Pakistan: నిజం నిప్పులాంటిది. ఈ రోజు కాకపోయినా, రేపైనా బయటకు వస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ అదే చేసింది. ఇన్నాళ్లు పాలకులు అధికారుల నోరు మూసినా, నిజం అన్నది బయటపడింది. దాయాది దేశానికి చెందిన ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ అధికారి అసలు గుట్టు బయటపెట్టారు. దాడికి పాల్పడింది తామేనని నిజం అంగీకరించాడు. ఇంతకీ అసలు నిజం ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
సరిగ్గా ఆరేళ్ల కిందట అంటే 2019లో జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో టెర్రరిస్టుల దాడి జరిగింది. ఈ ఘటనలో 40 మంది సైనికులు మరణించారు. ఈ బాంబుదాడి వెనుక తమ హస్తం ఉందని అంగీకరించింది పాకిస్థాన్. ఈ విషయాన్ని పాక్ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ మీడియా సమావేశంలో బయటపెట్టారు. ఇన్నాళ్లు ఉగ్రవాదులతో తమకు సంబంధం లేదని చెప్పుకుంటూ వచ్చింది. ఇస్లామాబాద్ పాలకులు చెబుతున్నవి అబద్దాలేనని తేలిపోయింది.
అప్పటి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఈ దాడిలో తమ పాత్ర లేదని పదేపదే చెప్పుకొచ్చారు. దీనిపై వివరాలు సేకరించిన మోదీ సర్కార్.. టెర్రరిస్టు స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేపట్టారు. ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్‌తో అప్పటి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిన విషయం తెల్సిందే.
పుల్వామా దాడికి సంబంధించి పీఓకేలోని జేషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై వైమానిక దాడులు చేపట్టింది భారత్. పాకిస్తాన్ ప్రతి స్పందన నేపథ్యంలో వైమానిక దాడికి దారి తీసింది. ఈ క్రమంలో భారత పైలట్ అభినందన్ వర్థమాన్ అక్కడి సైన్యం అదుపులోకి తీసుకుంది. అయితే, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో కొన్నిరోజుల తర్వాత అభినందన్‌ను విడుదల చేస్తున్నట్లు ఆదేశ ప్రధాని జాతీయ అసెంబ్లీలో వెల్లడించారు.
ALSO READ: రైలు ఎక్కే చిన్నారి, అక్కడే ప్రాణం వదిలింది
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో జరిగిన మీడియా సమావేశంలో డీజీఐఎస్‌పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదురి, నేవీ అధికారులో కలిసి ఔరంగజేబ్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్‌కు చెందిన గగనతలం, భూభాగం, జల సరిహద్దులకు ముప్పుగా పరిణమిస్తే ఎదుర్కొనేందుకు రాజీ పడబోమన్నారు.
దానిని పట్టించుకోకుండా ఉండలేమని బయటపెట్టారు. మా దేశ ప్రజల కీర్తి మొత్తం దళాల్లో ఇమిడి ఉందన్నారు. పుల్వామాలో మా అద్భుతమైన ఎత్తుగడలను చూపించామని, వ్యూహాత్మక చతురతను ప్రదర్శించామని వెల్లడించారు. ఔరంగజేబ్ అహ్మద్ వ్యాఖ్యలతో ఉగ్రవాదాన్ని పోషిస్తోందన్నది పాకిస్థాన్ అనేది మరోసారి స్పష్టమైందన్నారు.
పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని దాయాది దేశం బుకాయించినా, వైమానిక అధికారి వ్యాఖ్యలతో అసలు వాస్తవం బయటకు వచ్చిందన్నారు. ఇప్పుడు కాకపోయినా రేపైనా పహల్‌గామ్ దాడి బయటకు వస్తుందని అంటున్నారు భారత అధికారులు.