Sumanth : అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో సుమంత్ ఒకరు.. గతంలో ఈయన ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.. ఈ మధ్య పెద్దగా సినిమా లేకపోయినా సోషల్ మీడియాలో ఈయన పేరు తెగ వినిపించేస్తుంది. ఈ హీరోకు గతంలో పెళ్లైన విషయం అందరికీ తెలిసిందే. అయితే మనస్పర్ధలు కారణంగా తన భార్యతో విడిపోయాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన జీవితంలో పెళ్లి అనేదాన్ని తీసుకురాలేదు. కానీ ఇప్పుడు మాత్రం తాజాగా సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు పై హీరో రెస్పాండ్ అయ్యారు. హీరోయిన్ తో పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై సుమంత్ ఏమన్నారో చూద్దాం..
రెండో పెళ్లి పై క్లారిటీ..
హీరో సుమన్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో ప్రేమలో ఉన్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ క్లోజ్ గా దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాంతోనే నిజంగానే వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలపై సుమంత్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. నేను సోషల్ మీడియా కి చాలా దూరంగా ఉంటాను. ఇలాంటి రూమర్స్ రావడం కొత్తేమి కాదు. నేను ప్రస్తుతం సింగల్ గానే ఉన్నాను. ఇదే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పెళ్లి ఉద్దేశ్యం లేదన్నట్టే మాట్లాడారు. సుమంత్ వయసు ఇప్పుడు 50 ఏళ్లు. తాత నాగేశ్వరరావు నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. వాటిని ఆయన జాగ్రత్తగా కాపాడుకొంటూ వస్తున్నారు. సినిమా నిర్మాణం వైపు కూడా ఆయన దృష్టి సారించడం లేదు.. ప్రస్తుతం సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాను తప్ప, పెళ్లి చేసుకోవాలని ఆలోచన నాకు లేదని ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేశారు. సుమంత్ ఇచ్చిన ఆన్సర్ తో అందరినోళ్లు మూత పడిపోయాయి..
Also Read :లండన్ లో వ్యాక్స్ స్టాట్యూ తో రామ్ చరణ్.. ఏ హీరోకు దక్కని రికార్డు..
సుమంత్ సినిమాలు..
హీరో సుమన్ ఒకప్పుడు మంచి హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈమధ్య పెద్దగా సినిమాలు చేయట్లేదు. అప్పుడప్పుడు నేనున్నాను అంటూ ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాడు.. తాజాగా ఈటీవీ విన్ లో అనగనగాలో నటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. ఈనెల 15 నుంచి దీన్ని చూసేయ్యొచ్చు. మృణాల్ తో నేను దిగిన ఫొటో సీతారామం అప్పటిది. దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పెళ్లి అంటూ రాస్తున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. సీతారామం తర్వాత ఆమెతో కనీసం టచ్ లు కూడా లేను. నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు.. ఇలాంటి రూమర్స్ ని మరోసారి క్రియేట్ చేయొద్దు అంటూ ఇండైరెక్టుగా నెడిజెన్స్ కి సుమంత్ వార్నింగ్ ఇచ్చేశారు. ఇక ఈయన సినిమాలను చూస్తే.. ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..