Indian Sanctions on Pakistan: ఎవ్వరూ ఊహించని అత్యంత పాశవికమైన ఉగ్రదాడికి.. యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. అద్భుతమైన కశ్మీర్ అందాలను తిలకిస్తున్న పర్యాటకులపై.. విచక్షణారహితంగా జరిగిన దాడులకు 26 మంది ప్రాణాలు కోల్పాయారు. ఐదు నుండి ఏడుగురు తీవ్రవాదులు పహల్గామ్‌లో చేసిన విధ్వంసం.. కార్గిల్ నుండి కన్యాకుమారి వరకూ ప్రతి భారతీయుడి రక్తాన్ని మరిగిస్తోంది. కశ్మీర్ తీవ్రవాదాన్ని భూసమాధి చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. మతవాదం పులుముకున్న ఈ ఉగ్రవాద చర్యలను కూకటి వేళ్లతో పెకిలిస్తామని భారత ప్రధాని హామీ ఇచ్చారు. భారతదేశ స్ఫూర్తిని దెబ్బతీసిన ఉగ్రవాదుల్ని, వాళ్ల వెనుకున్న ఏ ఒక్కర్నీ వదలమని ప్రకటించారు. నిజానికి, ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనేది సుస్పష్టంగా అర్థం అవుతోంది.
ఏప్రిల్ 22, 2025 మధ్యాహ్నం జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకోడానికి అన్ని విధాలుగా సిద్ధం అవుతోంది. విదేశీ పర్యటనను మధ్యలోనే ముగించుకొచ్చిన భారత ప్రధాని మోడీ అత్యవసర మీటింగ్ తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంలో ప్రధాని మోడీ అధ్యక్షతన తీసుకున్న ఐదు ఇందులో కీలకంగా మారాయి. ముఖ్యంగా, 1960లో ఇరు దేశాల మధ్య జరిగిన సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేసారు. కశ్మీర్‌లో ఉగ్రదాడులకు పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నందుకు ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. అయితే, ఈ దెబ్బతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం కానుంది.
మాములుగానే ప్రస్తుతం పాకిస్థాన్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోంటోంది. అక్కడ ఎప్పటి నుంచో నీటి కొరత కూడా ఉంది. ఈ టైమ్ లో భారత్ తీసుకున్న కఠిన నిర్ణయంతో పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగిలింది. నీటి సరఫరా నిలిపివేసింది. దీంతో పాక్ ఇండియాపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతుంది. యుద్ధంతో భయం లేదంటూనే కవ్వింపులకు దిగుతోంది భారత్. ఉగ్రవాదం విషయంలో రోజుకో మాట మాట్లాడుతోంది. ఇన్నాళ్లూ ఉగ్రవాదానికి ఆశ్రయమిచ్చామని ఒప్పుకుంటోంది. ఇంకోవైపు వారంతా స్వాతంత్ర సమరయోధులు అని పాక్ కు చెందిన మరికొందరు నేతలు అంటున్నారు. అంతేకాదు.. సింధు జలాలు ఆపితే మీ ఊపిరి ఆపేస్తామని లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ లాంటి వాళ్లు వార్నింగ్‌లు ఇచ్చేదాకా పరిస్థితి వెళ్లింది.
మనవాళ్లు సమ్మర్ వేకేషన్ కోసం కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ వెళితే.. టైమ్ చూసుకుని దాడులు చేశారు. ఇప్పటికే పలుమార్లు ఇండియాపై.. పాకిస్థాన్ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఇక ఉగ్రవాదాన్ని తన పెరట్లో మొక్కలాగా పెంచి పోషిస్తున్న పాక్‌కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయ్యింది భారత్. దాయాది దేశానికి ఎన్ని విధాలుగా షాక్ ఇవ్వాలో అన్ని అవకాశాలను వాడేసుకోంటుంది. ఇప్పుడు పాక్‌కు కష్టాలతో పాటు నష్టాలు కూడా ప్రారంభమయ్యాయి.
Also Read: పాక్ కుంభస్థలం బద్దలే.. మ్యాప్ నుండి అవుట్..!
ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్థాన్‌లో నిత్యావసర సరుకుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. లీటర్ వాటర్ బాటిల్ ధర ఏకంగా రూ.140 ఉన్నట్లు తెలుస్తోంది. లీటర్ పాలు రూ.110 గా ఉంది. తినే రొట్టెలు అయితే.. ఎన్నడూ లేనంతగా.. రూ.500 చేరుకుంది. చికెన్ రూ.800, రైస్ రూ.340 ఉంది. ఇప్పుడే ఆకాశాన్నంటుతున్న ధరలు.. ముందు రోజుల్లో ఎలా ఉండబోతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాక్ ప్రజలు.