BigTV English

India: పాక్ జాతీయులకు టైమ్ క్లోజ్.. ఫైన్‌తోపాటు ఆపై జైలు

India: పాక్ జాతీయులకు టైమ్ క్లోజ్..   ఫైన్‌తోపాటు ఆపై జైలు

India: పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తానీయులు తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్రంం. లాంగ్ టర్న్ వీసా దారులకు ఇచ్చిన గడువు ఆదివారంతో ముగిసింది. దాదాపు పాక్ జాతీయులు ఆదేశానికి వెళ్లినట్టు సమాచారం. ఇంకా ఎవరైనా ఉంటే వారిపై కేంద్రం కొరడా ఝులిపించింది.


ఉండిపోయిన పాక్ జాతీయులపై కేంద్రం కొరడా

పహల్గాం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్‌ కఠిన చర్యలు చేపట్టింది. ఆదేశ వీసాల కింద భారత్‌లో ఉన్న పాక్‌ పౌరులను కేంద్రం ఇచ్చిన గడువు ముగిసింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారిపై కొరడా ఝులిపించనుంది. గడువు దాటినా తర్వాత భారత్‌లో ఉంటే వారిని అరెస్టు చేయవచ్చు. గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, 3 లక్షల రూపాయల జరిమానా రెండూ విధించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


మూడు రకాల వీసాలపై భారత్‌లో వేలాది మంది పాకిస్థానీయులు ఉంటున్నారు. ఒకటి లాంగ్ టర్న్ వీసా, రెండోది ఆరోగ్యం మీద వచ్చిన వీసా.. మూడోది సార్క్ వీసాల కింద దాదాపు 12 వర్గాల ప్రజలు భారత్‌లో ఉంటున్నారు.  వ్యాపారం, సినిమా, జర్నలిస్టులు, ట్రాన్సిట్, కాన్ఫరెన్స్, ట్రెక్కింగ్, విద్యార్థి, సందర్శకులు, గ్రూప్ టూరిస్ట్ వీసాలు అందులో ఉన్నాయి.

సార్క్‌ వీసాల కింద వచ్చినవారికి గడువు ఏప్రిల్‌ 26తో ముగిసింది. లాంగ్ టర్న్ వీసాల మీద వచ్చినవారికి ఆదివారం(ఏప్రిల్ 27)వరకు గడువు ఇచ్చింది. అది కాస్త ముగిసిపోయింది. వైద్య వీసాల కింద వచ్చినవారికి మంగళవారం(ఏప్రిల్ 29)తో వారి గడువు ముగియనుంది.

ALSO READ: భారత్ ఆంక్షల ఎఫెక్ట్.. పాక్‌లో వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా?

ఏప్రిల్‌ 4 నుంచి ‘ఇమిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ యాక్ట్‌- 2025’ అమల్లోకి వచ్చింది. గడువు తీరిపోయినా ఇక్కడే ఉండటం, వీసా నిబంధనలు ఉల్లంఘించడం, నిషేధిత ప్రాంతాలను సందర్శించడం వంటివి చేస్తున్నారు. వారికి మూడేళ్ల జైలు శిక్ష, 3 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు కేంద్రప్రభుత్వం.

ప్రయాణంలో పాక్ పౌరులకు తప్పని ఇబ్బందులు

ఈ వ్యవహారంపై ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. విమానంలో వెళ్లాలంటే పాకిస్థాన్ గగన తలాన్ని మూసివేసింది. దీంతో స్వదేశానికి వెళ్లే పాకిస్తానీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  చాలామంది పంజాబ్ మీదుగా పాక్‌కు వెళ్తున్నారు. మరికొందరు అటారీ, వాఘా సరిహద్దు మీదుగా తిరుగుబాట పట్టారు.

మరికొందరు నేపాల్ వెళ్లి అక్కడి నుంచి విమానంలో వెళ్తున్నారు. గడిచిన మూడు రోజుల్లో 509 మంది ఈ సరిహద్దు ద్వారా దేశం దాటారు. మరోవైపు పాక్‌లో భారతీయులు 745 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. పహల్గామ్ ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దేశానికి వచ్చినవారిని పంపడమే కాదు.. చివరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం తెల్సిందే. మంగళవారం తర్వాత అన్నిరాష్ట్రాల వెళ్లిన పాక్ జాతీయుల లెక్క తేలనుంది. అప్పటికే కేంద్రం ఆదేశ పౌరులకు ఇచ్చిన గడువు ముగియనుంది. ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం కష్టాలు తప్పవన్నమాట.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×