Operation Sindoor: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని కీలక ఉగ్రవాద శిక్షణ స్థావరాలను భారత వైమానిక దళం టార్గెట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి లక్ష్యంగా టార్గెట్ చేసిన ‘అబ్బాస్ టెర్రరిస్ట్ క్యాంప్’ పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను తాజాగా ఇండియన్ ఆర్మీ అధికారికంగా విడుదల చేసింది.
13 కిలోమీటర్ల దూరంలోనే..
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కోట్లి ప్రాంతంలోని అబ్బాస్ శిబిరం కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది లష్కరే తోయిబా సంస్థకు అత్యంత కీలకమైన శిక్షణ కేంద్రం. ముఖ్యంగా మానవ ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే కేంద్రం ఇది. ఈ శిబిరంలో ఒకేసారి 50 మందికి పైగా ఉగ్రవాదులు శిక్షణ పొందే సదుపాయాలు ఉన్నాయి. లోపల బంకర్లు, తుపాకుల నిల్వలు, అధునాతన పేలుడు పదార్థాలు, ఇక్కడ ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు పేర్కొన్నాయి.
నిమిషాల్లో నేలమట్టం..
రాత్రి 1:04AMకి భారత రఫేల్ యుద్ధవిమానాల నుండి స్కాల్ప్ క్రూజ్ మిస్సైల్ ప్రయోగించి ఈ స్థావరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు మన సైనికులు. శిబిరంలోని ప్రధాన భవనాలు, బంకర్లు, శిక్షణ హాళ్లు అన్నీ క్షణాల వ్యవధిలోనే పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడి తర్వాత డ్రోన్ ఫుటేజ్‌ను ఇండియన్ ఆర్మీ విడుదల చేయగా, ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఆ వీడియోలో ఏముందంటే?
ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన వీడియోలో మిస్సైల్ తో మన సైన్యం చేసిన భీకర కాల్పుల దృశ్యాలు, పేలుతున్న శిబిర భవనాలు, ఆపరేషన్ అనంతరం డ్రోన్ దృశ్యాలు, ఉగ్ర శిక్షణ సదుపాయాలు పూర్తిగా ధ్వంసమైనట్లుగా రికార్డయింది. ఈ వీడియో ద్వారా మన సైన్యం మాటలతో కాదురా.. చర్యలతో సమాధానం చెబుతామని పాకిస్తాన్ ఉగ్ర మూకకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పవచ్చు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, మనవాళ్లు మన సైనికుల పోరాటపటిమకు జైహింద్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విజయంతో మన సైన్యం కేవలం ప్రతీకారాన్ని కాకుండా, భవిష్యత్ లో భారత్‌పై జరిగే దాడులకు ముందే గట్టి హెచ్చరిక ఇచ్చిందని చెప్పవచ్చు. ఆపరేషన్ సింధూర్ తో దేశం మొత్తం సోషల్ మీడియాలో సైనికులకు అభినందనలు తెలుపుతుండగా, #JaiJawan #OperationSindhoor హ్యాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ లోకి వచ్చాయి.
OPERATION SINDOOR#JusticeServed
Target 1 – Abbas Terrorist Camp at Kotli.
Distance – 13 Km from Line of Control (POJK).
Nerve Centre for training suicide bombers of Lashkar-e-Taiba (LeT).
Key training infrastructure for over 50 terrorists.DESTROYED AT 1.04 AM on 07 May 2025.… pic.twitter.com/OBF4gTNA8q
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 7, 2025
టార్గెట్ 2 అంటూ మరో వీడియో విడుదల
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా రెండో టార్గెట్ గా గుల్పూర్ ఉగ్రవాద శిబిరంను ఎంచుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని కోట్లి ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శిబిరం, లష్కరే తోయిబా కి ప్రధాన ఆపరేషన్ కేంద్రంగా పనిచేస్తోంది. భారత వాయుసేన అత్యాధునిక రఫేల్ యుద్ధవిమానాలు ద్వారా ఈ శిబిరాన్ని లక్ష్యంగా చేసుకొని మెరుపుదాడి నిర్వహించింది. లష్కరే తోయిబా ఉగ్రదళాలు తిరిగి జమ్ము కాశ్మీర్ లో పునరుజ్జీవింపునకు ఈ కేంద్రాన్ని ఆధారంగా చేసుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు తెలిపాయి. ఈ వీడియోను సైతం టార్గెట్ 2 పేరిట ఆర్మీ విడుదల చేసింది.
OPERATION SINDOOR#JusticeServed
Target 1 – Abbas Terrorist Camp at Kotli.
Distance – 13 Km from Line of Control (POJK).
Nerve Centre for training suicide bombers of Lashkar-e-Taiba (LeT).
Key training infrastructure for over 50 terrorists.DESTROYED AT 1.04 AM on 07 May 2025.… pic.twitter.com/OBF4gTNA8q
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 7, 2025