BigTV English

Chandrababu: కోపంతో ఊగిపోయిన చంద్రబాబు.. కుప్పంలో పోలీస్ వర్సెస్ టీడీపీ

Chandrababu: కోపంతో ఊగిపోయిన చంద్రబాబు.. కుప్పంలో పోలీస్ వర్సెస్ టీడీపీ

Chandrababu: చంద్రబాబు ఉగ్రరూపం ప్రదర్శించారు. పోలీసులపై నిప్పులు చెరిగారు. డీఎస్పీపై కోపంతో ఊగిపోయారు. మీదిమీదకు వెళ్లారు. పోలీస్ అధికారులను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తన ర్యాలీని అడ్డుకోవడమేంటి? ఇదేమి రాజ్యం అంటూ మండిపడ్డారు. పెద్ద ఎత్తున చేరిన టీడీపీ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పెద్దూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు జీవో నెంబర్ 1 ప్రకారం పోలీసులు అనుమతి నిరాకరించారు. చంద్రబాబు ప్రచార రథాన్ని సీజ్‌ చేశారు. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన మైకులు తొలగించారు. చంద్రబాబు పర్యటన మార్గాల్లో బారికేడ్లు పెట్టి కార్యకర్తలను నియంత్రించారు. ఎస్‌.గొల్లపల్లి దగ్గర పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీఛార్జి చేయడంతో.. మహిళా కార్యకర్తలతో పాటు 10 మందికి గాయాలయ్యాయి.

అయితే, ఎలాగైనా కుప్పంలో పర్యటించి తీరుతానంటూ చంద్రబాబు పంతం పట్టారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి.. అక్కడి నుంచి కర్నాటక బోర్డర్ గుండా కుప్పంలో అడుగుపెట్టారు.


అప్పటికే పోలీసు నిర్బంధాలు చేధించుకుని వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. కుప్పం సరిహద్దుల్లో శాంతిపురం మండలం జేపీ కొత్తూరు దగ్గర చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు.

మరోవైపు, పర్యటనకు అనుమతి లేదని పెద్దూరులో చంద్రబాబును అడ్డుకున్నారు పోలీసులు. స్థానిక డీఎస్పీ చంద్రబాబుకు నోటీసులు అందజేశారు. తన ర్యాలీని ఎందుకు అనుమతించరంటూ పోలీసులపై తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. మైకులకు అనుమతి లేదని, ఇంటింటి ప్రచారం మాత్రం చేసుకోవచ్చని పోలీసులు చంద్రబాబుకు చెప్పారు. కండిషన్లు లిఖిత పూర్వకంగా ఇవ్వాలంటూ చంద్రబాబు పట్టుబట్టారు. ఈ సందర్భంగా పెద్దూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

వేల జన్మలు ఎత్తినా కుప్పంలో గెలిచేది టీడీపీనే అన్నారు చంద్రబాబు. ఏపీలో ఎమర్జెన్సీ విధించాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలన్నారు చంద్రబాబు. నా సొంత నియోజకవర్గానికి నన్ను వెళ్లనీయరా? నా ప్రజలను నేను కలవకూడదా? వైసీపీకి ఓ రూల్.. నాకో రూలా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. జగన్ పనైపోయిందని ప్రజలు డిసైడ్ అయిపోయారని.. అందుకే తన సభలకు తండోపతండాలుగా తరలివస్తున్నారని చంద్రబాబు అన్నారు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×