Pakistan’s Fighter Jet F-16: F16 అనేది అమెరికన్ తయారీ యుద్ధ విమానం. సింగిల్-ఇంజన్, మల్టీరోల్ ఫైటర్ జెట్. గ్రౌండ్ అటాక్ మిషన్ల కోసం ఉపయోగిస్తారు. 1970లలో అభివృద్ధి చేయబడిన ఈ విమానం.. అనేక దేశాల వైమానిక దళాలలో ఉపయోగించబడుతోంది. F16 యుద్ద విమానంలో రాడార్, ఆయుధ సామర్థ్యాలు, అధునాతనమైన టెక్నాలజీ ఉంటుంది.
పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత సైన్యం కూల్చేసింది. పాక్‌లోని సర్గోధా వైమానిక స్థావరం నుంచి ఈ ఎఫ్-16 బయలుదేరింది. అయితే, ఈ ఎయిర్‌బేస్ స్థావరానికి సమీపంలోనే భారత్ ఎఫ్-16ను కూల్చేసినట్టు తెలుస్తోంది. భూతలం నుంచి ప్రయోగించిన క్షిపణి ఆ విమానాన్ని కూల్చేసినట్టు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
గతంలో 2019 బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్ తర్వాత జరిగిన డాగ్‌ఫైట్‌లో.. భారత వాయు సేన పైలట్ అభినందన్ వర్ధమాన్ ఒక పాకిస్తాన్ ఎఫ్-16 విమానాన్ని కూల్చినట్లు భారత్ తెలిపింది. ఈ ఘటనలో అభినందన్ తన మిగ్-21 బైసన్‌తో.. ఎఫ్-16ని కూల్చేసాడు. అయితే, పాకిస్తాన్ ఈ వాదనను ఖండించింది. ఎటువంటి ఎఫ్-16 కూలిపోలేదని చెప్పింది.
మరోవైపు పాక్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తోంది భారత్. INS విక్రాంత్ రంగంలోకి దిగింది. పాక్ నావల్ బేస్ లక్ష్యంగా మిస్సైల్స్ తో ఎటాక్ చేస్తోంది. కరాచీ పోర్ట్ పూర్తిగా ధ్వంసమైనట్టు ప్రచారం జరుగుతోంది. పాక్ కోస్టల్ ఏరియాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్ దాడులతో పాక్ నేవీ తోక ముడిచింది. 1971 తర్వాత తొలిసారి ఇండియన్ నేవీ నేరుగా రంగంలోకి దిగడం ఇదే తొలిసారి. ఈ ఎటాక్‌కు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
1971 యుద్ధంలో.. ఇండియన్ నేవీ కీలక పాత్ర పోషించింది. ఆపరేషన్ ట్రైడెంట్ పేరుతో డిసెంబర్4న పాక్ నేవీ హెడ్ క్వార్టర్స్‌పై సర్‌ప్రైజ్ ఎటాక్ చేసింది. INS నిపాట్, INS నీర్ఘాట్, INS వీర్ యుద్ధనౌకలు.. దాడులు చేశాయి. పాక్ నేవీకి చెందిన PNS ఖైబర్, PNS ముహఫీజ్ యుద్ధ నౌకలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు అదే తరహాలో దాడులు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: దేవుడే కాపాడాలి.. చేతులెత్తేసిన పాకిస్తాన్
ఇండియన్ నేవీలో NS విక్రాంత్.. బాహుబలిగా అని చెబుతారు. దీని బరువు 45 వేల మెట్రిక్ టన్నులు. పొడవు 262 మీటర్లు. దానిపై ఒకేసారి 30 మిగ్ 29K యుద్ధవిమానాలను నిలుపవచ్చు. ఒక్కో మిగ్ 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. గగనతల నిఘా కోసం ఉపయోగించే కామోవ్-31 హెలికాప్టర్లను, యాంటీ సబ్‌మెరైన్ మిషన్ కోసం వాడే హాల్ ధ్రువ్ హెలికాప్టర్లను INS విక్రాంత్ మీద మోహరిస్తారు. ఇక విక్రాంత్ రక్షణ కోసం దానిపై ఉపరితలం నుంచి గగన తలానికి దూసుకెళ్లే బరాక్-8 క్షిపణులు ఉంటాయి. INS విక్రాంత్‌ను శత్రు దుర్భేద్యంగా మార్చే కారియర్ బాటిల్ గ్రూప్ దాని వెంటే అంగరక్షకుల్లా ఉంటాయి. ఈ గ్రూప్‌లో కల్వరి క్లాస్ జలాంతర్గాములు, కోల్‌కతా క్లాస్ డిస్ట్రాయర్లు, తల్వార్ క్లాస్ ఫ్రిగేట్లు ఉంటాయి. వీటన్నింటితో ఐఎన్‌ఎస్ విక్రాంత్.. సముద్రంలో ఓ భారీ కోటలా ముందుకు దూసుకువెళ్లగలుగుతుంది.