BigTV English

Pakistan: పాక్ ప్రధాని సంచలన ప్రకటన.. భారత్‌తో చర్చలకు మేం రెడీ, కాకపోతే..

Pakistan: పాక్ ప్రధాని సంచలన ప్రకటన..  భారత్‌తో చర్చలకు మేం రెడీ, కాకపోతే..

Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ తన వైఖరి మార్చుకున్నట్లు కనిపించలేదు. తాను పట్టిన దానికి మూడు కాళ్లు అంటూ భీష్మించుకుని కూర్చొంది.  ఈ విషయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ అడుగు ముందుకేశారు. భారత్‌తో శాంతి చర్చలకు తాము సిద్ధమేనంటూ సంకేతాలు ఇచ్చారు. కాకపోతే కాశ్మీర్ అంశాన్ని అందులో చేర్చాలంటూ మెలిక పెట్టారు.


భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆపేందుకు అమెరికాతో దాయాది దేశం ఏం చెప్పిందో తెలీదు.  భారత్ మిస్సైళ్లు తమ అణు స్థావరాలపై పడ్డాయని, దీనివల్ల ముప్పు తప్పదని ప్రచారం చేయించి కాల్పుల విరమణకు రాయబారం పంపింది. దాయాది దేశం అనుకున్నట్లుగా కాల్పుల విరమణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో ఉన్న కామ్రా వైమానిక స్థావరాన్ని ఆదేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ గురువారం సందర్శించారు. అక్కడ ఏమైనా డ్యామేజ్ జరిగిందా? అనేదాని గురించి అధికారులను నుంచి అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఎంత డ్యామేజ్ అయ్యిందనేది తర్వాత విషయం.


కాకపోతే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన, షెహబాజ్ షరీఫ్, భారత్‌తో శాంతి కోసం సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. భారత్‌తో మాట్లాడేందుకు రెడీ అంటూ సంకేతాలు ఇచ్చారు. కాకపోతే కాశ్మీర్‌ అంశాన్ని చర్చల్లో చేర్చాలంటూ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్ మెలిక పెట్టారు.

ALSO READ: బ్రహ్మోస్‌కు పుల్ డిమాండ్.. విదేశాలకు భారత్ వెపన్స్

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటన సమయంలో ఆదేశ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్, ఢిఫెన్స్ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, వైమానిక దళ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అక్కడే ఉన్నారు. భారత్‌‌తో వైరం ఉండకూడదని భావించి వారంతా ఈ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఇరుదేశాల మధ్య యుద్ధం తర్వాత ఆదేశ ప్రధాని షెహబాజ్ రక్షణ కేంద్రాన్ని సందర్శించడం ఇది రెండోసారి. పాకిస్థాన్ ప్రకటనకు కొద్ది గంటల ముందు భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్‌ కీలక ప్రకటన చేశారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ అంశంపై ఆ దేశంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. దాయాది దేశంతో కేవలం ద్వైపాక్షిక సంబంధాలే ఉంటాయని అనేక ఏళ్లుగా చెబుతున్నామని తెలిపారు.

ప్రధాని నరేంద్రమోదీ కూడా ఇదే విషయాన్ని పదేపదే చెప్పుకొచ్చారు. పీఓకే విషయమైతేనే దాయాది దేశంతో చర్చలు ఉంటాయని అన్నారు. భారత్ మాటలకు అడ్డుకట్ట వేయాలని పాకిస్థాన్ ఈ విధంగా ప్రకటన చేసిందని అంటున్నారు. దీనివల్ల పీఓకే సమస్య ఇంకా జఠిలం కావడం ఖాయమని అంటున్నారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×