E-Paper
Advertisement

Lok Sabha Speaker Election: కుదరని ఏకాభిప్రాయం.. తొలిసారి లోక్ సభ స్పీకర్ స్థానానికి ఎన్నిక..!

Lok Sabha Speaker Election: కుదరని ఏకాభిప్రాయం.. తొలిసారి లోక్ సభ స్పీకర్ స్థానానికి ఎన్నిక..!
Advertisement

Lok Sabha Speaker Elections: లోక్ సభ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఇండియా కూటమి నేతలతో రాజ్ నాథ్ సింగ్ జరిపిన చర్చలు ఫలించలేదు. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇస్తే స్పీకర్ ఎన్నికకు ఏకగ్రీవంగా సహకరిస్తామని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రతిపాదించగా.. అందుకు ఎన్డీయే పక్షం నో చెప్పింది. దీంతో ఇండియా కూటమి లోక్ సభ స్పీకర్ పదవి ఎన్నికలకు సిద్ధమైంది. దేశంలోనే తొలిసారి లోక్ సభ స్పీకర్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకూ లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరగ్గా.. ఈసారి ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య అభిప్రాయం కలవకపోవడంతో స్పీకర్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్డీయే లోక్ సభ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లా నేడు నామినేషన్ వేయనున్నారు. ఓం బిర్లా నామినేషన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా.. కేంద్రమంత్రులు, ఎన్డీయే పక్షాల నేతలు హాజరు కానున్నారు. ఓం బిర్లా నామినేషన్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇండియా కూటమి నుంచి లోక్ సభ స్పీకర్ అభ్యర్థిగా కేరళ ఎంపీ సురేష్ నామినేషన్ వేయనున్నారు.

Advertisement

Also Read: Om Birla elected as Loksabha Speaker: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా, ప్రధాని మోదీ, రాహుల్ శుభాకాంక్షలు

లోక్ సభ సభ్యులంతా కలిసి తమలో ఒకరిని స్పీకర్ గా ఎన్నుకుంటారు. స్పీకర్ కు సహాయంగా.. డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకుంటారు. లోక్ సభ సభ్యుల ప్రమాణ స్వీకారాల తర్వాత లోక్ సభ ఏర్పాటవుతుంది. స్పీకర్ ఎన్నిక పూర్తయ్యే వరకూ తాత్కాలిక స్పీకర్ ను ఎంచుకుంటారు సభ్యులు. అదే ప్రొటెం స్పీకర్ ఎన్నిక. ప్రస్తుతం లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మహతాబ్ ఉన్నారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×