India Pak War: ‘ఆపరేషన్ సింధూర్’ ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పాకిస్తాన్ పాలకుల గుండెల్లో టన్నుల కొద్ది భయం స్టార్ట్ అయ్యింది. అయితే, భారత్ ఆర్మీ కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, స్థావరాలు మీద మాత్రమే దాడులు నిర్వహించింది. తొమ్మిది ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టుగా.. భారత సైన్యం ఇప్పటికే ప్రకటించింన విషయం తెలిసిందే. అయితే దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం.. భారత్ మీద దుష్ప్రచారం చేయడానికి పూనుకుంటోంది. భారత్ దాడులను పిరికి చర్యగా అభివర్ణించిన పాక్ ప్రధాని షరీఫ్.. తమ సైన్యం కూడా త్వరలోనే ధీటుగా సమాధానం చెబుతోందని చెబుతున్నారు.
భారత్ జరిపిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఫ్యామిలీకి చెందిన పది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ దాడులపై మసూద్ ఫ్యామిలీ స్టేట్ మెంట్ కూడా విడుదల చేసింది. ‘మృతిచెందిన వారిలో ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారని.. వారందరూ అల్లా దగ్గరకు వెళ్తారని నమ్ముతున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ మాకు ఎంతో నష్టం చేశారు. ఈ త్యాగం వృథా కాదు. మా వారి అమరత్వం శత్రువుల పతనానికి నాంది పలుకుతోందని.. న్యాయం గెలుస్తుందని’ మసూద్ ఫ్యామిలీ తెలిపింది.
అయితే, భారతదేశంపై ప్రతీకార దాడులకు పాకిస్థాన్ సిద్ధం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మన దేశంపై దాడి చేసేందుకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ బలగాలకు అనుమతి ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరి కొద్దిసేపట్లో ప్రధాని షెహబాజ్ ఫరీష్ పాకిస్థాన్ దేశ ప్రజలను ఉద్దేశించి మీడియా సమావేశంలో ప్రసంగించనున్నారు. దీంతో ఇండియా, దాయాది దేశం పాకిస్థాన్ మధ్య యుద్ధం జరగబోతుందనే వార్తలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Also Read: NMDC Recruitment: డిగ్రీ, ఐటీఐతో 934 ఉద్యోగాలు, రేపే లాస్ట్ డేట్.. శాలరీ రూ.లక్షల్లో
మరోవైపు రెండు దేశాల యుద్దం వస్తే దానిని ఎలా ఎదుర్కోవాలని ఇప్పటికే మోదీ సర్కార్ కూడా త్రివిధ దళాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తుంది. హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ తరచూ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేస్తున్న విషయం తెలిసిందే.