్చు’’ అని సమాధానమిచ్చింది పూజా హెగ్డే (Pooja Hegde). అయినా కూడా అలాంటి ప్రశ్నలు ఆగలేదు. తను స్టార్ హీరోల సినిమాలను మాత్రమే ఎంచుకుంటుందని, మిగతా సౌత్ హీరోయిన్లకు ఈ అవకాశం దక్కలేదని పదేపదే ప్రస్తావించారు. దీంతో పూజా సహనం కోల్పోయింది. వారిపై సీరియస్ అయ్యింది.

Also Read: స్టేజ్‌పైనే ఏడ్చేసిన సోనమ్ కపూర్.. అతడి జ్ఞాపకాలను మర్చిపోలేక.!

ఏంటి ప్రాబ్లమ్

‘‘నాతో మీకేంటి ప్రాబ్లమ్’’ అంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది పూజా హెగ్డే. అది గమనించిన షాహిద్ కపూర్ వెంటనే టాపిక్ మార్చేశాడు. 2012లో ‘ముగమూడి’ అనే తమిళ చిత్రంతో మోడల్ నుండి హీరోయిన్‌గా మారింది పూజా హెగ్డే. ఆ తర్వాత వరుసగా తెలుగులో హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంది. 2016లో ‘మోహంజోదారో’ అనే మూవీతో బాలీవుడ్‌లో డెబ్యూ చేసే ఛాన్స్ కొట్టేసింది పూజా. మొదటి మూవీతోనే హృతిక్ రోషన్‌తో జోడీకట్టింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్.. ఇప్పుడు షాహిద్ కపూర్ లాంటి స్టార్లతో జోడీకట్టి అందరినీ ఆకట్టుకుంది. ఎంతమంది స్టార్లతో నటించినా పూజాకు బాలీవుడ్‌లో ఆశించిన బ్రేక్ దక్కడం లేదు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×