Satyavedu TDP New Incharge: సత్యవేడు ఎంఎల్ ఎ ఆదిమూలంకు టిడిపిలో డోర్స్ క్లోజ్ అయ్యాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఆయన స్వయంకృతాపరాధంతోనే డోర్స్ క్లోజ్ అయ్యాయని అంటున్నారు. తాజాగా పార్టీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ సత్యవేడుపర్యటనలో ఆదిమూలం అనుచరులు వ్యవహారించిన తీరు కూడా అందుకు కారణంగా కనిపిస్తోంది. యువనేత సైతం ఆదిమూలం పేరు ప్రస్తావించకుండా సత్యవేడులో పార్టీ అబ్జర్వర్లను నియమించినట్లు చెప్పడంతో ఆ ఎమ్మెల్యే ఇక పార్టీకి దూరమైనట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సత్యవేడులో టీడీపీకి బలమైన నాయకుడు కరువు
సత్యవేడు నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పకృతి వనరుల అడ్డా. తమిళనాడు సరిహాద్దుల్లో ఉన్న ఆ సెగ్మెంట్లో శ్రీసిటి, హీరో హోండా సహాతో అనేక పరిశ్రమలు ఉన్నాయి. దానికి తోడు నిరంతరం ఇక్కడ నుంచి గ్రావెల్ తో పాటు కంకర లాంటివి చెన్నయికి తరలిపోతుంటాయి. ఇది రాజకీయ నాయకులకు అదనపు అదాయం . అలాంటిచోట పట్టు కోసం అన్ని పార్టీల నేతలు ప్రయత్నిస్తుంటారు. టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గం అయినప్పటికి ఎస్పీ రిజర్వుడు కావడంతో టీడీపీకి బలమైన నాయకుడు కరువయ్యారు.
టీడీపీ నుంచి 2009లో హేమలత విజయం, 2014లో తలారి అదిత్య గెలుపు
సత్యవేడులో టీడీపీ నుంచి 2009లో హేమలతా విజయం సాధించగా తర్వాత 2014లో తలారి అదిత్య గెలుపొందారు. 2019లో కోనేటి ఆదిమూలం వైసీపీ గాలిలో విజయం సాధించారు. ఆప్పట్లో ఆయన రబ్బర్ స్టాంప్ ఎమ్మెల్యేగా ఉన్నారన్న విమర్శలు వచ్చాయి. పెద్ద ఎత్తున పకృతి దోపిడి జరిగింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, పులివేందులకు చెందిన నాయకులు అక్కడ నుంచి ఎర్రమట్టిని యదేచ్చగా చెన్నైకి తరలించారు..సత్యవేడులో రహాదారుల దుస్థితి చూస్తే చాలు దోపిడి ఏవిధంగా జరిగిందో అర్థం అవుతుంది. 2024 ఎన్నికల నాటికి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలాన్ని తిరుపతి ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించింది. దాంతో ఆయన పెద్దిరెడ్డిపై బహిరంగంగా విమర్శలు గుప్పించి.. వైసీపీని వీడారు. టీడీపీ సభ్యత్వం తీసుకోకపోయినా పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో టీడీపీలో చాలామంది ఆదిమూలాన్ని వ్యతిరేకించినప్పటికి కూటమి గాలిలో విజయం సాధించారు…
ప్రత్యర్థుల స్కెచ్‌లో ఇరుక్కుని బుక్ అయిన ఆదిమూలం
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత టీడీపీ వర్గీయులు, …అది మూలం వర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. కోల్డ్ వార్ ముదిరింది. ఆదిమూలం బలహీనతను అడ్డం పెట్టుకుని కొంతమంది వేసిన స్కెచ్ లో ఆయన ఇరుక్కు పోయారు. ఆదిమూలం రాసలీలల విడియో మీడియాలోకి రావడంతో అయనను పార్టీ సస్పెండ్ చేసింది. తర్వాత పరిణామాలతో కోర్టు నుంచి ఎమ్మెల్యేకు ఉరట లభించినప్పటికి అయనపై పార్టీ సస్పెన్షన్ ఎత్తి వేయలేదు. ఆ క్రమంలో టీడీపీ సత్యవేడు నియోజకవర్గానికి డాక్టర్ శ్రీపతి బాబు తో పాటు చంద్రశేఖర్ నాయుడిని పరిశీలకులుగా నియమించింది. దాంతో పాటు నియోజకవర్గంలో ఎన్నికలలో అర్థికంగా అండదండలు అందించిన ఓ నాయకుడు కూడా పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.
నిరసన తెలుపడానికి సిద్దమైన ఆదిమూలం అనుచరులు
అయితే రాసలీలలు వీడియో కేసులో నుంచి ఆదిమూలం బయట పడినప్పటి నుంచి ఆదిమూలం అనుచరులు కొందరు కులం కార్డు అడ్డంపెట్టుకుని పెట్టి సస్పెషన్ ఎత్తి వేయాలంటు డిమాండ్ చేస్తున్నారు..దీనికితోడు తమ నాయకుడి మాటలను అధికారులు లెక్క చేయడం లేదంటు హాడావుడి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా సత్యవేడులో మంత్రి నారా లోకేష్ పర్యటన జరిగింది. నారా లోకేష్ పర్యటన సందర్భంగా అబ్జర్వర్ల నేతృత్వంలో కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి లోకేష్ రాక ముందు ఆదిమూలం అనుచరులు తమ నాయకుడిపై హైకోర్టులో కేసు వీగిపోయిందని పార్టీలోకి తీసుకుని అధికార బాధ్యతలు అప్పగించాలంటు ప్లకార్డులతో నిరసన తెలపడానికి గుమిగూడారు. దాంతో పోలీసులు వారిని వెంటనే అక్కడ నుంచి తరిమేసారు.
పరిశీలకులపై ఆరోపణలు చేస్తున్న ఆదిమూలం అనుచరులు
వారంతా ఆదిమూలంతో పాటు వైసిపి నుంచి వచ్చిన వారని టీడీపీ నేతలు అంటున్నారు.మరో వైపు దళితుడు కాబట్టి తమ నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసారని, కేవలం పరిశీలకులుగా వచ్చిన వారు ల్యాండ్ , శ్యాండ్ మాఫియా నడిపిస్తున్నారని ఆదిమూలం అనుచరులు బహిరంగంగా అరోపించారు. ఈనేపథ్యంలో వారిని సమావేశం దగ్గరకు కూడా రానివ్వకుండా పోలీసులు పంపించేశారు. అయితే శ్రీ సిటీలో జరిగిన ఎల్ జి కంపెనీ భూమి పూజకు మాత్రం ఎమ్మెల్యే ఆదిమూలాన్ని ప్రోటో కాల్ ప్రకారం అహ్వనించారు..
ఆదిమూలం కుమారుడికి ఇన్చిర్జ్ బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్
ఆదిమూలం కూమారుడు అయిన నారాయణవనం జడ్పీటిసి సుమన్ కు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాలని ఎమ్మెల్యే అనుచరులు డిమాండ్ చేస్తున్నారు .అయితే తాజాగా జరిగిన ఇష్యూతో యువనేత అగ్రహం వ్యక్తం చేస్తున్నారంట.తాము జరిగిన దాని పట్ల సానుభూతిగా ఉన్నప్పటికి తమ అనుచరుల చేత ప్లకార్డులు పట్టించి నిరసన తెలపడంతో అయన అగ్రహం వ్యక్తం చేసారంట.కార్యకర్తలను సైతం సుతిమెత్తగా నారాలోకేష్ హెచ్చరించారు. మీరు అలిగితే అందరం నష్ట పోయి ఇబ్బందులు పడతామని , 2019 ఎన్నికలలో క్యాడర్ అలగడం వల్ల జరిగిన అనర్థంతో అందరం ఇబ్బంది పడ్డామని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో మీ సమస్యలు వినడానికి చంద్రబాబుతో పాటు తాను ఎల్లప్పుడు సిద్దంగా ఉంటామని, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి సైతం ఉన్నారని భరోసా ఇచ్చారు.
Also Read: బీఆర్ఎస్ సైలెంట్.. కారణాలు ఇవేనా..!
నారాయణవనం, కేవీవీ పురం మండలాలు
మరో వైపు అబ్జర్వర్ల అధ్వర్యంలో గ్రామస్థాయి కమిటీలు , మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తారని తెలిపారు. త్వరలో కొత్త సత్యవేడుకు కొత్త ఇన్చార్జ్‌ని నియమించనున్నట్లు పార్టీ నేతలకు చెప్పారంట. అదలా ఉంటే నియోజకవర్గాల పునర్విభజన పక్రియలో సత్యవేడు నుంచి రెండు మండలాలు బయటకు పోయే పరిస్థితి ఉంది . నారాయణవనంతో పాటు కేవీవీ పురం మండలం ఇతర నియోజకవర్గాలలో కలసే అవకాశముందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇన్ చార్జ్ నియామకం ఉంటుందని అంటున్నారు.
స్వయం కృతాపరాధంతో పార్టీకి దూరమైన ఆదిమూలం
మొత్తానికి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం స్యయం కృతాపరాధం వల్లే లోకేష్ దూరం పెట్టారని అంటున్నారు. లోకేష్ ఆదిమూలం పట్ల సానుభూతిగా ఉన్నప్పటికి ప్లకార్డుల ప్రదర్శన ఇష్యూ తో అది కాస్తా చెరిగిపోయిందని అంటున్నారు. ఆయనతన చేజేతులారా తానే టిడిపి తలుపులు మూసుకు పోయే విధంగా చేసుకున్నాడని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరి సత్యవేడు కొత్త ఇన్చార్జ్‌గా టీడీపీ అధిష్టానం ఎవరిని నియమిస్తుందో చూడాలి.