BigTV English

Pakistan PM Shehbaz: కుక్కతోక వంకర.. భారత్‌తో యుద్ధంలో మాదే విజయం-పాక్ ప్రధాని

Pakistan PM Shehbaz: కుక్కతోక వంకర.. భారత్‌తో యుద్ధంలో మాదే విజయం-పాక్ ప్రధాని

Pakistan PM Shehbaz: యుద్ధంపై పాక్ ప్రధాని హాట్ కామెంట్స్ చేశారు. మళ్లీ తన వక్రబుద్దిని చాటుకున్నారు. భాతర్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్తత కాల్పుల్లో.. పాకిస్తానే విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు. అయితే ఇరు దేశాలు కాల్పులు విరమణకు అంగీకరించిన తర్వాత.. మళ్లీ పాక్ కాల్పులు తెగబడటంపై ఎక్కడా ప్రకటన చేయలేదు పాక్ ప్రధాని. వారే మొదటి దాడి చేసి.. దానికి కౌంటర్ భారత్ దాడి చేసిన తర్వాత కూడా.. పాక్ ప్రధాని మాత్రం.. భారత్‌దే తప్పు అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.


పాకిస్థాన్‌ బుద్ధి ఎప్పటికీ వంకరే. దొంగదొబ్బ కొట్టడమే దాయాది దేశం పని. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసుకుంది. కాల్పుల విరమణ జరిగి.. కొన్ని గంటలు కూడా కాకముందే.. వక్రబుద్ధిని బయటపెట్టింది. చికటి పడగానే.. జమ్మూకాశ్మీర్‌లో మరోసారి కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణను బ్రేక్ చేసిన పాకిస్తాన్… సీజ్‌ ఫైర్‌కు అంగీకరించిన మూడు గంటల్లోనే.. మళ్లీ డ్రోన్లతో ఉసిగొల్పింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

అమెరికా, మరికొన్ని దేశాల దౌత్యంతో.. రెండుదేశాల మధ్య శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్‌ స్థాయిలో రెండు దేశాల అధికారుల మధ్య చర్చలు ఫలించాయి. అయితే.. కాసేపటికే పాకిస్థాన్‌ మళ్లీ దాడులకు తెగబడింది. సరిహద్దులోని పలు ప్రాంతాలపైకి డ్రోన్లు ప్రయోగించింది. రెండు దేశాలు శాంతికి అంగీకరించాయని అంతకుముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు.


కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొద్ది గంటల్లోనే జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్‌ డ్రోన్లు కనిపించాయి. దీంతో గగనతల రక్షణ వ్యవస్థతో వాటిని కూల్చేసింది భారత ఆర్మీ. అఖ్నూర్, పింజార్, బారాముల్లా, అనంతనాగ్, బట్వారాలలో పాక్‌ డ్రోన్లను సైన్యం కూల్చేసింది.

జమ్ముకాశ్మీర్‌లోని అనంతనాగ్‌, బుడ్గం, శ్రీనగర్, రాజోరి, ఆర్ఎస్ పుర, అక్నూర్‌లో.. అనుమానాస్పద డ్రోన్లను స్థానికులు గుర్తించారు. భారీ శబ్దాలతో ఈ డ్రోన్లు.. పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినట్లు చెప్తున్నారు. జమ్ము వైపు సూసైడ్‌ డ్రోన్స్‌ ప్రయోగించింది పాకిస్తాన్‌, ఉధంపూర్‌ వైపు కూడా డ్రోన్లు దూసుకొచ్చాయి. శ్రీనగర్ లోని ఆర్మీ హెడ్ క్వార్టర్ ను టార్గెట్ చేసింది పాకిస్తాన్. ఆర్మీ హెడ్ క్వార్టర్ వైపు నాలుగు డ్రోన్లు దూసుకొచ్చాయి. పాకిస్తాన్‌ డ్రోన్లను ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసింది భారత్‌. డ్రోన్లు కనిపిస్తే కూల్చివేసింది.

Also Read: 14 సార్లు యుద్దం.. పాక్ ఎంత చిత్తుగా ఓడిందంటే..

సరిహద్దుల్లోని ఆర్మీ పోస్టులే టార్గెట్‌గా పాక్‌ వైపు నుంచి దాడులు జరిగాయి. చినార్‌ కార్ప్స్‌ హెడ్‌క్వార్టర్‌పై డ్రోన్లతో దాడికి యత్నించింది. పోఖ్రాన్‌ వైపు 8 డ్రోన్లు దూసుకొచ్చాయి. ఇటు శ్రీనగర్‌లోని ఆర్మీ హెడ్‌క్వార్టర్‌ వైపు 6 డ్రోన్లతో ఎటాక్ చేశారు. డ్రోన్లను డిఫెన్స్‌ సిస్టం ఎప్పటికప్పుడూ అడ్డుకుంది. శ్రీనగర్, జమ్మూ, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, జైసల్మేర్, బికనీర్‌లలో మళ్లీ బ్లాకౌట్. శ్రీనగర్‌ అంతటా పేలుడు శబ్ధాలు వినిపించాయని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్‌ అబ్దుల్లా చెప్పారు.

 

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×