BigTV English
Advertisement

OTT Movie : విహారయాత్రకి వెళితే నరబలికి సిద్ధం చేశారు… ఊహించని ట్విస్ట్ లతో దడ పుట్టించే సినిమా

OTT Movie : విహారయాత్రకి వెళితే నరబలికి సిద్ధం చేశారు… ఊహించని ట్విస్ట్ లతో దడ పుట్టించే సినిమా

OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలు, ప్రేక్షకుల్ని భయపెట్టడానికి కొత్త కొత్త స్టోరీలతో ఓటీటీలలోకి వస్తూనే ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని సినిమాలు చివరి వరకూ సస్పెన్స్ తో టెన్షన్ పెడుతూ పిచ్చెక్కిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ ఒక దీవిలో జరుగుతుంది. ఈ సినిమాలో ప్రతీ సీన్ సస్పెన్స్ తో సెగలు పుట్టిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


జియో హాట్ స్టార్ (Jio hotstar) లో

ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డెత్ ఆఫ్ మి’ (Death of Me). 2020 లో వచ్చిన ఈ మూవీకి డారెన్ లిన్ బౌస్మన్ డైరెక్ట్ చేశారు. ఇందులో మాగీ క్యూ, లూక్ హెమ్స్వర్త్, అలెక్స్ ఎస్సో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ థాయిలాండ్‌లోని ఒక దీవిలో, విహారయాత్రలో ఉండే ఒక జంట చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ జియో హాట్ స్టార్ (Jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

క్రిస్టీన్, నీల్ విహారయాత్ర కోసం థాయిలాండ్‌ కు వెళతారు. ఒక రోజు ఉదయం వారి హోటల్ గదిలో, గత రాత్రి ఏమి జరిగిందో గుర్తు లేకుండా మేల్కొంటారు. రూమ్ మొత్తం గజిబిజిగా ఉంటుంది. వారి పాస్‌ పోర్ట్‌లు కూడా కనిపించవు. దీంతో కంగారు పడుతుంటారు. అదే సమయంలో నీల్ తన కెమెరాలో ఒక వీడియోని చూస్తాడు. అందులో క్రిస్టీన్‌ పై ఎవరో అఘాయిత్యం చేసి, ఆమెను గొంతు పిసికి చంపి, శవాన్ని పాతిపెట్టడం కనిపిస్తుంది. కానీ క్రిస్టీన్ ఇంకా తన పక్కన బతికే ఉంటుంది. ఇది వారిని గందరగోళానికి గురి చేస్తుంది. వారు గత రాత్రి జరిగిన సంఘటనలను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

ఒక బార్‌లో డ్రింక్ తాగినట్లు, ఆ తారువాతే ఇదంతా జరిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో దీవిలో జరుగుతున్న ఒక వింత ఫెస్టివల్ గురించి తెలుసుకుంటారు. ఈ ఫెస్టివల్ 200 ఏళ్లుగా ఆక్కడ జరుపుకుంటూ ఉంటారు. ఇది దీవిని తుఫానుల నుండి కాడుతుందని అక్కడి స్థానికులు నమ్ముతుంటారు. ఈ పండుగలో ఒక గర్భిణీ స్త్రీని కూడా బలి ఇవ్వాల్సి ఉంటుంది. క్రిస్టీన్ గర్భవతి కావడంతో, ఈ బలికి ఎంపికైనట్లు తెలుస్తుంది. ఆమెను బలి ఇవ్వడానికి దీవిలో నివసించే వాళ్ళు ప్రయత్నిస్తారు. క్రిస్టీన్ వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. చివరికి క్రిస్టీన్ ను ఆ దీవిలో ఉన్న వాళ్ళు బలి ఇస్తారా ? వాళ్ళ నుంచి ఆమె తప్పించుకుంటుందా ? అసలు అక్కడ ఏం జరుగుతుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : పోలీసులకు చెమటలు పట్టించే దొంగతనం కేసు… సర్ప్రైజింగ్ ట్విస్టులతో మెంటలెక్కించే మలయాళం క్రైమ్ థ్రిల్లర్

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×