Operation Sindoor : భారత్ చెప్పినట్టే చేసింది. ఉగ్రవాదులను వెంటాడి వేటాడింది. సరిహద్దులు దాటెళ్లి మరీ.. పాక్ గడ్డపై నక్కిన నరరూప రాక్షసులను హతమార్చింది. మంగళవారం మిడ్ నైట్.. 24 మిస్సైల్స్‌తో 25 నిమిషాల పాటు 9 ప్రాంతాల్లో చేసిన దాడులు.. ఇండియన్ ఆర్మీ సత్తాను చాటాయి. సుమారు 100 మంది ఉగ్రవాదులను చంపేశాయి. ఆ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు అనుచరులు హతమయ్యారు. మృతుల్లో మౌలానా మసూద్ అజార్ అక్క, ఆమె భర్త, మసూద్ అజార్ మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, అతని కుటుంబంలోని ఐదుగురు పిల్లలు ఉన్నారు. వాళ్లంతా బహవాల్‌పూర్‌లోని జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ఆ భవనంపై ఇండియన్ ఆర్మీ మిసైల్ సంధించడంతో వారంతా చనిపోయారు.
మసూద్ అజార్ రియాక్షన్
తన కుటుంబ సభ్యుల మృతిపై మసూద్ అజార్ మండిపడుతున్నాడు. అమాయకులను మోడీ టార్గెట్ చేశారని, గెట్ రెడీ అంటూ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశాడు. ఈ దాడులతో తాను భయపడటం లేదని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నాడు. దుఃఖం, దిగ్భ్రాంతి.. వర్ణించలేనంతగా ఉందని, కానీ పశ్చాత్తాపం మాత్రం లేదన్నాడు మసూద్. మోడీ యుద్ధ నియమాలను ఉల్లంఘించారంటూ ఓ ప్రకటన రిలీజ్ చేశాడు. పాకిస్తాన్‌లోని బహవల్పూర్‌లోని మసీదు సుభాన్ అల్లాపై భారత్ జరిపిన క్షిపణి దాడిలో తన అక్క, ఆమె కుటుంబంతో సహా తన కుటుంబ సభ్యులు 10 మంది మరణించారని పాకిస్తాన్ ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ స్వయంగా ప్రకటించాడు.
కుక్క చావు చచ్చారు..
తన దాకా వస్తే కానీ మసూద్‌కు నొప్పి తెలిసి రాలేదు. ఏళ్లుగా వందలాది మంది భారతీయులను పొట్టన పెట్టుకున్నాడు ఆ దుర్మార్గుడు. హిందువుల రక్తం రుచి మరిగిన సైతాన్ వాడు. ఇండియాకు వ్యతిరేకంగా ముస్లిం యువకులను రెచ్చగొట్టి.. ఉగ్రవాదులుగా మార్చి.. శిక్షణ, ఆయుధాలు ఇచ్చి.. భారత్‌కు పంపించి.. ఇక్కడ మారణ హోమం సృష్టించడం వాడి నైజం. పహల్గాం ఉగ్రదాడితో 26 మందిని చంపేసినప్పుడు ఆ బాధ వాడికి తెలియలేదా? మాకేమవుతుంది.. ఎంచక్కా పాకిస్తాన్‌లో ఉన్నాం.. తాము సేఫ్ అనుకున్నాడు ఇన్నాళ్లు. కానీ, ఇప్పుడు ఇక్కడ ఉన్నది మోదీ అని మరిచినట్టున్నాడు. ఆపరేషన్ సిందూర్‌తో.. పాక్ గడ్డపై బాంబులతో అటాక్ చేసింది ఇండియన్ ఆర్మీ. జైషే మహ్మద్ ఉగ్ర శిబిరంపై మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. ముష్కర మూకగా మారిన మసూద్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ దాడిలో కుక్క చావు చచ్చారు.
Also Read : మోదీకి చెబితే ఎట్టా ఉంటాదో తెలిసిందా? మొనగాడ్రా బుజ్జీ..
తన వాళ్లు చస్తే కానీ..
తన వాళ్లు పోయే సరికి.. మసూద్‌కు దుఃఖం, దిగ్భ్రాంతి కలిగిందట. పైగా సిగ్గు లేకుండా పశ్చాత్తాపం మాత్రం లేదంటూ ఇంకా బలుపు చూపిస్తున్నాడు. యుద్ధ నియమాలు ఉల్లంఘించారంటూ సుద్దపూస మాటలు మాట్లాడుతున్నాడు. పహల్గాంలో అమాయక హిందువులను కాల్చి చంపినప్పుడు ఆ యుద్ధ నియమాలు గుర్తుకు రాలేదా? ఇండియాతో నేరుగా యుద్ధం చేసే దమ్ము లేక.. ఇలా పరోక్షంగా ఉగ్రదాడులు చేస్తూ దొంగదెబ్బ తీసే.. సైతాన్ గాళ్లు ఇప్పుడు నీతులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. పోరా పో.. ఏం చేసుకుంటావో చేస్కో పో.. మీ ఇంటికొచ్చి.. మీ ఇంటివాళ్లను చంపేశాం.. ఏం పీకుతావ్ బ్బే? అంటూ సోషల్ మీడియాలో మసూద్ అజార్‌కు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు ఇండియన్స్. మళ్లీ మళ్లీ దాడులు చేస్తాం.. రెడీగా ఉండంటూ సవాళ్లు కూడా చేస్తున్నారు మనోళ్లు. అరేయ్ అజార్.. అబ్ ఆయేగా మజా… అంటున్నారు.
کالعدم تنظیم جیش محمد کے سربراہ مسعود اظہر کی جانب سے کہا گیا ہے کہ انڈین حملے کے نتیجے میں انکے خاندان کے 10 افراد اور چار قریبی ساتھی بھی مارے گئے ہیں۔ بیان میں یہ بھی کہا گیا کہ ’اس ظلم نے سارے ضابطے توڑ دیے، اب کوئی رحم کی امید نہ رکھے۔‘
تفصیل: https://t.co/F4KidG6Mxy pic.twitter.com/W7oTTNElkY— BBC News اردو (@BBCUrdu) May 7, 2025