BigTV English

Digestion: మీరు తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి ఎంత టైం పడుతుందో తెలుసా?

Digestion: మీరు తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి ఎంత టైం పడుతుందో తెలుసా?

Digestion: మనం తీసుకునే ఒక్కో ఆహార పదార్థం జీర్ణం కావడానికి ఒక్కక సమయం పడుతుంది. తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యే సమయం, దాని కోసం అవసరమయ్యే శక్తి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఆహారం కడుపులో ఎంత సమయం జీర్ణమవుతుందో తెలుసుకుంటే, మనం ఏ ఆహారం తినాలో సరిగ్గా ఎంచుకోవచ్చు, శరీరానికి పోషకాలు బాగా అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల జీర్ణ ఆరోగ్యం కూడా మెరుగవుతుందట. కడుపు ఆహారాన్ని మెత్తగా మార్చి, చిన్న ప్రేగులకు పంపుతుంది. ఆహారంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు, నీరు ఎంత ఉందనే దాన్నిబట్టి జీర్ణ సమయం మారుతుంది. కోడి, గుడ్డు, యాపిల్, బంగాళదుంప, నీరు, క్యారెట్, ద్రాక్షలు వంటి ఆహార పదార్థాలు కడుపులో ఎంత సమయం తర్వాత జీర్ణమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..


చికెన్
చికెన్ అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం. ఇది కడుపులో 2 నుంచి 3 గంటల తర్వాత జీర్ణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోడిని ఎలా వండారనే దానిమీద సమయం ఆధారపడుతుందట. కొవ్వు తక్కువ ఉండే గ్రిల్ చేసిన చికెన్ తొందరగా జీర్ణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వేయించిన చికెన్ నెమ్మదిగా జీర్ణమవుతుందట, ఎందుకంటే అందులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్‌ను జీర్ణం చేయడానికి కడుపులో యాసిడ్స్, ఎంజైమ్‌లు ఎక్కువ సమయం పనిచేస్తాయి. చికెన్‌ను జీర్ణం చేయడానికి కూరగాయలతో పోలిస్తే కొంచెం ఎక్కువ సమయం పట్టొచ్చు.

ఉడికించిన గుడ్డు
ఉడికించిన గుడ్డు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. ఇది 2 నుంచి 2.5 గంటల సమయంలో కడుపులో జీర్ణమవుతుందట. గుడ్డులోని సొన కొవ్వు కారణంగా తెల్లసొన కంటే నెమ్మదిగా జీర్ణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన గుడ్డు వేయించిన లేదా స్క్రాంబుల్ గుడ్డు కంటే తొందరగా జీర్ణమవుతుందట. కడుపులోని ఆమ్లాలు గుడ్డు ప్రోటీన్‌ను సులభంగా విడదీస్తాయి, కానీ సొనలో కొవ్వు కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది.


యాపిల్

యాపిల్‌లో ఫైబర్, నీరు ఎక్కువగా ఉంటాయి. ఇది 1 నుంచి 1.5 గంటల్లో జీర్ణమవుతుందట. యాపిల్‌లోని ఫైబర్ జీర్ణాన్ని సరిచేస్తుంది, కానీ కడుపు ఎక్కువగా చక్కెరలు, నీటిని జీర్ణం చేస్తుంది. యాపిల్ సాస్ లేదా ఉడికించిన యాపిల్ సుమారు 1 గంటలో జీర్ణమవుతుంది. తొక్కతో తినే ఆపిల్‌లు ఫైబర్ వల్ల కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాయట. ఇవి కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఇస్తాయి.

బంగాళదుంప
బంగాళదుంపలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఇది 1.5 నుంచి 2 గంటల్లో జీర్ణమవుతుందట. ఉడికించిన బంగాళదుంప వేయించిన లేదా బేక్ చేసిన దాని కంటే తొందరగా జీర్ణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వేయించినవి కొవ్వు కలిగి ఉంటాయి. కడుపు స్టార్చ్‌ను చక్కెరలుగా మారుస్తుంది. తొక్కతో తినే బంగాళదుంపలు ఫైబర్ వల్ల కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాయి.

నీరు
నీటికి జీర్ణం అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది 5 నుంచి 20 నిమిషాల్లో కడుపు నుంచి చిన్న ప్రేగుకు వెళ్తుందట. ఖాళీ కడుపుతో తాగితే ఇంకా తొందరగా వెళ్తుంది. ఆహారంతో నీరు తాగితే కడుపు ఆమ్లాలు కొంచెం బలహీనపడి, ఆహార జీర్ణం నెమ్మదవుతుందని నిపుణులు చెబుతున్నారు. నీరు జీర్ణ క్రియను బాగా నడిపిస్తుందట.

క్యారెట్
క్యారెట్‌లో ఫైబర్, బీటా-కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది 1.5 నుంచి 2 గంటలకు జీర్ణమవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పచ్చి క్యారెట్ వండిన దాని కంటే నెమ్మదిగా జీర్ణమవుతుందట. ఎందుకంటే దాని కణాలు గట్టిగా ఉంటాయి. వండిన క్యారెట్ 1 నుంచి 1.5 గంటల్లో జీర్ణమవుతుంది. కడుపు నీటిని, చక్కెరలను జీర్ణం చేస్తుంది, ఫైబర్ పేగులకు వెళ్తుంది.

ద్రాక్ష
ద్రాక్ష పండ్లలో నీరు, సాధారణ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి 30 నిమిషాల నుంచి 1 గంటలో జీర్ణమవుతాయి. ద్రాక్ష మృదువుగా ఉండటం వల్ల కడుపు తొందరగా జీర్ణం చేస్తుంది. చక్కెరలు త్వరగా శరీరంలోకి వెళ్తాయి. తొక్కలోని ఫైబర్ కొంచెం నెమ్మదిగా జీర్ణమవుతుంది. విత్తనాలు లేని ద్రాక్షలు విత్తనాలున్న దాని కంటే తొందరగా జీర్ణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణ సమయాన్ని మార్చే అంశాలు

జీర్ణ సమయం వ్యక్తి శరీరం, వయస్సు, జీర్ణ ఆరోగ్యం, ఆహారం ఎలా కలిపి తిన్నారనే దానిమీద ఆధారపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఉదాహరణకు, చికెన్‌ను బంగాళదుంపతో తింటే జీర్ణం కొంచెం ఆలస్యమవుతుంది. ఆహారం ఎంత తిన్నాం, నీరు ఎంత తాగాం, శరీర శ్రమ ఎంత చేశామనే వాటిపై కూడా జీర్ణం ఆధారపడుతుందట.

 

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×