Pakistan: భారత్-పాకిస్థాన్ యుద్ధం వేళ దాయాది దేశానికి అసలు కష్టాలు రెట్టింపు అయ్యాయా? బలోచిస్థాన్‌లో వేర్పాటువాద ఉద్యమం తీవ్రమైందా? తాజాగా ఓ నగరాన్ని బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకోవడంతో స్వదేశంలో దాయాదికి అసలైన సవాల్ ఎదురైందా? భారత్ గండం నుంచి గట్టెక్కినా? బలోచిస్థాన్ బూచి వ్యవహారం పాక్‌కు ఇంకా పొంచి వుందా? బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఎవరి మాటా వినరా? అవుననే అంటున్నారు నిపుణులు.
రెచ్చిపోయిన బలోచ్ లిబరేషన్ ఆర్మీ
ట్రెండ్‌ను తనకు అనుకూలంగా మార్చుకుంది బలోచ్ లిబరేషన్ ఆర్మీ. భారత్‌తో పాకిస్థాన్ యుద్ధానికి దిగిన వేళ.. బలోచ్ లిబరేషన్ ఆర్మీ తన ప్రతాపం చూపింది. ఏకంగా కాలత్ జిల్లాలోని మంగోచర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఓ వైపు భారత్.. మరోవైపు బలోచిస్థాన్ వేర్పాటు వాదం మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతోంది దాయాది దేశం.
బలోచిస్థాన్ ప్రావిన్స్ పాకిస్థాన్‌కు కొరడరాని కొయ్యగా మారింది. కాలత్ జిల్లాలోని మంగోచర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ శనివారం వెల్లడించింది. తాను ఇప్పటివరకు బలోచిస్థాన్ వ్యాప్తంగా 39 ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశామన్నది వేర్పాటు వాదుల మాట. అయితే మా ఆపరేషన్ ఆగలేదని ఇంకా కొనసాగుతోందని చెప్పకనే చెప్పేసింది.
మిలిటరీ కాన్వాయ్‌లపై దాడులు చేస్తామన్నది పాక్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఆ ప్రావిన్సులని కొంత ప్రాంతాల పోలీసులను బలోచ్ లిబరేషన్ ఆర్మీ బందీలుగా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తమ నియంత్రణలోకి తీసుకున్నార వేర్పాటు వాదులు.
ALSO READ: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ దారుణ హత్య?
బలోచ్ రెబల్స్ ప్రకటనపై పాకిస్థాన్ ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. పాక్ ఆర్మీ సిబ్బందిపై తిరుగుబాటు దారులు దాడి చేయగా.. 22 మంది సైనికులను చంపేసినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దాయాది దేశం ఎలా రియాక్ట్ అవుతుందోనన్న చర్చ అప్పుడే మొదలైంది.
ఇదీ అసలు కథ
పాకిస్థాన్ భూభాగంలో 44 శాతం ఆక్రమించుకుంది బలోచిస్థాన్. కాకపోతే ఆ ప్రాంతంలో వ్యవసాయం పనికి వచ్చేభూమి కేవలం ఐదు శాతం మాత్రమే. రాళ్లు, రప్పలు, ఎడారి ప్రాంతం ఉంటుంది. అభివృద్ధి లేకపోవడంతో ఈ ప్రాంతం వేర్పాటు వాదులు పుట్టుకొచ్చారు.
బలోచిస్థాన్ పట్ట పాకిస్థాన్ వ్యతిరేకత ప్రదర్శిస్తూ వచ్చింది. తమకు ప్రత్యేక దేశం కావాలన్న వేర్పాటువాదం ఆకాంక్ష 1948లో ప్రారంభమైంది. పలుమార్లు అక్కడ ఉద్యమాలు మొదలయ్యాయి. ఇస్లామాబాద్ తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తోందని బలోచి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. బలోచిస్థాన్‌లో సున్నీ వేర్పాటువాద సంస్థ జైష్ అల్ అద్ల్‌ను పాక్ ప్రోత్సహిస్తోందని దుయ్యబడుతున్నారు.
పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ ప్రావిన్సులో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు వనరులకు కేరాఫ్ అడ్రస్. వీటి నుంచి వచ్చే ఆదాయం ఇస్తామాబాద్ ఖజానాకు చేరుకుంది. కానీ పాక్ పాలకులు మాత్రం బలోచి ప్రజలను పట్టించుకున్నపాపాన పోలేదు. ఫలితంగా పేదరికం క్రమంగా పెరిగిపోయింది. వేర్పాటు వాదుల నుంచి పాకిస్తాన్ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.