Tamilnadu Tour: భారతదేశం ఒక అద్భుతమైన దేశం. ఇక్కడ ప్రతి రాష్ట్రంలోనూ అనేక రకాల పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మీరు మీ జీవితాంతం భారతదేశ అందాలను అన్వేషిస్తూ గడిపితే.. జీవితం అంతమైపోతుంది కానీ ఈ ప్రత్యేక ప్రదేశాలు అంతం కావు. ఉత్తరం నుండి దక్షిణం వరకు.. భారతదేశం అంతటా, అందమైన లోయలు , పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అనేక ప్రత్యేకమై దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదిలా ఉంటే దక్షిణాన తమిళనాడులో అద్భుతమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అక్కడ మీరు ప్రయాణించడం ద్వారా మీ జీవితాన్ని మరింత అందంగా మార్చుకోవచ్చు. ఈ ప్రత్యేక ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు పర్యాటక ప్రదేశాలు:
కొడైకెనాల్:
మీరు మే, ఆగస్టు నెలలో ఎక్కడికైనా ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే.. ఖచ్చితంగా తమిళనాడుకు వెళ్లండి. నిజానికి.. తమిళనాడు చాలా అందమైన రాష్ట్రం. కానీ కొడైకెనాల్ ఇక్కడి అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. సముద్ర మట్టానికి దాదాపు 7 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం దక్షిణ భారతదేశంలోని అత్యుత్తమ ప్రదేశాలలో ఒకటి.పెళ్లి తర్వాత చాలా మంది హనీమూన్‌కు వెళ్లడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఉన్న కొడైకెనాల్ సరస్సు, బ్రయంట్ పార్క్, సిల్వర్ కాస్కేడ్ జలపాతం, కోకర్స్ వాక్ అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. మీరు మీ పాట్నర్‌తో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌ను కూడా ప్లాన్ చేసుకోవచ్చు.
ఏలగిరి:
బెంగళూరు నుండి దాదాపు 3 గంటల దూరంలో.. ఒక అందమైన ప్రదేశం ఉంది. ఏలగిరి అని పిలువబడే ఈ అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఇది సముద్ర మట్టానికి దాదాపు 11 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తారు. ఇక్కడ ప్రతి దృశ్యం ప్రత్యేకమైనదే అయినప్పటికీ.. సూర్యాస్తమయం సూర్యోదయం సమయంలో అందం మరింత పెరుగుతుంది. ఇక్కడ మీరు జలగంపరై జలపాతాన్ని కూడా ఆస్వాదించవచ్చు. దీంతో పాటు.. పుంగనూర్ లేక్ పార్క్ , స్వామిమలై కొండలు వంటి అద్భుతమైన ప్రదేశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే.. మీ పాట్నర్‌తో సంతోషంగా సమయాన్ని గడపవచ్చు.
వెల్లూర్:
ఆగస్టు నెలలో.. తమిళనాడులోని వెల్లూరుకు చాలా మంది టూరిస్టులు వస్తారు. నిజానికి, దక్షిణ భారతదేశంలోని అందమైన ప్రదేశాలలో వెల్లూరు అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. పలార్ నది ఒడ్డున ఉన్న ఈ నగరాన్ని చోళ రాజులు, విజయనగర చక్రవర్తులు, రాష్ట్రకూట రాజులు , బ్రిటిష్ వారు పరిపాలించారు. ఇది సాంస్కృతికంగా గొప్ప ప్రదేశంగా చెబుతారు. వెల్లూరు నగరంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. అఈ ప్రత్యేక ప్రదేశాన్ని చూడటం వల్ల మీరు ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి పొందుతారు.
Also Read: లడఖ్.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్, ఎందుకంత స్పెషల్ అంటే ?
ఈ ప్రదేశాలు కూడా చూడొచ్చు:
వెల్లూరు, ఏలగిరి , కొడైకెనాల్ కాకుండా.. మీరు చూడాల్సిన మరిన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. తమిళనాడులో మీరు కూనూర్, సేలం, అనమలై టైగర్ రిజర్వ్, చిదంబరం , ధనుష్కోడి వంటి ప్రత్యేకమైన అందమైన ప్రదేశాలను చూడొచ్చు. ఈ అద్భుతమైన ప్రదేశాలను చూడటం ద్వారా మీకు చాలా ప్రత్యేకమైన అనుభవం లభిస్తుంది.