BigTV English

Flights: విమానంలో కొట్లాట.. మహిళపై మూత్రవిసర్జన.. ఆకాశంలో అరాచకాలు

Flights: విమానంలో కొట్లాట.. మహిళపై మూత్రవిసర్జన.. ఆకాశంలో అరాచకాలు

Flights: విమానం ఎక్కారంటే కాస్తో కూస్తో గొప్పోల్లే అయి ఉంటారని అనుకుంటాం. చదువుకున్న వారై ఉంటారని భావిస్తాం. మంచి పద్దతి, నడవడిక, హుందాగా ఉండే వ్యక్తిత్వం ఉంటుందనే భావన ఉంటుంది. చాలామంది అలాంటివాళ్లే ఉంటారు. కానీ, విమాన ప్రయాణికుల్లో కొందరు వేస్ట్ గాళ్లు కూడా ఉంటారనేలా వరుస ఘటనలు జరుగుతున్నాయి. చిల్లర, చిచోరా చేష్టలతో పరువు తీస్తున్నారు కొందరు ప్యాసింజర్లు.


ఇటీవల బ్యాంకాక్ విమానంలో భారతీయులు కొట్టుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. రైల్లో, బస్సులో సీటు కోసం కొట్లాడుకున్నట్టు.. విమానంలోనూ కొట్టుకుంటారనే విషయం అందరికీ తెలిసిపోయింది. ఎయిర్ హోస్టెస్ వారిస్తున్నా వినకుండా.. ఇద్దరు యువకులు వాగ్వాదానికి దిగారు. అంతలోనే ఒకతని స్నేహితులు వచ్చి ఎదుటి వ్యక్తిని కొట్టడం స్టార్ట్ చేశారు. అంతా చూస్తుండగానే.. ఆ యువకుడిని చితక్కొట్టారు ఆ స్నేహితుల బృందం. బ్యాంకాక్‌ నుంచి కోల్‌కతా వచ్చే విమానంలో ఈ ఘటన జరిగింది. ఆ వీడియో చూసిన వారంతా ఔరా అంటూ ఆశ్చర్యపోయారు.

కట్ చేస్తే, లేటెస్ట్ గా మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇదైతే మరీ చండాలం. బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తప్పతాగి.. మతితప్పి ప్రవర్తించాడు. మద్యం మత్తులో మరో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఆ సమయంలో ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది ప్రవర్తన తీవ్ర వివాదాస్పదమవుతోంది.


గత నవంబరు 26న న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలో ఈ ఘటన జరిగింది. 70 ఏళ్ల పైబడిన ఓ వృద్ధురాలు బిజినెస్‌ క్లాసులో ఉండగా.. మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ఆమె సీటు దగ్గరకు వచ్చి ఆమెపై మూత్రవిసర్జన చేశాడు. విమానంలో లైట్లు ఆర్పేసిన సమయంలో ఇలా జరిగింది. వాడేదో తాగిన మైకంలో అలా చేసాడని అనుకున్నా.. ఆ తర్వాత జరిగిన సీన్ మరింత దారుణం.

బాధిత మహిళ జరిగిన విషయంపై విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. తన దుస్తులు, బ్యాగు తడిచిపోయాయని చెప్పగా.. సిబ్బంది ఆమెకు మరో జత దుస్తులు, స్లిప్పర్స్‌ ఇచ్చారు. అంతేగానీ, ఆ ప్రయాణికుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఫ్లైట్ ల్యాండ్‌ అయిన తర్వాత అతడు దర్జాగా వెళ్లిపోయాడు.

విమాన సిబ్బంది తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ మహిళ.. ఘటన జరిగిన మరుసటి రోజు ఎయిరిండియా సంస్థ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌కు లేఖ రాశారు. ‘‘తడిచిపోయిన సీట్లో నేను కూర్చోలేనని చెప్పడంతో సిబ్బంది కూర్చునే సీటు నాకు కేటాయించారు. గంట తర్వాత నన్ను తిరిగి నా సీట్లోకి వెళ్లిపొమ్మన్నారు. షీట్లతో కవర్‌ చేసి, డిస్ఇన్ఫెక్టెంట్‌తో స్ప్రే చేసినా అక్కడ వాసన పోలేదు. నేను కూర్చోలేనని చెప్పడంతో తిరిగి సిబ్బంది కూర్చునే సీట్లోకే పంపించారు. బిజినెస్‌ క్లాసులో సీట్లు ఖాళీగా ఉన్నా నాకు కేటాయించలేదు’’ అంటూ ఆ లేఖలో తెలిపారు.

లేఖపై ఎయిర్ ఇండియా ఛైర్మన్ చంద్రశేఖర్ స్పందించి.. ఘటనపై విచారణకు అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారు. ఆ ప్రయాణికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. అతనిని నో-ఫ్లై జాబితాలో చేర్చాలని డీజీసీఏ(DGCA)కు సిఫార్సు చేసినట్టు సమాచారం.

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×